iDreamPost

వీడియో: వావ్‌.. ఇలాంటి క్యాచ్‌ను మీ లైఫ్‌లో చూసుండరు!

  • Published Jul 26, 2023 | 8:10 AMUpdated Jul 26, 2023 | 8:10 AM
  • Published Jul 26, 2023 | 8:10 AMUpdated Jul 26, 2023 | 8:10 AM
వీడియో: వావ్‌.. ఇలాంటి క్యాచ్‌ను మీ లైఫ్‌లో చూసుండరు!

క్రికెట్‌లో కొన్ని క్యాచ్‌లు ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. అలాంటి క్యాచ్‌ల లిస్ట్‌లో తాజాగా మరో క్యాచ్‌ వచ్చి చేరింది. ఈ క్యాచ్‌ను సూపర్‌ మ్యాన్‌ క్యాచ్‌గా అభివర్ణించవచ్చు. అయితే ఈ సూపర్‌ క్యాచ్‌ను అందుకున్నది ఎవరో కాదు.. ఐపీఎల్‌లో పంజాబ్‌ సూపర్‌ కింగ్స్‌ తరఫున సత్తా చాటిన అందరి దృష్టిని ఆకర్షించిన వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌. కళ్లు చెదిరే ఈ క్యాచ్‌ను దేవధర్‌ ట్రోఫీలో స్టన్నింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. సౌత్‌జోన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ జోన్‌ తరఫున ఆడుతున్న ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌.. గాల్లో సూపర్‌ మ్యాన్‌లా దూకుతూ అందుకున్న ఈ క్యాచ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

నార్త్‌ జోన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మయాంక్‌ యాదవ్‌ వేసిన 39వ ఓవర్‌లో సౌత్‌జోన్‌కు ఆడుతున్న రికీ భూయ్‌ ఫస్ట్‌ స్లిప్‌ మీదుగా ప్రయత్నించాడు. షాట్‌ ఆడేందుకు రికీ భూయ్‌ ఫుట్‌వర్క్‌ను గమనించిన ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌.. లెఫ్ట్‌ సైడ్‌ జరిగి తన రైట్‌ సైడ్‌కి అమాంతం గాల్లోకి దూకి సూపర్‌ డైవింగ్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ప్రభ్‌సిమ్రాన్‌ అందుకున్న ఆ క్యాచ్‌ నిజంగా నమ్మకశక్యంగా లేకపోయినా.. అది నిజం. క్రికెట్‌ చరిత్రలో ఓ అద్భుతమైన వికెట్‌ కీపర్‌ క్యాచ్‌గా నిలిచిపోతుందని చెప్పొచ్చు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే. తొలుత బ్యాటింగ్‌ చేసిన సౌత్‌జోన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌(64), ఓపెనర్‌ కున్నమ్మల్‌(70), జగదీశన్‌(72) పరుగులతో రాణించారు. అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో వీజేడీ పద్ధతిలో నార్త్‌జోన్‌ టార్గెట్‌ను 246 పరుగులకు కుదించారు. సౌత్‌ జోన్‌ బౌలర్లు విధ్వత్‌ కావేర్ప 5, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌ 2 వికెట్లతో నార్త్‌ జోన్‌ను కుప్పకూల్చారు. వాసుకి కౌశిక్‌ సైతం ఒక వికెట్‌ పడగొట్టాడు. సౌత్‌జోన్‌ బౌలర్ల ధాటికి నార్త్‌జోన్‌ కేవలం 60 పరుగులకే ఆలౌటై.. 185 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన వసీం జాఫర్! SKYకి దక్కని చోటు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి