iDreamPost
android-app
ios-app

Bjaj Chetak 2024: 127 కిలోమీటర్ల రేంజ్.. Bajaj Chetak అదిరిపోయే EV!

ప్రస్తుతం అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్ నే కొనాలని చూస్తు్నారు. అలాంటి వారి కోసం బజాజ్ నుంచి ఒక సరికొత్త ఈవీ విడుదలైంది.

ప్రస్తుతం అందరూ ఎలక్ట్రిక్ స్కూటర్ నే కొనాలని చూస్తు్నారు. అలాంటి వారి కోసం బజాజ్ నుంచి ఒక సరికొత్త ఈవీ విడుదలైంది.

Bjaj Chetak 2024: 127 కిలోమీటర్ల రేంజ్.. Bajaj Chetak అదిరిపోయే EV!

ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టూవీలర్ అయితే ఈవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. పెట్రోలు బెడద ఉండదు, ఫ్యూయల్ అయిపోతే ఏం చేయాలి అనే బాధ ఉండదు. తాజాగా జరిగిన సమ్మెల వల్ల బంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన అవసరం లేదు. అందుకే ఎక్కువ మంది ఈవీ బైక్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ లోకి బజాజ్ చేతక్ కొత్త ఈవీ ఒకటి విడుదలైంది. ఈ 2024 మోడల్ లుక్స్, ఫీచర్స్, రేంజ్, ధర వివరాలను ఇప్పుడు చూద్దాం.

బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ వాహనాలను మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు 2024లో బజాజ్ చేతక్ కంపెనీ సరికొత్త ఈవీని లాంఛ్ చేసింది. బజాజ్ చేతక్ 2024 మోడల్ ని రిలీజ్ చేశారు. స్టన్నింగ్ లుక్స్ తో, యాంబియంట్ కలర్స్ తో ఈ బజాజ్ చేతక్ వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటీ అర్బన్ స్టాండర్డ్, అర్బన్ టెక్ ప్యాక్, ప్రీమియం అనే 3 వేరియంట్స్ తో వస్తోంది. ఈ బైక్ 113 నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ తో వస్తోంది. దీనికి కలర్డ్ డిస్ ప్లే ఉంటుంది. మీరు తక్కువ వెలుగులో, సూర్యుడి ఎండలో కూడా వివరాలను చక్కగా చూడచ్చు. ప్రీమియంలో అయితే 5 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే లభిస్తుంది. ఇందులో మొత్తం 4 కలర్స్ ఉంటాయి. అంతేకాకుండా మంచి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Bajaj Chethak EV

ముఖ్యంగా ఈ బైక్ లో మీకు హిల్ హోల్డ్ అసిస్టెన్స్ లభిస్తుంది. అంటే ఎత్తుల వద్ద బైక్ ఆగినప్పుడు వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉండదు. అలాగే ఈ బైక్ రివర్స్ కూడా ఉంటుంది. వెనక్కి వెళ్లాలంటే నెట్టాల్సిన అవసరం ఉండదు. వీటిలో నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. నార్మల్ మోడ్ లో 63 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని పొందచ్చు. అలాగే ప్రీమియం మోడల్ లో గరిష్టంగా 73 కిలోమీటర్ల వరకు వేగంగా వెళ్లచ్చు. మీకు ప్రీమియం మోడల్ లో 3.2 KWH బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. 800 వాట్స్ స్పీడ్ ఛార్జర్ లభిస్తుంది. మీరు కేవలం 3 గంటల 50 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయచ్చు. సింగిల్ ఛార్జ్ లో 127 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయచ్చు.

అర్బన్ వేరియంట్ లో 4.50 గంటల వ్యవధిలో బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయచ్చు. ఇందులో జియో లొకేషన్ ఆప్షన్ ఉంది. అంటే మీరు మీ బైక్ ని ఎక్కడ పెట్టినా మీ మొబైల్ ద్వారా కనుక్కోవచ్చు. ఇంక ఈ బజాజ్ చేతక్ ధరల విషయానికి వస్తే.. చేతక్ టెక్ ప్యాక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.23 వేలు, స్టాండర్డ్ మోడల్ ధర రూ.1.15 వేలు, చేతక్ ప్రీమియం ధర రూ.1.15 వేలుగా ఉంది. ఈ ధరలతో చేతక్ 2024కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లుక్స్ పరంగా, రేంజ్, టాప్ స్పీడ్ పరంగా కూడా బజాజ్ చేతక్ 2024 మోడల్ కు మంచి మార్కులే పడతాయి. కానీ, ధర విషయంలో మాత్రం మరో రూ.5 నుంచి 10 వేల వరకు తగ్గింపు ఉంటే ఇంకా మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పచ్చు. మరి బజాజ్ చేతక్ 2024 మోడల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.