Dharani
కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ తీసుకు వచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ బదులు 35 రోజుల పాటు ఉండే ప్లాన్‌ను కస్టమర్లకు అందించనుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు మీ కోసం..
కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ తీసుకు వచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీ బదులు 35 రోజుల పాటు ఉండే ప్లాన్‌ను కస్టమర్లకు అందించనుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు మీ కోసం..
Dharani
ప్రస్తుతం టెలికాం రంగంలో విపరీతమైన పోటీ ఉంది. జియో రాకతో ఇది మరింత పెరిగింది. ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే.. సంచలనాలు క్రియేట్ చేసింది. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ ప్యాక్‌లు తీసుకొచ్చింది. ఈ దెబ్బకు కస్టమర్లు జియోకి మారారు. ఈ పోటీని తట్టుకోవడం కోసం అప్పటికే ఈ రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ వంటి కంపెనీలు దిగి రాక తప్పలేదు. ఇక పోటీని తట్టుకుని.. కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ తీసుకువచ్చింది. దీని వ్యాలిటిడీ ఏకంగా 35 రోజులు కావడం గమనార్హం. ఆ ప్లాన్ వివరాలు..
తన కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఎయిర్‌టెల్ 35 వ్యాలిడిటీ ఉన్న ప్లాన్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఇప్పుడు రీఛార్జ్ ప్లాన్స్ వ్యాలిడిటీ ఏవైనా 28 రోజులు మాత్రమే కానీ ఎయిర్‌టెల్ దీనికి భిన్నంగా 35 రోజుల వ్యాలిడిటీతో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరతో.. ఎక్కువ వ్యాలిడిటీ ఉండే రీఛార్జ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం చూస్తున్న ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ప్లాన్ ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన 35 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.289. దీనిలో కస్టమర్లు ఎస్‌ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో సహా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 300 ఎస్‌ఎంఎస్ సేవతో వస్తుంది. ఇందులో కస్టమర్లు 4 జీబీ డేటా ప్రయోజనం కూడా పొందుతారు. అంటే ఈ కొత్త రూ. 289 రీఛార్జ్ ప్లాన్ ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన అవసరం లేని వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇంట్లో వైఫై సదుపాయం ఉండి.. మీరు వాడే మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచడానికి మాత్రమే రీఛార్జ్ చేయాల్సి వస్తే.. ఈ రూ. 289 ప్లాన్ మీకు ఉపయోగపడుతుంది.
ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకొచ్చిన మరో చౌకైన ప్లాన్ ధర రూ.19. ధర పరంగా, ఇది ఎయిర్‌టెల్ చౌకైన ప్లాన్. ఎయిర్‌టెల్ రూ. 19 టాప్ అప్ ప్లాన్‌లో 1 జీబీ డేటా ఒక రోజు అందుబాటులో ఉంది. తక్కువ డేటా అవసరమయ్యే కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమం. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా ఒక రోజు మాత్రమే.