iDreamPost
android-app
ios-app

Yuzvendra Chahal: ఇంగ్లండ్ కౌంటీలో దుమ్మురేపిన చాహల్.. తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు!

  • Published Aug 15, 2024 | 11:12 AM Updated Updated Aug 15, 2024 | 11:12 AM

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే చెలరేగిపోయాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. తన బౌలింగ్ మాయతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లతో అదరగొట్టాడు.

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే చెలరేగిపోయాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. తన బౌలింగ్ మాయతో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లతో అదరగొట్టాడు.

Yuzvendra Chahal: ఇంగ్లండ్ కౌంటీలో దుమ్మురేపిన చాహల్.. తొలి మ్యాచ్ లోనే 5 వికెట్లు!

టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇక ఇంగ్లండ్ డొమెస్టిక్ వన్డే కప్ లో నార్తంప్టన్ షైర్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆడిన తొలి మ్యాచ్ లోనే ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. తన గింగిరాలు తిరిగే బంతులతో బ్యాటర్లను బోల్తాకొట్టించాడు. తద్వారా తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కౌంటీలో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే 5 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే చెలరేగిపోయాడు టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. నార్తంప్టన్ షైర్ కు ఆడుతున్న చాహల్ తాజాగా కెంట్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లతో సత్తాచాటాడు. చాహల్ ధాటికి కెంట్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. వచ్చిన వారు వచ్చినట్లే క్రీజ్ లో నిబడలేక బ్యాట్లు ఎత్తేశారు. భారత బౌలర్ మాయాజాలానికి కెంట్ టీమ్ 35.1 ఓవర్లలో 82 పరుగులకు కుప్పకూలింది. ఇక చాహల్ 10 ఓవర్లలో కేవలం 14 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. అందులో 5 ఓవర్లు మెయిడెన్స్ ఉండటం విశేషం. ఇతడికి తోడు జస్టిన్ బ్రాడ్ 3, లూక్ ప్రోక్టర్ 2 వికెట్లతో రాణించడంతో తక్కువ స్కోర్ కే కెంట్ కుప్పకూలింది.

chahal superb bowling

అనంతరం 83 పరుగుల స్వల్ప టార్గెట్ తో బరిలోకి దిగిన నార్తంప్టన్ టీమ్ కేవలం 14 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పృథ్వీ షా 17 పరుగులతో నిరాశపరచగా.. సేల్స్ 33*, జార్జ్ బార్లెట్ 31* పరుగులతో రాణించారు. కాగా.. యుజ్వేంద్ర చాహల్ ఈ మ్యాచ్ తో పాటుగా ఐదు కౌంటీ ఛాంపియన్ షిప్ మ్యాచ్ లు ఆడేందుకు నార్తంప్టన్ షైర్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మరి కౌంటీ క్రికెట్ తొలి మ్యాచ్ లోనే అదరగొట్టిన యుజ్వేంద్ర చాహల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.