iDreamPost
android-app
ios-app

భారతీయ విద్యార్థి ప్రతిభకు టిమ్ కుక్ ఫిదా.. ఆశ్చర్యపోయాను అంటూ..!

Apple CEO Tim Cook Praises Indian Student Akshat Shrivastava: యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారతీయ విద్యార్థి అయిన అక్షత్ శ్రీవాస్తవను ప్రశంసించారు. అయితే అసలు ఎవరు ఈ అక్షత్ శ్రీవాస్తవ? అంత గొప్ప పని ఏం చేశాడు?

Apple CEO Tim Cook Praises Indian Student Akshat Shrivastava: యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారతీయ విద్యార్థి అయిన అక్షత్ శ్రీవాస్తవను ప్రశంసించారు. అయితే అసలు ఎవరు ఈ అక్షత్ శ్రీవాస్తవ? అంత గొప్ప పని ఏం చేశాడు?

భారతీయ విద్యార్థి ప్రతిభకు టిమ్ కుక్ ఫిదా.. ఆశ్చర్యపోయాను అంటూ..!

యాపిల్ సీఈవో టిమ్ కుక్ ను ఒక భారతీయ విద్యార్థి సర్ ప్రైజ్ చేశాడు. అలాంటి విద్యార్థుల మేధస్సుకు తాను ఎంతగానో ఆశ్చర్యపోయాను అంటూ టిమ్ కుక్ వెల్లడించారు. తాను భారత్ లో పర్యటించిన సమయంలో ఎలాగైతే కొన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోయానో.. అలాగే ఈ విద్యార్థి మేధస్సు చూసి కూడా చాలా ఆశ్చర్యం కలిగింది అంటూ టిమ్ కుక్ వెల్లడించారు. జూన్ 10 నుంచి 14 వరకు కాలిఫోర్నియాలో యాపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024 జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కంటే ముంతే టిమ్ కుక్ అక్షత్ ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

యాపిల్ నిర్వహిస్తున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ కాలిఫోర్నియాలో జరుగుతోంది. దానికంటే ముందే టిమ్ కుక్ అక్షత్ శ్రీవాస్తవను కలిశారు. అందుకు కారణం ఏంటంటే.. అతని మేధస్సుకు టిమ్ కుక్ మెస్మరైజ్ అయిపోయారు. అక్షత్ మరెవరో కాదు.. గోవాలోని బిట్స్ పిలానీ కేకే బిర్లా కాలేజీలో చదువుతున్నాడు. అతని వయసు 22 ఏళ్లు. అక్షత్ శ్రీవాస్తవ డెవలపర్ కూడా. అక్షత్ శ్రీవాస్తవతో జరిపిన సంభాషణను టిమ్ కుక్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. అలాగే పలువురు డెవలపర్స్ అయిన విద్యార్థులను కలిసి మాట్లాడారు. అందులో స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ లో విజయం సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారు.

టిమ్ కుక్ తాను గతేడాది భారత్ ని సందర్శించినప్పుడు పలువురు డెవలపర్స్ ని కలిశానన్నారు. మానవ జీవితాన్ని మెరుగు పరిచే పలు ఆలోచనలు వారి వద్ద ఉండటం చూసి ఆశ్చర్యపోయాను అన్నారు. అలాగే అక్షత్ శ్రీవాస్తవను కలవడం కూడా అలాగే ఉంది అంటూ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. క్లాసిక్స్ గేమ్స్ పై తనకున్న మక్కువను తర్వాతి తరాలకు చేరవేయాలి అనే తన తపన ప్రశంసనీయం అన్నారు. ఇదిలా ఉండగా.. స్విఫ్ట్ స్టూడెంట్స్ ఛాలెంజ్ లో అక్షత్ శ్రీవాస్తవ మైండ్ బడ్ అనే యాప్ ని సృష్టించాడు. ఈ మైండ్ బడ్ అనేది పిల్లలు ఆహ్లాదంగా ఉండేందుకు.. కుటుంబం, ఫ్రెండ్స్ తో సరదాగా గడిపేందుకు ఉపయోగపడే నాలుగు చిన్న గేమ్స్ కలిగి ఉంటాయి.

ఈ యాప్ ని అక్షత్ తన మేనల్లుడితో పంచుకున్న ఆనంద క్షణాల నుంచి రూపొందించింది అని వెల్లడించాడు. ఈ యాప్ తయారు చేసేందుకు అక్షత్ శ్రీవాస్తవ స్విఫ్ట్ యూఐ, ఎవికిట్, పెన్సిల్ కిట్, ఫైల్ మేనెజర్లను ఉపయోగించుకున్నాడు. ఇది కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఉంటుంది. అక్షత్ పేరు ఇప్పుడు మాత్రమే కాదు.. కరోనా మహమ్మారి సమయంలో కూడా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల ఆధారంగా ఆస్పత్రుల్లో ఖాళీ పడకలను ట్రాక్ చేసే విధంగా ఒక యాప్ ని అక్షత్ శ్రీవాస్తవ రూపొందించాడు. అక్షత్ శ్రీవాస్తవను టిమ్ కుక్ ప్రశంసించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.