Nidhan
Neeraj Chopra-Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలతో మెరిశారు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ మనూ భాకర్. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
Neeraj Chopra-Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలతో మెరిశారు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ మనూ భాకర్. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
Nidhan
ఒకే ఒక్క టోర్నమెంట్‌తో నేషనల్ స్టార్ అయిపోయింది మనూ భాకర్. పారిస్ ఒలింపిక్స్-2024కు ముందు ఆమె ఎవరికీ తెలియదు. కానీ విశ్వక్రీడల్లో రెండు బ్రాంజ్ మెడ్సల్ సాధించి రికార్డు సృష్టించడంతో ఆమె పేరు మార్మోగిపోతోంది. యూత్ హార్ట్‌త్రోబ్‌గా మారిపోయింది మనూ. ఆమె టాలెంట్, అందానికి అంతా ఫిదా అయిపోతున్నారు. మనూ ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ఆమె కలసి ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇందులో ఇద్దరూ సిగ్గుపడుతూ మాట్లాడుతున్నట్లుగా కనిపించింది. మనూ తల్లి నీరజ్‌తో మాట్లాడటం, తలపై అతడి చేతిని ఉంచి ఒట్టు తీసుకున్నట్లు కనిపించడం ట్రెండింగ్ అయింది.
మనూ-నీరజ్ లవ్‌లో ఉన్నారని.. త్వరలో వీళ్ల మ్యారేజ్ జరుగుతుందని సోషల్ మీడియాలో పుకార్లు జోరుగా చక్కర్లు కొట్టాయి. అయితే వీటిని మనూ భాకర్ ఫ్యామిలీ ఖండించింది. తాజాగా ఈ రూమర్స్‌పై నేరుగా మనూ క్లారిటీ ఇచ్చింది. ఒక్క కామెంట్‌తో ఆమె తేల్చిపారేసింది. తాము ప్రేమలో ఉన్నామనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ‘ఆ రూమర్స్ నా వరకు వచ్చాయి. వీటిపై నన్ను రియాక్ట్ అవ్వనివ్వండి. ఈ న్యూస్‌లో ఎలాంటి నిజం లేదు. నీరజ్ చోప్రాతో మాట్లాడా. దాన్ని ఎవరో వీడియో తీశారు. మా ఇద్దరి మధ్య పెద్దగా ఇంటరాక్షన్ లేదు. టోర్నమెంట్స్, ఈవెంట్స్‌లో ఎదురుపడినప్పుడు సరదాగా పలకరించుకుంటాం. అంతేగానీ మేం లవ్‌లో ఉన్నామని వస్తున్న వార్తలన్నీ అవాస్తవం’ అని మనూ స్పష్టం చేసింది.
నీరజ్‌తో తన తల్లి మాట్లాడినప్పుడు అక్కడ లేనని మనూ భాకర్ తెలిపింది. కాబట్టి వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది తాను చెప్పలేనని పేర్కొంది. స్వయంగా మనూనే రియాక్ట్ అయింది. కాబట్టి నీరజ్‌తో ఆమె ప్రేమాయణం నడిపిస్తోందనే రూమర్స్‌కు ఇకనైనా చెక్ పడుతుందేమో చూడాలి. ఇక, పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పర్సనల్ క్యాటగిరీలో బ్రాంజ్ మెడల్ నెగ్గిన మనూ.. మరో షూటర్ సరబ్జోత్ సింగ్‌తో కలసి 10 మీటర్ల మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఇంకో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. విశ్వక్రీడల ముగింపు వేడుకల్లో హాకీ లెజెండ్ శ్రీజేష్‌తో కలసి భారత పతాకధారిగానూ వ్యవహరించింది.