iDreamPost
android-app
ios-app

మీ ఫోన్లో ఈ 13 యాప్స్ లో ఏదున్నా.. వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి!

Play Store Removed Harmful Apps: సాధారణంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అవసరం ఉన్నా లేకపోయిన చాలా యాప్స్ ని ఇన్ స్టాల్ చేస్తారు. కానీ, ఇలాంటి యాప్స్ ని మాత్రం వెంటనే డిలీట్ చేయండి.

Play Store Removed Harmful Apps: సాధారణంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అవసరం ఉన్నా లేకపోయిన చాలా యాప్స్ ని ఇన్ స్టాల్ చేస్తారు. కానీ, ఇలాంటి యాప్స్ ని మాత్రం వెంటనే డిలీట్ చేయండి.

మీ ఫోన్లో ఈ 13 యాప్స్ లో ఏదున్నా.. వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి!

ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు. అయితే ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రైవసీ అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరి డేటా, ఎవరి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్స్ భద్రత లేకుండా పోతోంది. ఏ మాత్రం ఆదమరపుగా ఉన్నా.. ఏ చిన్న పొరపాటు చేసినా.. పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. అందుకే స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలంటూ టెక్ నిపుణులు మాత్రమే కాదు.. ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ మోసాలు ఎక్కువగా మీరు వాడే యాప్స్ ద్వారా జరగుతూ ఉంటాయి. అలాంటి కొన్ని ప్రమాదకారి యాప్స్ కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా స్మార్ట్ ఫోన్లో మీరు ఎన్నో రకాల యాప్స్ వాడుతూ ఉంటారు. మీ హెల్త్ కి సంబంధించి, రోజువారీ అవసరాల కోసం, కొన్ని పనులను వేగంగా పూర్తి చేయడం కోసం కొన్ని రకాల యాప్స్ ని వాడుతూ ఉంటారు. అయితే ఏ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్ అయినా కూడా యాప్స్ ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ నమ్మదగినవి అని. అంతేకాకుండా ప్లే స్టోర్ ఎప్పటికప్పుడు ఆ యాప్స్ పనితీరు, వివరాలను అంచనా వేయడం, బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ చేయడం చేస్తూ ఉంటుంది. అలా ఏమైనా యాప్స్ పై అనుమానం వస్తే వాటిని పూర్తిగా పరిశీలించడమే కాకుండా.. ఏదైనా ప్రమాదకారి మాల్ వేర్ ఉంటే ప్లే స్టోర్ నుంచి తొలగిస్తుంది కూడా. ఇప్పుడు అలా ప్లే స్టోర్ 13 యాప్స్ ని తొలగించింది. అందుకు సంబంధించిన వివరాలను మెకాఫే అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ నివేదికలో వెల్లడించింది.

ఇలాంటి యాప్స్ ద్వారా యూజర్ ప్రమేయం లేకుండానే ఫోన్ ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ ఫోన్ కి వచ్చే అన్ని నోటిఫికేషన్స్ ని డిసేబుల్ చేస్తారు. అంటే మీ ఫోన్ లో ఏ చిన్న పని చేసినా మీకు అస్సలు తెలియదు. అలాగే డేటా చోరీకి ఉపయోగపడే థర్డ్ పార్టీ యాప్స్ ని కూడా వీళ్లు మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేస్తారు. అలా చేయడం ద్వారా మీ డేటా పోవడం మాత్రమే కాకుండా.. మీ ఫోన్ ని పూర్తిగా వారి ఆధీనంలోకి తీసుకుంటారు. అలాగే మీ బ్యాంక్ అకౌంట్స్ వివరాలు తీసుకోవడం మాత్రమే కాకుండా.. నగదు లావాదేవీలు కూడా చేస్తారు. ఇక్కడ ఇంకో దారుణం ఏంటంటే.. వాళ్లు మీ ఖాతాని ఖాళీ చేసిన విషయం కూడా మీకు అస్సలు తెలియదు. అందుకే మీరు ఒక యాప్ ని ఇన్ స్టాల్ చేసే సమయంలో అది ట్రెస్టెడా? కాదా? అస్సలు ఈ యాప్ కి మనం ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి? అనే విషయం తెలుసుకోవాలి. అంతేకాకుండా కొన్ని యాప్స్ సంబంధంలేని అనుమతులు అడుగుతూ ఉంటుంది.

Third party apps issue to phone

ఉదాహరణకు మీరు ఒక క్యాలుక్యులేటర్ యాప్ ని ఇన్ స్టాల్ చేశారు. ఆ యాప్ కి మీ మీడియా ఫైల్స్ తో సంబంధం లేదు. కానీ, అది మీ ఫైల్ మేనేజర్ కి పర్మిషన్ అడుగుతోంది అంటే మీకు అనుమానం రావాలి. అలాంటి యాప్స్ ని ఇన్ స్టాల్ చేయకుండా ఉండాలి. మెకాఫే చెప్పిన ప్రకారం.. ఎస్సెన్షియల్ హారోస్కోప్, 3D స్కిన్ ఎడిటర్ ఫర్ పీఈ మైన్ క్రాఫ్ట్, లోగో మేకర్ ప్రో, ఆటో క్లిక్ రిపీటర్, కౌంట్ ఈసీ కేలరీ కాలుక్యులేటర్, సౌండ్ వాల్యూమ్ ఎక్స్ టెండర్, లెటర్ లింక్, న్యూమరాలజీ: పర్సనల్ హారోస్కోప్- నంబర్ ప్రిడిక్షన్స్, స్టెప్ కీపర్: ఈజీ పీడియో మీటర్, ట్రాక్ యువర్ స్లీప్, సౌండ్ వాల్యూమ్ బూస్టర్, ఆస్ట్రాలజీ నేవిగేటర్: డైలీ హారోస్కోప్ అండ్ టారోట్, యూనివర్సెల్ కాలుక్యూలేటర్ అనే యాప్స్ ని ప్లే స్టోర్ తొలగించింది. ఈ యాప్స్ మీ ఫోన్ లో ఉంటే మీరు కూడా వెంటనే వాటిని డిలీట్ చేయండి. అలాగే ఈ వివరాలను మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేసుకుని వారిని కూడా ఒకసారి అలర్ట్ చేయండి.