వీడియో: కష్టపడి ఫోర్ ఆపి.. ఐదు రన్స్‌ ఇచ్చాడు! నవ్వకండి సీరియస్‌ మ్యాటర్‌

Zimbabwe vs Ireland: జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్​లో ఓ ప్లేయర్ ఫీల్డింగ్ ఇప్పుడు వైరల్​గా మారింది. ఫోర్ ఆపేందుకు విశ్వప్రయత్నం చేసిన అతడు.. ఏకంగా ఐదు రన్స్ ఇచ్చాడు.

Zimbabwe vs Ireland: జింబాబ్వే-ఐర్లాండ్ మ్యాచ్​లో ఓ ప్లేయర్ ఫీల్డింగ్ ఇప్పుడు వైరల్​గా మారింది. ఫోర్ ఆపేందుకు విశ్వప్రయత్నం చేసిన అతడు.. ఏకంగా ఐదు రన్స్ ఇచ్చాడు.

క్రికెట్​కు సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా పాకిస్థాన్ టీమ్ ట్రోల్ అవుతూ ఉంటుంది. దీనికి కారణం ఆ టీమ్ చెత్తాటే. అయితే బ్యాటింగ్, బౌలింగ్ కాదు గానీ ఫీల్డింగ్ విషయలో ఆ జట్టును అంతా విమర్శిస్తూ ఉంటారు. చేతిలోకి వచ్చిన క్యాచుల్ని వదిలేయడం, ఈజీగా ఆపాల్సిన బంతుల్ని వదిలేయడం పాక్ ప్లేయర్లకే సాధ్యం. ఒకే క్యాచ్ కోసం ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు ప్రయత్నించడం లాంటి స్టంట్స్ కూడా దాయాది ఆటగాళ్లే చేస్తుంటారు. అందుకే వాళ్లు మీమ్ స్టఫ్​గా మారుతుంటారు. ఇప్పుడు మరో ఫన్నీ ఫీల్డింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కానీ ఇది పాక్ ప్లేయర్​ది కాదు.

ఒక జింబాబ్వే ఆటగాడి ఫీల్డింగ్​కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫోర్ ఆపేందుకు ప్రయత్నించిన ఆ ఫీల్డర్.. ఏకంగా 5 పరుగులు ఇచ్చుకున్నాడు. జింబాబ్వే-ఐర్లాండ్​కు మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐర్లాండ్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసేందుకు వచ్చాడు జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరవా. ఆ ఓవర్ మొదటి బంతికి ఒక రన్ వచ్చింది. రెండో బాల్​ను బ్యాటర్ ఆండీ మెక్​బ్రైన్ కవర్ దిశగా డ్రైవ్ చేశాడు. గ్యాప్​లోకి దూసుకెళ్లిన బాల్ బౌండరీ వెళ్లడం ఖాయంగా కనిపించింది. అయితే దాన్ని ఛేజ్ చేస్తూ పరిగెత్తిన ఫీల్డర్ టెండై చతారా ఎట్టకేలకు బౌండరీ లైన్​కు ముందే ఆపడంలో సక్సెస్ అయ్యాడు.

ఫోర్​ వెళ్లకుండా బంతిని ఆపే ప్రయత్నంలో వేగంగా పరిగెత్తడంతో బౌండరీ లైన్​ ఫెన్స్​ దాటి ముందుకు వెళ్లిపోయాడు చతారా. తిరిగొచ్చి బాల్​ను అందుకొని త్రో వేసేందుకు చాలా టైమ్ పట్టింది. దీంతో బ్యాటర్లు మెక్​బ్రైన్-టక్కర్ జోడీ ఏకంగా 5 రన్స్ తీశారు. అంత కష్టపడి బంతిని ఆపి, తిరిగొచ్చి త్రో చేసినా బ్యాటర్లు ఐదు పరుగులు తీయడంతో చతారా నిరాశలో కూరుకుపోయాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇదేం ఫీల్డింగ్​ రా బాబు అంటూ నవ్వుల్లో మునిగిపోయారు. బౌండరీ ఆపే బదులు వదిలేస్తే సరిపోయేదని, ఫోర్ వెళ్తే ఒక రన్ సేఫ్ అయ్యేదని అంటున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో ఐర్లాండ్ 4 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టి సిరీస్​ను సొంతం చేసుకుంది.

Show comments