SNP
SNP
ఇండియన్ క్రికెట్‌లో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ తమదైన ముద్ర వేసిన స్టార్ బౌలర్లు. భారత జట్టులో కూడా అద్భుతమైన పేస్, స్వింగ్ ఉందనే విషయాన్ని ప్రపంచ క్రికెట్‌కు చాటి చెప్పిన పేసర్లు వాళ్లు. వందల కొద్ది వికెట్లు, ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలతో టీమిండియాకు విజయాలు అందించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత ఇద్దరూ.. కామెంటేటర్లుగా మారారు. అయితే.. వీరిలో జహీర్ ఖాన్ సీనియర్ కాగా.. ఇషాంత్ జహీర్ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరూ వెస్టిండీస్-భారత్ మధ్య జరుగుతున్న సిరీస్‌లో కామెంట్రీ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం తెలిస్తొచ్చింది.
అదేంటంటే.. వీరిద్దరి రికార్డులు, గణంకాలు అన్ని అచ్చగుద్దినట్లు సేమ్‌గా ఉన్నాయి. అసలు ఇంతవరకు ఎవరూ కూడా వీరి నంబర్స్‌ను పోల్చి చూడకపోవడంతో ఈ ఇంట్రస్టింగ్ విషయం తెలియకుండా పోయింది. తాజాగా వెస్టిండీస్‌తో భారత్ ఆడిన రెండో టెస్టు నాలుగో రోజు సందర్భంగా వీరిద్దరూ గణాంకాలు డిస్‌ప్లే చేయడంతో వాటిని చూసి అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఇద్దరి వికెట్లు మ్యాచ్‌ల సంఖ్య అచ్చగుద్దినట్లు సమంగా ఉన్నాయి. డిస్‌ప్లేలో నంబర్స్ తప్పుగా ఏమైనా పడ్డాయా అని అక్కడున్న ఇతర వ్యాఖ్యాతలు కంగారు పడ్డారు. కానీ, నిజానికి ఇద్దరి నంబర్స్ ఒక్కటే. అవేంటో ఇప్పుడు చూద్దాం..
జహీర్ ఖాన్ తన టెస్ట్ కెరీర్‌లో 311 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ శర్మ సైతం 311 వికెట్లు తీసుకున్నాడు. అలాగే 11 సార్లు ఐదు వికెట్ల హాల్‌ను జహీర్ సాధించగా.. ఇషాంత్ కూడా సేమ్ 11 సార్లు ఐదు వికెట్ల హాల్ సాధించాడు. విచిత్రంగా ఇద్దరూ ఓ మ్యాచ్‌లో పది వికెట్ల హాల్ సాధించారు. అంతేకాకుండా స్వదేశంలో జహీర్ 104, విదేశాల్లో 207 వికెట్లు తీసుకుంటే.. ఇషాంత్ శర్మ కూడా అచ్చం అలాగే ఇండియా 104, విదేశాల్లో 207 వికెట్ల పడగొట్టాడు. విటుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా.. వీరిద్దరూ ఈ గణాంకాల్లో సేమ్ ఉన్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే.. ఇషాంత్ కంటే జహీర్ ఖాన్ మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. మరి ఈ ఇద్దరు దిగ్గజాల రికార్డులు ఇలా సేమ్ ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The similarity in the Test career of Ishant Sharma and Zaheer Khan. pic.twitter.com/CCBfrC5qU2
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 24, 2023
ఇదీ చదవండి: వీడియో: వావ్.. ఇలాంటి క్యాచ్‌ను మీ లైఫ్‌లో చూసుండరు!