iDreamPost
android-app
ios-app

తక్కువ ధరకే Airtel కొత్త ప్లాన్! మధ్యతరగతి వారికి ఇది బెస్ట్ ఆప్షన్!

టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ మరో అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో తక్కువ ధరకే 45 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే?

టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ మరో అదిరిపోయే ప్లాన్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో తక్కువ ధరకే 45 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే?

తక్కువ ధరకే Airtel కొత్త ప్లాన్! మధ్యతరగతి వారికి ఇది బెస్ట్ ఆప్షన్!

ఫోన్ ఏదైనా సరే ఉపయోగించుకోవాలంటే తప్పనిసరిగా రీఛార్జ్ చేసుకోవాల్సిందే. కాల్స్, మెసేజెస్, ఎంటర్ టైన్ మెంట్ వీడియోలు చూడాలంటే ఇంటర్నెట్ తో కూడిన రీఛార్జ్ ప్లాన్ తప్పనిసరి. ప్రముఖ టెలికాం కంపెనీలు తమ యూజర్లకోసం సూపర్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. మార్కెట్ లో తమ సత్తా చాటేందుకు అట్రాక్లివ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఓటీటీలను కూడా ఫ్రీగా పొందేలా సబ్ స్క్రిప్షన్ కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. తక్కువ ధరతోనే ఎక్కువ రోజుల వ్యాలిడీటిని పొందేలా ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

తాజాగా ఎయిర్‌టెల్‌ తక్కువ ధరలో 45 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.279 ధరతో 45 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. తక్కువ ధరలో ఎక్కువ రోజులు వచ్చే ప్లాన్స్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్ రూ.279 తో రీఛార్జీ చేసుకుంటే అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సహా మొత్తంగా 600 ఎస్ఎంఎస్ లను వినియోగించుకోవచ్చు. 2జీబీ డేటాను పొందవచ్చు. అదనపు డేటా కోసం రీఛార్జీ చేసుకోవాల్సి ఉంటుంది. వీటితోపాటు వింక్ మ్యూజిక్‌, హలోట్యూన్స్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. మూడు నెలలపాటు అపోలో 24|7 సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అయితే డేటా ఎక్కువగా వినియోగించని వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.

ఇటీవల ఎయిర్‌టెల్‌ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ తో కలిపి మరో ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.699 రీఛార్జీ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, హై స్పీడ్ డేటా సహా 20 పైగా OTT (ఓవర్‌ ది టాప్‌) సబ్‌స్క్రిప్షన్‌ లను పొందవచ్చు. ఈ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్, రోజువారీ 3జీబీ హైస్పీడ్‌ డేటా సహా రోజుకు 100 ఎస్ఎంఎస్ లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు 5జీ నెట్‌ వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది.