Lok Sabha Elections 2024 Jofra Archer Tweet: లోక్​సభ ఎన్నికల ఫలితాలు.. వైరల్ అవుతున్న జోఫ్రా ఆర్చర్ ట్వీట్!

లోక్​సభ ఎన్నికల ఫలితాలు.. వైరల్ అవుతున్న జోఫ్రా ఆర్చర్ ట్వీట్!

లోక్​సభ ఎన్నికలు-2024 కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు బుధవారం రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్​లో 240 సీట్లు గెలుచుకొని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

లోక్​సభ ఎన్నికలు-2024 కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు బుధవారం రిజల్ట్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్​లో 240 సీట్లు గెలుచుకొని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.

లోక్​సభ ఎన్నికలు-2024 కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు? ఎవరు అధికారంలోకి వస్తారు? అనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఏర్పడింది. ఎట్టకేలకు బుధవారం రిజల్ట్స్ వచ్చాయి. నిన్న మధ్యాహ్నానికే ఫలితాలపై ఓ అవగాహన వచ్చేసింది. ఎలక్షన్ కౌంటింగ్ పూర్తైంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 240 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అందని విధంగా అసలు ఫలితాల్లో భారీ వ్యత్యాసం కనిపించింది. ఈసారి 400 సీట్లు గెలుస్తామంటూ ధీమాను వ్యక్తం చేసింది బీజేపీ. కానీ 250 మార్క్​ను కూడా దాటలేకపోయింది. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్​ నియోజకవర్గంలోనూ ఆ పార్టీ ఓటమిపాలవడం గమనార్హం.

ఒంటరిగా 370 సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు నమ్మకంగా చెప్పారు. అయితే ఆ పార్టీ 240 దగ్గరే ఆగిపోయింది. ఎన్డీయే కూటమి కలసి 400 సీట్లలో విజయం సాధిస్తుందని అన్నారు. కానీ కూటమి 290 సీట్లతో సర్కారు ఏర్పాటు చేసేందుకు బొటాబొటీ మెజారిటీని మాత్రమే సొంతం చేసుకుంది. ఈ తరుణంలో ఇంగ్లండ్ స్పీడ్​స్టర్ జోఫ్రా ఆర్చర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. 400 ఏమైంది అంటూ ఈ పేసర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. దీన్ని బీజేపీ మద్దతుదారులు తప్పుబడుతున్నారు. ఎలక్షన్స్​లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిందని.. ఇలా నాలుగొందలు గెలవలేదంటూ ట్రోల్ చేయడం కరెక్ట్‌ కాదని సీరియస్ అవుతున్నారు. తమదే అధికారం అని.. ఆర్చర్​ ఇలాంటి ట్వీట్స్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అయితే ఇది అతడు తాజాగా చేసిన ట్వీట్ కాకపోవడం గమనార్హం.

భీకర పేస్​తో బౌలింగ్ చేసే ఆర్చర్.. ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తుంటాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్​లో బౌలింగ్ చేస్తూ పరుగుల్ని నియంత్రిస్తాడు. రాకాసి బౌన్సర్లు, డెడ్లీ యార్కర్లతో సూపర్ బౌలర్​గా పేరు తెచ్చుకున్నాడు. గాయం తర్వాత ఇటీవలే కమ్​బ్యాక్ ఇచ్చిన ఆర్చర్.. పొట్టి కప్పులో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్ ద్వారా పాపులర్ అయిన ఈ ఇంగ్లీష్ పేసర్.. ప్రిడిక్షన్ ద్వారా కూడా ఫేమస్ అయ్యాడు. క్రికెట్​తో పాటు ఇతర రంగాల గురించి చెబుతూ అతడు చేసిన ప్రిడిక్షన్ ట్వీట్స్ బాగా వైరల్ అవుతుంటాయి. పర్టిక్యులర్​గా ఫలానా అంశం గురించే ట్వీట్ చేశానని ఆర్చర్ చెప్పకపోయినా.. అప్పటి సంఘటనల్ని బట్టి వాటిని ఆపాదించేస్తున్నారు అభిమానులు. ఇప్పుడు లోక్​సభ ఎన్నికల ఫలితాలపై కూడా ఆర్చర్ చేసిన పాత ట్వీట్​ను అలాగే వాడుకుంటున్నారు. అతడు బీజేపీని ఉద్దేశించి చేసిన ప్రిడిక్షనా? కాదా? అనేది క్లారిటీ లేదు. కానీ అతడి ట్వీట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ విషయంలో తన మీద వస్తున్న విమర్శలపై అతడు ఇంకా రియాక్ట్ కాలేదు.

Show comments