iDreamPost
android-app
ios-app

వీడియో: గిల్‌ వర్సెస్‌ అండర్సన్‌! ఇది కదా టెస్ట్‌ క్రికెట్‌కు కావాల్సింది..

  • Published Mar 08, 2024 | 3:56 PM Updated Updated Mar 08, 2024 | 3:56 PM

Shubman Gill, James Anderson: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, జెమ్స్‌ అండర్సన్‌ మధ్య చిన్న ఫైట్‌ నడిచింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Shubman Gill, James Anderson: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, జెమ్స్‌ అండర్సన్‌ మధ్య చిన్న ఫైట్‌ నడిచింది. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Mar 08, 2024 | 3:56 PMUpdated Mar 08, 2024 | 3:56 PM
వీడియో: గిల్‌ వర్సెస్‌ అండర్సన్‌! ఇది కదా టెస్ట్‌ క్రికెట్‌కు కావాల్సింది..

టెస్ట్‌ క్రికెట్‌లో మజాను క్రికెట్‌ అభిమానులకు రుచిచూపిస్తూ.. టీమిండియా యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌, ఇంగ్లండ్‌ సీనియర్‌ బౌలర్‌ జెమ్స్‌ అండర్సన్‌ మధ్య చిన్న ఫైట్‌ నడించింది. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ధర్మశాల వేదికగా ఐదో టెస్టు గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లోనే గిల్‌ వర్సెస్‌ అండర్సన్‌ ఫైట్‌ చోటు చేసుకుంది. ఆట రెండో రోజు సందర్భంగా మోస్ట్‌ సీనియర్‌ బౌలర్‌ అయిన అండర్సన్‌ బౌలింగ్‌లో గిల్‌ ముందుకు వచ్చి స్ట్రేయిట్‌గా భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ సిక్స్‌తో అండర్సన్‌ ఇగో హర్ట్‌ అయింది. అంతటితో వదిలేయకుండా.. ఆ ఓవర్‌లోనే మరో రెండు వరుస బౌండరీలతో పుండు మీద కారం చల్లాడు గిల్‌.

అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 34వ ఓవర్‌ రెండో బంతికి గిల్‌ అదిరిపోయే షాట్‌ కొట్టాడు. సాధారణంగా ఒక స్పిన్నర్‌ వేస్తున్న సమయంలో బ్యాటర్లు ముందుకొచ్చి భారీ షాట్లు ఆడటం చూస్తుంటాం. కానీ, ప్రపంచ అత్యుత్తమ బౌలర్, 22 ఏళ్ల అనుభవం ఉన్న పేసర్‌.. గంటకు 133 కిలో మీటర్ల వేగంతో వేసిన బంతిని ముందుకొచ్చి .. స్ట్రేయిట్‌గా భారీ సిక్స్‌ కొట్టాడు. ఆ షాట్‌కు క్రికెట్‌ అభిమానులు ఫిదా అయినా.. అండర్సన్‌ మాత్రం అవమానంగా ఫీల్‌ అయ్యాడు. తన ఎక్స్‌పీరియన్స్‌ అంత వయసులేని కుర్రాడు, తన బౌలింగ్‌లో ఇలాంటి షాట్‌ కొట్టడం ఏంటని లోలోపల రగిలిపోయాడు. అండర్స్‌న్‌ 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ టైమ్‌లో గిల్‌ రెండేళ్ల పిల్లాడు. ప్రస్తుతం గిల్‌ వయసు 24 ఏళ్లు. కానీ, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు అవుతుంది.

ఇలా ఓ కుర్ర క్రికెటర్‌ తన బౌలింగ్‌ ముందుకొచ్చి సిక్స్‌ కొట్టడం అండర్సన్‌కు అస్సలు నచ్చలేదు. ఇదే విషయంపై ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న జహీర్‌ ఖాన్‌ స్పందిస్తూ.. ఆ షాట్‌ను గిల్‌ అద్భుతంగా ఆడాడు. ఆ షాట్‌ ఆడి గిల్‌ విఫలమైన ఉంటే, సరిగా కనెక్ట్‌ చేయకపోయి ఉంటే అతనిపై విమర్శలు వచ్చేవి. కానీ, అతను చాలా కాన్ఫిడెంట్‌గా ఆడాడు. అదే సమయంలో అండర్సన్‌కు మాత్రం ఆ షాట్‌ నచ్చి ఉండదు. ఇక్కడ కాదు.. ఇంగ్లండ్‌ వస్తేవు కాదా అప్పుడు నేనేంటో చూసిస్తా అని అండర్సన్‌ మనసులో అనుకుని ఉంటాడని జహీర్‌ ఖాన్‌ పేర్కొన్నాడు. జహీర్‌ ఖాన్‌ కూడా పేస్‌ బౌలరే కావడంతో ఒక పేస్‌ బౌలర్‌ కోపం మరో పేస్‌ బౌలర్‌కి అర్థమవుతుందని, అండర్సన్‌ మనసులో మాట జహీర్‌ నోట వచ్చిందంటూ క్రికెట్‌ అభిమానులు సైతం అనుకుంటున్నారు.

లంచ్‌ కంటే కాస్త ముందు శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, లంచ్‌ తర్వాత గిల్‌కు తన ఎక్స్‌పీరియన్స్‌ ఏంటో చూపించాడు అండర్సన్‌. ఇన్నింగ్స్‌ 63వ ఓవర్‌ రెండో బంతికి గిల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ బాల్‌ చూస్తూ.. అండర్స్‌ క్లాస్‌ ఏంటో తెలుస్తుంది. జహీర్‌ ఖాన్‌ అన్నట్లు.. ఇంగ్లండ్‌ వస్తే కాదు.. ఇక్కడే ఇండియాలోనే తానేంటో చూపించాడు అండర్సన్‌ అని ఆ బాల్‌ చూపిన తర్వాత ఫ్యాన్స్‌ అంటున్నారు. అద్భుతమైన లైన్‌ అండ్‌ లెంత్‌తో ఇన్‌ స్వింగ్‌తో గిల్‌ను అవుట్‌ చేసి తన కోపాన్ని చల్లార్చుకున్నాడు అండర్సన్‌. వీరిద్దరి మధ్య జరిగిన ఈ కోల్డ్‌ వార్‌తో కొద్ది సేపు క్రికెట్‌ అభిమానులు అసలు సిసలు టెస్ట్‌ క్రికెట్‌ మజాను అందుకున్నారు. మరి గిల్‌ వర్సెస్‌ అండర్సన్‌ ఫైట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.