iDreamPost
android-app
ios-app

Smartphones: 14వేలలో బెస్ట్ ఫోన్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

  • Published Sep 05, 2024 | 7:00 AM Updated Updated Sep 05, 2024 | 7:00 AM

Smartphones under 14K: త్వరగా హ్యాంగ్ కాకుండా బడ్జెట్ ధరలో దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Smartphones under 14K: త్వరగా హ్యాంగ్ కాకుండా బడ్జెట్ ధరలో దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Smartphones: 14వేలలో బెస్ట్ ఫోన్ కావాలా? అయితే వీటిపై ఓ లుక్కేయండి..

బడ్జెట్ ధరలో 14 వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

14 వేల లోపు మంచి మొబైల్ ఫోన్ కావాలనుకునేవారికి iQOO Z9x బెస్ట్ అనే చెప్పాలి. ఈ ఫోన్ తక్కువ బడ్జెట్లో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది. దీనిలో ఆకట్టుకునే అంశం ఏంటంటే దీని బ్యాటరీ. ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒక రోజంతా వస్తుంది. ఈ ఫోన్ మంచి డిస్ప్లే కలిగి ఉంది. ఇది మంచి స్పీకర్ సెటప్ తో వస్తుంది. దీంతో ఆడియో క్లియర్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ IP64 వాటర్ రెసిస్టన్స్, డస్ట్ రెసిస్టన్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 52 ఎంపీ బ్యాక్ కెమెరా ఇంకా 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ ర్యామ్ విషయానికి వస్తే.. 8జీబీ రామ్ ఉంటుంది. అలాగే 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ కలిగి ఉంటుంది. దీని ధర రూ. 12,998 నుంచి ఉంటుంది.

ఇక 14 వేల లోపు దొరికే స్మార్ట్ ఫోన్లలో పోకో ఎం6 ప్లస్ కూడా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఈ ఫోన్ కూడా ఆకట్టుకునే ఫీచర్లని అందిస్తుంది. దీనిలో ముందుగా చెప్పుకునే బెస్ట్ అంశం ఏంటంటే.. దీని కెమెరా. ఈ ఫోన్ కి 108 ఎంపీ బ్యాక్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 ఎంపీ కెమెరా ఉంటుంది. తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి కెమెరా సెటప్ ఏ ఫోన్ ఇవ్వదు. దీని ర్యామ్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఈ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ మంచి డిస్ప్లే కలిగి ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇది 5030 mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. ఇక ధర విషయానికి వస్తే.. దీని ధర 13,499 రూపాయల నుంచి ఉంటుంది.

14 వేల బడ్జెట్ ధరలో మార్కెట్లో లభించే బెస్ట్ ఫోన్లలో Vivo T3x కూడా బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ 6,000mAh బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే.. బ్యాక్ 50+2ఎంపీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 ఎంపీ కెమెరా ఉంటుంది. ఇక ఈ ఫోన్ ర్యామ్ విషయానికి వస్తే.. ఇది 8 జీబీ ర్యామ్ కలిగి ఉంటుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజి విషయానికి వస్తే.. ఈ ఫోన్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఇది రూ. 13,449 నుంచి స్టార్ట్ అవుతుంది. 15 వేల లోపు త్వరగా హ్యాంగ్ కాకుండా మంచి స్మార్ట్ ఫోన్ కోరుకునే వారికి ఈ స్మార్ట్ ఫోన్ నిజంగా బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. మరి ఈ స్మార్ట్ ఫోన్ల పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.