Somesekhar
జింబాబ్వేతో తలపడబోయే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా పూర్తిగా సిద్ధమైంది. ఇక ఈ సిరీస్ ఎక్కడ? ఎప్పుడు? ఎలా? చూడాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జింబాబ్వేతో తలపడబోయే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా పూర్తిగా సిద్ధమైంది. ఇక ఈ సిరీస్ ఎక్కడ? ఎప్పుడు? ఎలా? చూడాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
టీ20 వరల్డ్ కప్ గెలిచి మంచి జోష్ లో ఉన్న టీమిండియా.. అదే జోరును జింబాబ్వేతో జరగబోయే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో కూడా చూపించాలని భావిస్తోంది. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడం, బుమ్రా లాంటి సీనియర్లకు విశ్రాంతిని ఇవ్వడంతో ఐపీఎల్ మెరుపు వీరులకు టీమిండియా నుంచి పిలుపు అందింది. యంగ్ ప్లేయర్లు తమ సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సిరీస్ ఎక్కడ? ఎప్పుడు? ఎలా? చూడాలో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 వరల్డ్ కప్ మెగా సమరం ముగిసింది. లీగ్ మ్యాచ్ ల్లో బోర్ కొట్టిచ్చినప్పటికీ.. ఆ తర్వాత సూపర్ 8, నాకౌట్ మ్యాచ్ లు టోర్నీకే ఊపుతెచ్చాయి. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లు ప్రేక్షకులకు ఫుల్ కిక్కిచ్చాయి. ఇక ఇప్పుడు మరో సిరీస్ క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి సిద్దమవుతోంది. జింబాబ్వేతో తలపడబోయే 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఇక ఈ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 6 నుంచి హరారే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్ తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత వరుసగా 7, 10, 13, 14 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. అన్ని మ్యాచ్ లు హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరగనున్నాయి. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ లు సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం అవుతాయి. ఇక ఈ మ్యాచ్ లను సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ ఓటీటీల ద్వారా వీక్షించవచ్చు.
శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, ధృవ్ జురెల్, నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, తుషార్ దేశ్పాండే, సాయి సుదర్శన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్షిత్ రానా.