Dharani
టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియోకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది బీఎస్‌ఎన్‌ఎల్. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియోకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది బీఎస్‌ఎన్‌ఎల్. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..
Dharani
భారతీయ టెలికాం రంగంలో జియో ఓ సంచలనం అని చెప్పవచ్చు. జియో రాక ముందు.. వచ్చాక అన్నట్లుగా పరిస్థితులు మారాయి. జియో దెబ్బకు ఎయిర్‌టెల్, వోడాఫోన్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా నష్టపోయాయి. కొన్నైతే.. టెలికాం రంగం నుంచి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక జియో కొట్టిన దెబ్బకు అన్ని ప్రముఖ టెలికాం కంపెనీలు.. అన్‌లిమిటెడ్ డేటా, కాల్స్‌ను అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా జియోకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది బీఎస్‌ఎన్‌ఎల్. ఆ వివరాలు..
భారత టెలికాం మార్కెట్లో పలు సంచలనాలకు మూల కారణం జియో. భారత్‌ను డిజిటల్ ఇండియాగా తీర్చి దిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించింది జియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంట్రీ ఇచ్చిన ప్రారంభంలో.. భారీ స్థాయిలో కస్టమర్లను ఆకర్షించేందుకు మొదటగా ఉచిత సిమ్‌తో పాటు ఫ్రీ డేటాను ఆఫర్ చేసింది జియో. ఈ క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఇదే దారిలో పయనించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం టెలికాం కంపెనీలన్ని రీఛార్జ్ రేట్లను పెంచుతూ పొతుండగా.. జియో మాత్రం.. చౌక ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అంతేకాక జియో మాదిరిగానే.. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉచిత సిమ్ పంపిణీని ప్రారంభించింది. మారుమూల ప్రాంతాలకు సైతం తమ కస్టమర్ బేస్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీఎస్‌ఎన్‌ఎల్. ఇందులో భాగంగా ఉచితంగా 4జీ సిమ్ ఇచ్చి వినియోగదారులను అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తోంది.
దీనిలో భాగంగా మీరు కనక ఉచితంగా బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్‌ను ఉచితంగా పొందాలంటే.. మీకు దగ్గర్లోని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సేవా కేంద్రం, సహా ఫ్రాంచైజీలను సంప్రదించి ఈ ఉచిత 4జీ సిమ్మును పొందవచ్చు. ఇందుకోసం సాధారణ కేవైసీ పత్రాలైనా ఆధార్, ఓటర్ కార్డులతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్స్ సమర్పించి సిమ్ సొంతం చేసుకోవచ్చు. గతంలో పేపర్ అప్లికేషన్స్ ద్వారా తీసుకున్న సిమ్‌లను కూడా ఇప్పుడు డిజిటల్‌కు మార్చే ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్. ఇక జియోను ఎదుర్కొవడం కోసం.. మిగతా టెలికాం కంపెనీలు.. నానా పాట్లు పడుతున్నాయి. ఇందులో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ ఇలా ఉచిత సిమ్మును పంపిణీ చేసేందుకు రెడీ అయ్యింది.