iDreamPost
android-app
ios-app

ఇద్దరు క్రికెటర్లపై నిషేధం విధించిన క్రికెట్ బోర్డు! కారణం ఏంటంటే?

  • Published Dec 21, 2023 | 7:21 PM Updated Updated Dec 21, 2023 | 7:21 PM

తాజాగా ఇద్దరి క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు వేసింది ఓ దేశానికి చెందిన క్రికెట్ బోర్డు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

తాజాగా ఇద్దరి క్రికెటర్లపై సస్పెన్షన్ వేటు వేసింది ఓ దేశానికి చెందిన క్రికెట్ బోర్డు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఇద్దరు క్రికెటర్లపై నిషేధం విధించిన క్రికెట్ బోర్డు! కారణం ఏంటంటే?

క్రికెట్.. ఓ జెంటిల్ మెన్ గేమ్ గా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను కలిగి ఉంది. ఇలాంటి జెంటిల్ మెన్ గేమ్ లో అప్పుడప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొందరు ఆటగాళ్లు తప్పుడు దారులు తొక్కుతూ.. మ్యాచ్ ఫిక్సింగ్, డ్రగ్స్ వాడకం లాంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఇక ఏ క్రీడైనా, క్రీడాకారుడైనా నిషేధిత డ్రగ్స్ వాడటం చట్టరిత్యా నేరం. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో రూల్స్ ను అతిక్రమిస్తేనే మ్యాచ్ ఫీజులో కోతతో పాటుగా, కొన్ని మ్యాచ్ లు ఆడకుండా నిషేధం విధించడం మనకు తెలిసిన విషయమే. తాజాగా డోపింగ్ టెస్ట్ లో పట్టుబడిన ఇద్దరి క్రికెటర్లపై తక్షణమే నిషేధం విధించింది ఓ క్రికెట్ బోర్డు. ఆ వివరాల్లోకి వెళితే..

డోపింగ్ నిరోధక చర్యలను ఉల్లంఘించిన కారణంగా జింబాబ్వే జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను ఆ దేశ క్రికెట్ బోర్డు తక్షణమే అన్ని క్రికెట్ కార్యకలాపాల నుండి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ ఇద్దరు ప్లేయర్లు ఎవరంటే? ఒకరు వెస్లీ మాధేవెరే ఇంకొకరు బ్రాండన్ మవుతా. వీరిద్దరు జింబాబ్వే జట్టుకు ఆల్ రౌండర్లుగా తమ సేవలను అందిస్తున్నారు. కాగా.. ఇటీవల జరిగిన డోప్ పరీక్షల్లో ఈ ఇద్దరు ఆటగాళ్లు నిషేధిత రిక్రియేషనల్ డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో తక్షణమే వీరిని క్రికెట్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు క్రికెట్ బోర్డు ప్రకటించింది.

అదీకాక త్వరలోనే వెస్లీ మాధేవెరే, బ్రాండన్ మవుతా క్రమశిక్షణా కమిటీ ముందు విచారణకు హాజరుకానున్నారు. విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు జింబాబ్వే క్రికెట్ బోర్డు తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఐర్లాండ్ తో జరిగిన వన్డే, టీ20 సిరీస్ లో వీరు జట్టులో సభ్యులుగా ఉన్నారు. మాధేవెరే జింబాబ్వే తరఫున మూడు ఫార్మాట్లతో కలిపి 98 మ్యాచ్ లు ఆడాడు. ఇక మవుతా 12 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. మరి డోపింగ్ టెస్ట్ లో పట్టుబడి సస్పెండ్ చేయబడ్డ ఈ ఆటగాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.