IND vs SA Suryakumar Yadav Catch Controversy: వీడియో: సూర్యకుమార్ క్యాచ్​పై కాంట్రవర్సీ.. షూ బౌండరీ లైన్​కు తాకిందా?

Suryakumar Yadav: వీడియో: సూర్యకుమార్ క్యాచ్​పై కాంట్రవర్సీ.. షూ బౌండరీ లైన్​కు తాకిందా?

T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్​లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్​గా మారింది. మిస్టర్ 360 ఆ క్యాచ్ అందుకోకపోతే సౌతాఫ్రికా కప్పు ఎగరేసుకుపోయేది.

T20 World Cup 2024 Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్​లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్​గా మారింది. మిస్టర్ 360 ఆ క్యాచ్ అందుకోకపోతే సౌతాఫ్రికా కప్పు ఎగరేసుకుపోయేది.

క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి వినే ఉంటారు. క్రికెట్​లో దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్​లు గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే అన్ని టీమ్స్ కూడా ఇందులో మెరుగవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారత జట్టు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బెటర్ అవుతోంది. అందులో భాగంగా వరల్డ్ కప్స్​ టైమ్​లో బెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్​తో టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన వారికి లెజెండరీ ప్లేయర్ల చేతుల మీదుగా మెడల్స్ అందిస్తూ ప్రోత్సహిస్తోంది. గత వన్డే ప్రపంచ కప్-2023తో పాటు ప్రస్తుత టీ20 వరల్డ్ కప్-2024లోనూ దీన్ని కంటిన్యూ చేసింది టీమ్ మేనేజ్​మెంట్. కోచ్ రాహుల్ ద్రవిడ్ తీసుకొచ్చిన ఈ విధానం సూపర్ రిజల్ట్​ను తీసుకొచ్చింది. ఫీల్డింగ్ బలం వల్లే భారత్ పొట్టి కప్పును సొంతం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.

నిన్న సౌతాఫ్రికాతో జరిగిన మెగా ఫైనల్​లో ఓ దశలో భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. 30 బంతుల్లో 30 రన్స్ చేయాల్సిన దశలో ప్రొటీస్​దే కప్ అని డిసైడ్ అయ్యారు. కానీ జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుత బౌలింగ్​తో మ్యాచ్​ను టీమిండియా వైపు తిప్పారు. అయితే వీళ్ల కంటే కూడా ఎక్కుడ క్రెడిట్ కొట్టేశాడు సూర్యకుమార్. ఆఖరి ఓవర్​లో డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతి సిక్స్​కు వెళ్తుండగా.. బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా దాన్ని ఒడిసిపట్టుకున్నాడతను. బాల్ వేగం, దిశను అంచనా వేసి అందుకున్న స్కై.. రోప్​ దాటుతున్నానని గమనించి బంతిని గాల్లోకి విసిరి తిరిగి లోపలికి వచ్చి క్యాచ్ పట్టాడు. దీంతో మిల్లర్ ఔట్ అవడం, ఆ తర్వాత 7 పరుగుల తేడాతో మ్యాచ్​ను, కప్పును భారత్ సొంతం చేసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. అయితే సూర్య క్యాచ్​పై ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తోంది.

మిల్లర్ క్యాచ్​ను పట్టే క్రమంలో సూర్య కాలి షూ బౌండరీ లైన్​ను తాకిందని సౌతాఫ్రికా అభిమానులు ఆరోపిస్తున్నారు. అతడి షూ తాకడంతో రోప్ కదిలిందని అంటున్నారు. సాధారణంగా వైట్ లైన్ అంచున బౌండరీ రోప్ ఉండాలని, కానీ అలా లేదని కామెంట్స్ చేస్తున్నారు. బౌండరీ రోప్​ను అది ఉండాల్సిన యథాస్థానానికి జరపలేదని, ఏదో తేడాగా ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్యాచ్​ను అంపైర్లు మూడ్నాలుగు సార్లు నిశితంగా పరిశీలించాల్సిందని, కానీ వెంటనే నిర్ణయం ప్రకటించారని ప్రొటీస్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అయితే ఈ వాదనల్ని భారత అభిమానులు కొట్టిపారేస్తున్నారు. బౌండరీ లైన్​కు సూర్య కాలు తగల్లేదని, ఓటమికి సాకులు చెప్పడం మాని ఇంకా బెటర్​గా ఆడటంపై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. మరి.. సూర్య క్యాచ్​ కాంట్రవర్సీపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments