Ather 450 Series: ఏథర్ EVపై అదిరే ఆఫర్స్.. ఏకంగా రూ.24 వేల వరకూ తగ్గింపు!

ప్రస్తుతం అందరూ ఈవీలపై మోజు పడుతున్నారు. కానీ, వాటి ధరలు మాత్రం మండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ మంచి ఆఫర్స్ తో ముందుకొచ్చింది.

ప్రస్తుతం అందరూ ఈవీలపై మోజు పడుతున్నారు. కానీ, వాటి ధరలు మాత్రం మండిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఏథర్ ఎనర్జీ కంపెనీ మంచి ఆఫర్స్ తో ముందుకొచ్చింది.

ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో ఉండే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కారు కంటే కూడా.. టూ వీలర్ లో ఈవీని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. పెట్రోలు ధరలు చూస్తుంటే ఎలక్ర్టిక్ వాహనాలను కొనుగోలు చేయడమే బెటర్ అనుకుంటున్నారు. అందులోనూ సాధారణ వాహనాల ధరలు కూడా ఈవీల స్థాయికి చేరుతున్నాయి. అందుకే అన్నీ ఊహించుకుని ఈవీ బైకులు కొనాలని చాలామంది ఫిక్స్ అవుతున్నారు. అయితే ఇటీవల ఈవీల ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కాస్త ఈవీ బైకులు కొనడం తగ్గించారు. దాంతో అన్నీ కంపెనీలు ఆఫర్స్ ని ప్రకటించాయి. ఏథర్ కంపెనీ కూడా వినియోగదారులను ఆకర్షించేలా డిసెంబర్ పేరిట ఆఫర్లు తీసుకొచ్చింది.

ఏథర్ ఎనర్జీకి చెందిన ఈవీ బైకులకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. స్టైల్, ప్రైస్, లుక్స్, స్పెసిఫికేషన్స్ అన్నింటిలో ఏథర్ ఈవీలో అన్ని కంపెనీలకు గట్టిపోటీని ఇస్తున్నాయి. ఇప్పుడు ఏథర్ ఎనర్జీ మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450ఎస్ మోడల్స్ పై అన్ని ఆఫర్స్ కలుపుకుని రూ.24 వేల వరకు ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ఆఫర్ లో రూ.6,500 వరకు డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ రూ.6,500ల్లో రూ.5 వేలు డిస్కౌంట్ కాగా.. రూ.1,500 కార్పొరేట్ బెనిఫిట్స్ ని అందిస్తున్నారు. వీటికి అదనంగా రూ.7 వేలు విలువజేసే ఏథర్ బ్యాటరీ ప్లాన్ ని మీరు పొందవచ్చు. దీనిలో మీరు గరిష్టంగా ఐదేళ్లు లేదంటే.. 60 వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీ ప్రొటెక్షన్ పొందవచ్చు. అలాగే 70 శాతం స్టేట్ ఆఫ్ హెల్త్ గ్యారెంటీ కూడా ఉంటుంది. మీరు జీరో డౌన్ పేమెంట్ తో కూడా ఈ ఏథర్ 450 సిరీస్ బైకులను పొందవచ్చు. గరిష్టంగా 60 నెలల వరకు మీరు ఈఎంఐని పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. పైగా 5.99 శాతం వార్షిక వడ్డీ రేట్లతో ఫైనాన్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఈ ఏథర్ 450 సిరీస్ ఈవీల ధరలు సబ్సిడీలు పోను.. రూ.1.29 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. 450ఎక్స్ 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ మోడల్ ధర రూ.1.44 లక్షలుగా ఉంది. 450ఎక్స్ మోడల్ అయితే మొత్తం ఆరు కలర్స్ లో అందుబాటులో ఉంది. అదే 450ఎస్ మోడల్ అయితే కేవలం 4 రంగుల్లోనే అందుబాటులో ఉంది. ఈ బైక్స్ 3.3 సెకన్ల నుంచి 3.9 సెకన్ల వ్యవధిలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకోగలవు. వీటి టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్ల నుంచి 110 కి.మీ. స్పీడ్ గా వెళ్లగలవు. ఇవి 111 కిలోమీటర్ల నుంచి 150 కిలోమీటర్ల వరకు రేంజ్ తో వస్తున్నాయి. ఈ మోడల్స్ లో 17.7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఉంటుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, వాటర్ రెసిస్టెన్స్, 4జీ కనెక్టివిటీ, బ్లూటూత్, స్నాప్ డ్రాగన్ 212 క్వాడ్ కోర్ 1.3 గిగా హెట్జ్ ప్రాసెసర్ తో వస్తోంది. ఈ మోడల్స్ లో రివర్స్ గేర్ కూడా ఉంటుంది. మరి.. ఏథర్ కంపెనీ ఇస్తున్న ఈ డిసెంబర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments