కౌంటీల్లో దుమ్మురేపుతున్న చాహల్.. ఒకే మ్యాచ్​లో 9 వికెట్లు!

Yuzvendra Chahal, County Championship, Selectors: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోమారు సత్తా చాటాడు. తన స్పిన్ మ్యాజిక్​తో ప్రత్యర్థి బ్యాటింగ్ యూనిట్​ను కకావికలం చేశాడు. ఒకే మ్యాచ్​లో 9 వికెట్లు తీసి తనలో పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు.

Yuzvendra Chahal, County Championship, Selectors: టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోమారు సత్తా చాటాడు. తన స్పిన్ మ్యాజిక్​తో ప్రత్యర్థి బ్యాటింగ్ యూనిట్​ను కకావికలం చేశాడు. ఒకే మ్యాచ్​లో 9 వికెట్లు తీసి తనలో పస తగ్గలేదని ప్రూవ్ చేశాడు.

యుజ్వేంద్ర చాహల్.. గత ఆరేడేళ్లుగా టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వారిలో ఒకడు. లెగ్ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తూ వస్తున్నాడు. స్పిన్ ఉచ్చులో బిగించి అవతలి టీమ్​ మ్యాచ్​లో మళ్లీ కమ్​బ్యాక్ ఇవ్వకుండా చేయడంలో అతడు దిట్టగా మారాడు. లెగ్ స్పిన్​తో పాటు గూగ్లీ, ఫ్లిప్పర్ లాంటి డెలివరీస్​తో తోపు బ్యాటర్లను కూడా భయపెడుతున్నాడు చాహల్. అయితే లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్​లో అడపాదడపా భారత జట్టులో అవకాశాలు దక్కుతున్నా.. టెస్ట్ టీమ్​లో మాత్రం చాహల్​ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ రూపంలో సాలిడ్ స్పిన్ ఆల్​రౌండర్స్ ఉండటంతో చాహల్​ను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. దీంతో తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు కౌంటీల్లో ఆడుతున్న చాహల్.. ఒక్క మ్యాచ్​లో 9 వికెట్లు పడగొట్టాడు.

నార్తాంప్టన్​షైర్ తరఫున బరిలోకి దిగిన చాహల్.. డెర్బీషైర్​తో జరిగిన కౌంటీ ఛాంపియన్​షిప్ డివిజన్ 2 మ్యాచ్​లో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లో కలిపి 9 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్​లో 5 వికెట్లు తీసిన భారత స్పిన్నర్.. రెండో ఇన్నింగ్స్​లో మరో 4 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్​లో 100 వికెట్ల మైల్​స్టోన్​ను కూడా చేరుకున్నాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన చాహల్.. ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. క్రీజులో నిలబడాలంటేనే భయపడేలా చేశాడు. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​లో బౌలింగ్ చేస్తూ పోయాడు. ఒక లైన్ పట్టుకొని అందులోనే ఫ్లిప్పర్​లు, గుగ్లీలు, లెగ్ స్పిన్ డెలివరీస్ వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. బాల్ వేగాన్ని పెంచుతూ, తగ్గిస్తూ.. గాల్లో బంతిని గింగిరాలు తిప్పుతూ వికెట్ల మీద వికెట్లు తీశాడు. అతడి దెబ్బకు ప్రత్యర్థి బ్యాటింగ్ యూనిట్ కకావికలం అయింది.

ఒక్క స్పెల్​తో సెలెక్టర్లకు చాహల్ స్ట్రాంగ్ మెసేజ్ పంపించాడు. భారత టెస్ట్ జట్టులోకి తనను తీసుకోవాల్సిందే అనేంత కసితో బౌలింగ్ చేశాడు. చాహల్ ఫిట్​నెస్, ఫామ్, బౌలింగ్ వేరియేషన్స్ చూస్తుంటే.. త్వరలో టెస్ట్ టీమ్​లోకి కమ్​బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. బంగ్లాదేశ్ సిరీస్​తో భారత హోమ్ సీజన్ స్టార్ట్ కానుంది. మున్ముందు భారీగా లాంగ్ ఫార్మాట్ మ్యాచ్​లు ఆడనుంది. ఆల్రెడీ టీమ్​లో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే లెగ్ స్పిన్నర్ మాత్రం లేడు. బౌలింగ్​లో మరింత వైవిధ్యత కావాలనుకుంటే చాహల్ వైపు సెలెక్టర్లు చూసే అవకాశం ఉంది. అతడి పెర్ఫార్మెన్స్ పీక్​లో ఉంది కాబట్టి కన్సిడర్ చేసే ఛాన్సులు బలంగానే ఉన్నాయని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. మరి.. భారత టెస్టు జట్టులోకి చాహల్ కమ్​బ్యాక్ ఇస్తే చూడాలని ఉందా? మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments