iDreamPost
android-app
ios-app

ఐ ఫోన్ వాడుతున్నారా? మీరు ఈ డేంజర్ లో ఉన్నట్టే!

iPhone Users: ఇటీవల కాలంలో అనేక రకాల వైరస్ లు స్మార్ట్ ఫోన్లను అటాక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి వైరస్ ల బారిన పడకుండా.. ఉండేందుకు టెక్ సంస్థలు కీలక సూచనలు చేస్తుంటాయి. తాజాగా ఐ ఫోన్ వినియోగిస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలంట.

iPhone Users: ఇటీవల కాలంలో అనేక రకాల వైరస్ లు స్మార్ట్ ఫోన్లను అటాక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి వైరస్ ల బారిన పడకుండా.. ఉండేందుకు టెక్ సంస్థలు కీలక సూచనలు చేస్తుంటాయి. తాజాగా ఐ ఫోన్ వినియోగిస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలంట.

ఐ ఫోన్ వాడుతున్నారా? మీరు ఈ డేంజర్ లో ఉన్నట్టే!

నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.  ఒక్కొక్కరు ఒక్కొక్కరమైన కంపెనీకి చెందిన ఫోన్లను వాడుతున్నారు. ఇక ఆర్థిక స్థోమతను బట్టి వివిధ రకాల ఫోన్లను వినియోగిస్తుంటారు. అలానే చాలా మంది ఐ ఫోన్ ను ఉపయోగిస్తుంటారు. ఇక ఈ మోడల్ ఫోన్ అంటే.. చాలా మందికి ప్రత్యేకమైన ఆసక్తి. అందులో అనేక రకమైన ఫీచర్లు ఉంటాయి. అందుకే దీనిని కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఐ ఫోన్ వినియోగదారులకు , ఐ ఫోన్ వాడుతున్నవారికి  ఓ కీలక అలెర్ట్ వచ్చింది. వారు ఓ విషయంలో జాగ్రత్తగా ఉండాలని యాపిల్ కంపెనీ హెచ్చరించింది. మరి.. విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఇటీవల కాలంలో అనేక రకాల వైరస్ లు స్మార్ట్ ఫోన్లను అటాక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అలాంటి వైరస్ ల బారిన పడకుండా.. ఉండేందుకు టెక్ సంస్థలు, టెక్ నిపుణులు కీలక సూచనలు చేస్తుంటారు. తాజాగా ఐ ఫోన్ వినియోగిస్తున్న వారు కూడా జాగ్రత్తగా ఉండాలంట. ఐ ఫోన్లలో కొత్త వైరస్ ఎటాక్ జరిగే ప్రమాదం ఉందంట. పెగాసస్ స్పైవేర్ లాంటి నిఘా సాఫ్ట్ వేర్ అటాక్ చేసే ప్రమాదం ఉందట. ఆ స్పైవేర్ ఐ ఫోన్లు టార్గెట్  చేస్తుందని, దీని వల్ల ఫోన్లోని డేటాకి,  వినియోగదారుడి వ్యక్తిగత సమాచారంకి సంబంధించి భద్రతకు ముప్పు ఉందంట. ఐ ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని ప్రముఖ మొబైల్ సంస్థ యాపిల్ కంపెనీ హెచ్చరించింది.

Alert for Iphone Users

ఇది యాపిల్ మొబైల్ వినియోగదారులకు బిగ్ షాక్  అనే చెప్పాలి. ఇండియాతో పాటు 97 దేశాలకు ఈ ఐ ఫోన్ కంపెనీ అలెర్ట్ జారీ చేసింది. యాపిల్ ఫోన్లు హాక్ అయ్యే ఛాన్స్ ఉందని  సదరు సంస్థ ప్రకటించింది.  పట్టిష్టమైన భద్రత కలిగి ఐవోఎస్ ఆపరేటింగ్ ను కూడా పెగాసెస్ లాంటి మెర్సినరీ స్పైరవేర్  దాడి చేయగలదని సదరు సంస్థ తెలిపింది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, సమృద్ధ భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పుష్పరాజ్ దేశ్‌ పాండే మైక్రో బ్లాగింగ్ సైట్ ఫోన్లకు ఈ హెచ్చరిక వచ్చింది. వారి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మెర్సినరీ స్పైవేర్  అనేది చాలా ప్రమాదరమైనదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ స్పైవేర్ అటాక్ సైబర్ కేటుగాళ్లు చేసే పనులు, లేదా వినియోదారులను అటాక్ చేసే మాల్‌వేర్ కంటే చాలా అడ్వాన్స్ డను చెబుతున్నారు.

ఈ దాడులు ఎన్ వోఎస్  గ్రూప్ కి చెందిన పెగాసస్ లాగే ఇది కూడా ప్రమాదకరమైనవిగా గుర్తించారు. మెర్సినరీ స్పైవేర్ అనేది మన ఫోన్  డివైస్ లోని మొత్తం డేటా, ఇతర సమాచారాన్ని హ్యాక్ చేసే హ్యాకర్స్ చేతికి అందిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా టెక్ దిగ్గజం ఎన్ఎస్ వో గ్రూప్ నుండి పెగాసస్ వంటి మెర్సినరీ స్పైవేర్ ని ఉపయోగించి లక్ష్యంగా చేసింది. ఈ నేపథ్యంలోనే ఈనెల11న యాపిల్ ఫోన్ యూజర్లకు అలెర్ట్  పంపింది. యూజర్ కు చెందిన యాపిల్ ఐడీతో అటాచ్ చేసిన ఇమెయిల్ అడ్రెస్ లకు, ఫోన్ నంబర్‌లకు యాపిల్ ఇమెయిల్, ఐ మెసేజ్ నోటిఫికేషన్ పంపుతుంది. అయితే  ఇప్పటి వరకు ఇండియాలో ఎంతమందికి ఈ హెచ్చరికల సందేశాలు వెళ్లాయనేది మాత్రం స్పష్టంగా తెలియదు. ఇలాంటి నేపథ్యంలో ఐ ఫోన్ యూజర్లు జాగ్రత్తగా ఉండాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.