iDreamPost
android-app
ios-app

Sanju Samson: సంజూ కెరీర్ క్లోజ్! వాళ్ల తప్పేమీ లేదు.. అంతా స్వయంకృతమే!

  • Published Jul 29, 2024 | 1:19 PM Updated Updated Jul 29, 2024 | 1:19 PM

టీమిండియా మరో సిరీస్​ను పట్టేసింది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్ విజయం, ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ జోడీ హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ ఒక్కడి విషయంలో మాత్రం సంతోషంగా లేరు.

టీమిండియా మరో సిరీస్​ను పట్టేసింది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్ విజయం, ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ జోడీ హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ ఒక్కడి విషయంలో మాత్రం సంతోషంగా లేరు.

  • Published Jul 29, 2024 | 1:19 PMUpdated Jul 29, 2024 | 1:19 PM
Sanju Samson: సంజూ కెరీర్ క్లోజ్! వాళ్ల తప్పేమీ లేదు.. అంతా స్వయంకృతమే!

టీమిండియా మరో సిరీస్​ను పట్టేసింది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది. సిరీస్ విజయం, ఆటగాళ్ల ప్రదర్శనపై కెప్టెన్ సూర్య, కోచ్ గంభీర్ జోడీ హ్యాపీగా ఉన్నారు. కానీ ఆ ఒక్కడి విషయంలో మాత్రం సంతోషంగా లేరు. అవును, వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ విషయంలో టీమ్ మేనేజ్​మెంట్ అసంతృప్తితో ఉంది. ఇన్నాళ్లూ అవకాశాలు ఇవ్వట్లేదు, అతడి కంటే జూనియర్లకు ఛాన్సులు ఇస్తున్నారు.. ఇది దారుణం అంటూ మేనేజ్​మెంట్​ను తిడుతూ చాలా మంది సంజూకు మద్దతుగా ఉంటూ వచ్చారు. కానీ ఈ మధ్య దొరికిన ఆపర్చునిటీస్​ను అతడు సరిగ్గా యూజ్ చేసుకోలేకపోతున్నాడు. శ్రీలంకతో సిరీస్​లో మొదటి టీ20లో సంజూను పక్కనబెట్టారు. కానీ రెండో మ్యాచ్​లో మాత్రం అతడ్ని ప్లేయింగ్ ఎలెవన్​లోకి తీసుకున్నారు.

వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్​ను పక్కనబెట్టి మరీ సంజూకు మెయిన్ టీమ్​లో ఛాన్స్ ఇచ్చారు. అంతేకాదు ఓపెనింగ్ చేయమంటూ ఎంకరేజ్ చేశారు. కానీ శాంసన్ మాత్రం ఆడిన తొలి బంతికే క్లీన్​బౌల్డ్ అయ్యాడు. లంక స్పిన్నర్ మహీష తీక్షణ వేసిన క్యారమ్ బాల్ అతడి బ్యాట్​ను దాటుకొని వెళ్లి స్టంప్స్​ను గిరాటేసింది. ఎలాంటి ఫుట్ మూమెంట్ లేకపోవడం, బాల్ స్కిడ్ అయి లోపలికి దూసుకురాకపోవడంతో అతడు దాన్ని డిఫెన్స్ చేయలేకపోయాడు. గోల్డెన్ డక్​ కావడంతో నిరాశతో క్రీజు వీడాడు. లేక లేక వచ్చిన అవకాశాన్ని చేజార్చడంతో అందరూ శాంసన్​ను తప్పుబడుతున్నారు. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న తీవ్ర పోటీ నేపథ్యంలో ఇక అతడి కెరీర్‌‌ క్లోజ్ అయినట్లేనని అంటున్నారు. ఛాన్స్ ఇస్తే దాన్ని యూజ్ చేసుకోలేదని.. ఇది అతడి స్వయంకృతమేనని కామెంట్స్ చేస్తున్నారు.

సంజూకు ఇంకో అవకాశం దొరుకుతుందని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అతడికి ఏ గాడ్​ఫాదర్ లేడు. బీసీసీఐ నుంచి గానీ టీమ్ మేనేజ్​మెంట్ నుంచి గానీ స్ట్రాంగ్ సపోర్ట్ లేదు. ఏడుగురు కెప్టెన్లు డ్రాప్ చేసిన ఏకైక ప్లేయర్ అతడు. కానీ తనకు ఎవరి మద్దతు లేదని, ఆడితే తప్ప టీమ్​లో ఉంచరని అతడు గ్రహించనట్లే కనిపిస్తున్నాడు. ప్రస్తుత సారథి సూర్య ఛాన్స్ ఇచ్చినా నిరూపించుకోలేకపోయాడు శాంసన్. వైస్ కెప్టెన్​ను తీసేసి మరీ ఆడించినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక అతడ్ని ఎవరూ బ్యాకప్ చేస్తారు? సంజూలాగే అరకొర అవకాశాలు దక్కించుకున్న యంగ్​స్టర్ యశస్వి జైస్వాల్ ప్రతి ఛాన్స్​ను ఉపయోగించుకొని ఇప్పుడు త్రీ ఫార్మాట్ ప్లేయర్​గా ఎదిగాడు. కానీ సంజూ మాత్రం ప్లేయింగ్ ఎలెవన్​లో చోటు దక్కితే గొప్ప అనే సిచ్యువేషన్​లో ఉన్నాడు. ఈ పరిస్థితికి కెప్టెన్లు, టీమ్ మేనేజ్​మెంట్, బోర్డును తప్పు పట్టడం కాదని.. సంజూ అవకాశాల్ని అందిపుచ్చుకోకపోవడమే కారణమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. సంజూ కెరీర్ క్లోజ్ అనే అభిప్రాయాలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి