iDreamPost
android-app
ios-app

రికార్డ్‌ అలర్ట్‌: 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో కనీవిని ఎరుగని చెత్త రికార్డ్‌!

  • Published Jul 27, 2024 | 3:18 PM Updated Updated Jul 27, 2024 | 3:21 PM

Clive Madande, ZIM vs IRE, 42 Byes: 147 ఏళ్ల చరిత్ర కలిగి క్రికెట్‌లో.. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని ఓ రికార్డు నమోదు అయింది. ఆ రికార్డ్‌ గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Clive Madande, ZIM vs IRE, 42 Byes: 147 ఏళ్ల చరిత్ర కలిగి క్రికెట్‌లో.. ఇప్పటి వరకు కనీవిని ఎరుగని ఓ రికార్డు నమోదు అయింది. ఆ రికార్డ్‌ గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్‌ అవ్వాల్సిందే. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 27, 2024 | 3:18 PMUpdated Jul 27, 2024 | 3:21 PM
రికార్డ్‌ అలర్ట్‌: 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో కనీవిని ఎరుగని చెత్త రికార్డ్‌!

క్రికెట్‌లో రికార్డులు క్రియేట్‌ అవ్వడం.. అవి ఏదో ఒక సమయంలో బ్రేక్‌ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. అయితే.. గొప్ప రికార్డులు క్రియేట్‌ అయినా, అవి బ్రేక్‌ అయినా అద్భుతమే. కానీ, కొన్ని చెత్త రికార్డులు కూడా బ్రేక్‌ అవుతూ ఉంటాయి. అవి బ్రేక్‌ చేసిన క్రికెటర్లు కూడా చరిత్రలో నిలిచిపోతారు. తాజాగా అలాంటి ఓ అత్యంత చెత్త రికార్డు బ్రేక్‌ అయి.. 147 ఏళ్ల చరిత్ర కలిగిన క్రికెట్‌లో కనీవిని ఎరుగని రికార్డు నమోదైంది. టెస్టు క్రికెట్‌లో ఓ ప్లేయర్‌ ఏకంగా 42 బైస్‌లు సమర్పించుకున్నాడు. ఇది క్రికెట్‌ చరిత్రలో తొలి జరిగింది. ఇప్పటి వరకు ఉన్న 37 బైస్‌ల రికార్డు దాదాపు.. 90 ఏళ్ల తర్వాత బ్రేక్‌ అయింది. ఈ అత్యంత చెత్త రికార్డును బ్రేక్‌ చేసిన క్రికెటర్‌, ఆ మ్యాచ్‌ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్‌ వేదికగా జింబాబ్వే, ఐర్లాండ్‌ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్‌ జులై 25న ప్రారంభం అయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వేకు ఆ జట్టు ఓపెనర్లు జాయ్‌లార్డ్ గుంబీ, ప్రిన్స్ మాస్వౌరే మంచి స్టార్ట్‌ అందించారు. గుంబీ 49, మాస్వౌరే 74 పరుగులు చేసి రాణించారు. సియన్‌ విలియమ్సన్‌ కూడా 35 రన్స్‌తో పర్వాలేదనిపించాడు. ఈ ముగ్గురు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో.. జింబాబ్వే 210 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఐర్లాండ్‌ 250 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. ఈ లెక్కన ఐర్లాండ్‌.. జింబాబ్వే కంటే బాగా ఆడింది అనుకుంటాం.. కానీ, జింబాబ్వే వికెట్‌ కీపర్‌ దయతోనే ఐర్లాండ్‌ అంత స్కోర్‌ చేయగలిగింది.

అది ఎలాగంటే.. బైస్‌ రూపంలో అతను ఇచ్చిన పరుగులే అందుకు కారణం. మొత్తం 42 పరుగులను అతనొక్కడే బైస్‌ రూపంలో ఇచ్చాడు. బౌలర్లు వేసే బాల్స్‌ను పట్టుకోలేక వదిలేశాడు. కొన్ని అతనికి చాలా దూరంగా వెళ్లాయి. అయినా కూడా అవి అతనికి ఖాతాలోకే వెళ్తాయి. ఐర్లాండ్‌ తమ ఇన్నింగ్స్‌లో ఏకంగా 59 రన్స్‌ను ఎక్స్‌ట్రా రన్స్‌ రూపంలో పొందింది. అందుకే 42 పరుగులు బైస్‌ రూపంలో వికెట్‌ కీపర్‌ క్లైవ్ మదండే ఒక్కడే ఇచ్చాడు. 90 ఏళ్ల క్రితం ఇంగ్లండ్‌ దిగ్గజ మాజీ వికెట్‌ కీపర్‌ లెస్ అమెస్ 37 రన్స్‌ను బైస్‌ రూపంలో సమర్పించుకున్నాడు. ఇప్పుడా రికార్డును క్లైవ్‌ మదండే బ్రేక్‌ చేసి.. కొత్త చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మరి ఈ చెత్త రికార్డుపై మీ అభిప్రాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.