iDreamPost

గ్రౌండ్ లో ఆఫ్ఘన్ ప్లేయర్ సూపర్ యాక్టింగ్! ఇది ఆస్కార్ రేంజ్!

టీ 20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరేందుకు ఆఫ్గాన్ జట్టు హోరాహోరీగా పోరాడింది. బంగ్లాదేశ్ ను చిత్తు చేసి అద్బుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గులాబ్దిన్ చేసిన డ్రామా నెట్టింటా వైరల్ గా మారింది.

టీ 20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరేందుకు ఆఫ్గాన్ జట్టు హోరాహోరీగా పోరాడింది. బంగ్లాదేశ్ ను చిత్తు చేసి అద్బుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గులాబ్దిన్ చేసిన డ్రామా నెట్టింటా వైరల్ గా మారింది.

గ్రౌండ్ లో ఆఫ్ఘన్ ప్లేయర్ సూపర్ యాక్టింగ్! ఇది ఆస్కార్ రేంజ్!

టీ20 వరల్డ్ కప్ సంచలన విజయాలకు కేరాఫ్ ఆడ్రస్ గా మారింది. చిన్న జట్లు పెద్ద జట్లకు షాకిస్తూ సంచలన విజయాలను అందుకుంటున్నాయి. టీ20 ప్రపంచకప్ లో మరో అద్బుతమైన విజయం నమోదైంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. సూపర్ 8 సమరంలో బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. దీంతో టీ20 ప్రపంచకప్ సెమీస్ లోకి దూసుకెళ్లింది ఆఫ్గనిస్తాన్. ఈ మ్చాచ్ లో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ సందర్బంగా ఆశ్చర్యకరమైన ఇన్సిడెంట్ చోటు చేసుకుంది.

సెమీ-ఫైనల్ పోరు కోసం ఆఫ్ఘనిస్తాన్- బంగ్లాదేశ్ మధ్య గట్టి పోటీ కనిపించింది. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరేందుకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించేందుకు అఫ్గానిస్థాన్‌ ఎంతకైనా తెగించేలా కనిపించింది. ఉత్కంఠభరితమైన పోరులో ఆఫ్గనిస్తాన్ కోచ్ థ్రాట్ సూచనల మేరకు ఆఫ్ఘనిస్థాన్ ఫాస్ట్ బౌలర్ గుల్బాదిన్ ఆ విధంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ మధ్యలో వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో కోచ్ నెమ్మదిగా ఆడమని ఆఫ్గాన్ ప్లేయర్స్ కు సైగలు చేశాడు.

కోచ్ సూచనలతో మైదానంలో ఉన్న గులాబ్దిన్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. గుల్బాదిన్ నాయబ్ స్లిప్ వద్ద నిలబడి గాయపడినట్లు నటించడం ప్రారంభించాడు. ఎందుకంటే మ్యాచ్ మధ్యలో వర్షం కురిస్తే ఆట రద్దైతే ఆఫ్గాన్ జట్టు సెమీస్ కు చేరడం ఖాయం. ఈ నేపథ్యంలో కోచ్ థ్రాట్ ప్లేయర్లకు నెమ్మదిగా ఆడాలని సూచించాడు. ఈ నేపథ్యంలో ఫాస్ట్ బౌలర్ గులాబ్దిన్ చేసిన డ్రామా ఆఫ్ఘనిస్తాన్‌ను మొదటిసారి సెమీ-ఫైనల్‌కు తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. గులాబ్ధిన్ ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్ అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు బంగ్లాదేశ్‌కు 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 12.1 ఓవర్లలో చేధించినట్లయితే.. బంగ్లాదేశ్ జట్టు సెమీఫైనల్ చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దైనా ఆఫ్ఘన్ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంటుంది. ఒక వేళ ఆఫ్ఘనిస్తాన్ నిర్దేశించిన టార్గెట్‌ను బంగ్లాదేశ్ జట్టు 12.1 ఓవర్ల తర్వాత చేధిస్తే ఆస్ట్రేలియా సెమీఫైనల్ చేరుతుంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ ను 19 ఓవర్లకు కుదించారు. దీంతో బంగ్లాదేశ్‌కు 19 ఓవర్లలో 114 పరుగుల టార్గెట్ చేదించాల్సి ఉంది. ఆఫ్గాన్ అద్భుతమైన బౌలింగ్ తో డక్ వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం అఫ్గాన్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. జూన్ 27న జరిగే సెమీ ఫైనల్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి