iDreamPost
android-app
ios-app

నాడు కాళ్ళ కింద వరల్డ్ కప్.. నేడు అహం దిగిన మిచెల్ మార్ష్! ఇదే కర్మ ఫలితం!

టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓటమిని చవిచూసింది. పరాజయంపాలైన ఆసిస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ అహం దిగింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓటమిని చవిచూసింది. పరాజయంపాలైన ఆసిస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో ఆసిస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ అహం దిగింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

నాడు కాళ్ళ కింద వరల్డ్ కప్.. నేడు అహం దిగిన మిచెల్ మార్ష్! ఇదే కర్మ ఫలితం!

అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగిస్తున్నది. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆసిస్ ను చిత్తు చిత్తు చేస్తూ 2023లో జరిగిన వరల్డ్ కప్ లో ఓటమికి బదులు తీర్చుకుంది టీమిండియా. మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆసిస్ ఘోరమైన ఓటమి తర్వాత టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా మిచెల్ మార్ష్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. 2023 ప్రపంచకప్ లో భారత్ ను ఓడించి టైటిల్ ను అందుకుంది ఆసిస్. ఆ తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ ప్రపంచ కప్ ట్రోఫీపై కాలు పెట్టి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీనికి గాను మార్ష్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడిపోపోగా మార్ష్ మరింత దిగజారిపోయి బంగ్లాదేశ్ గెలవాలని ఆశించాడు.

ప్రపంచ దేశాలు పోటీపడిన వరల్డ్ కప్ ట్రోఫీ పట్ల ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ అహంకార ధోరణితో వ్యవహరించాడు. ప్రపంచకప్ లో విజయం పట్ల ఎంతో గౌరవంగా ఉండాల్సిన కెప్టెన్ మిచెల్ మార్ష్ అతిగా వ్యవహరించాడు. తాజాగా ఆ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ రేస్ లో నిలిచేందుకు ఇతర జట్టుపై ఆధారపడి ఆ జట్టు గెలవాలని కోరుకున్నాడు. కానీ అతడి ఆశలు అడియాశలయ్యాయి. ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓటమిపాలు కావడంతో ఆసిస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇక దీనిపై క్రికెట్ లవర్స్ మిచెల్ మార్ష్ పట్ల రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎంత ప్రతిభ గల టీమ్ అయినా.. ప్రతిభ గల ఆటగాడైనా సరే ఒదిగి ఉండాలని అతి చేస్తే కాలం సమాధానం చెప్తుందంటూ ఏకిపారేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్ ట్రోఫీపై కాలు పెట్టి దిగజారి ప్రవర్తించిన మిచెల్ మార్ష్ నేడు టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కి చేరేందుకు బంగ్లాదేశ్ టీమ్ పై ఆధారపడడం.. ఈ టీమ్ గెలవాని కోరుకోవడం వారి పతనానికి నిదర్శనం అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.