SNP
యువరాజ్ సింగ్.. ఇండియన్ గ్రేట్ క్రికెటర్స్‌లో ఒకడు. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండాల్సిన ప్లేయర్. కానీ, కొన్ని కారణాల వల్ల అతనికి కెప్టెన్సీ దక్కలేదు. అయితే.. తనకు కెప్టెన్సీ ఎందుకు దక్కలేదో తాజాగా యువీ సంచలన విషయాలు బయటపెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
యువరాజ్ సింగ్.. ఇండియన్ గ్రేట్ క్రికెటర్స్‌లో ఒకడు. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉండాల్సిన ప్లేయర్. కానీ, కొన్ని కారణాల వల్ల అతనికి కెప్టెన్సీ దక్కలేదు. అయితే.. తనకు కెప్టెన్సీ ఎందుకు దక్కలేదో తాజాగా యువీ సంచలన విషయాలు బయటపెట్టాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియాకు రెండు వరల్డ్ కప్‌లు అందించిన హీరో అతను. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్, 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లను టీమిండియా గెలిచిందంటే.. యువీనే ప్రధాన కారణం. 2011 వరల్డ్ కప్‌లలో యువీనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. తన బ్యాటింగ్, బౌలింగ్‌తో భారత్‌కు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అయితే.. ధోని కంటే సీనియర్ అయిన యువరాజ్ సింగ్ టీమిండియాకు ఎప్పుడో కెప్టెన్ కావాల్సింది. కానీ, అనూహ్యంగా యువీ కంటే జూనియర్ అయిన ధోనికి టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందాయి. అయితే.. తనకు కెప్టెన్సీ రాకపోవడానికి ఓ గొడవ కారణం అంటూ యువరాజ్ సింగ్ తాజాగా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.
2007 వన్డే వరల్డ్ కప్‌లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలో టీమిండియా ఘోరంగా విఫలం కావడంతో.. అదే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టులోని సీనియర్ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే దూరంగా ఉన్నారు. దీంతో.. ఆ పొట్టి వరల్డ్ కప్‌కు యువ క్రికెటర్లతో కూడిన జట్టును పంపాల్సి వచ్చింది. అయితే.. ఆ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా ఉంటాడని అంతా భావించారు. ఎందుకంటే అప్పటికే టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా చేశాడు, జట్టులో చాలా మంది కంటే సీనియర్.. దీంతో యువీనే టీమిండియా లీడ్ చేస్తారని అంతా ఎక్స్‌ఫెక్ట్ చేశారు. కానీ, అనూహ్యంగా ధోనికి టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆ వరల్డ్ కప్‌ను భారత్ గెలవడంతో ఆ తర్వాత కెప్టెన్‌గా ధోని స్థానం పర్మినెంట్ అయిపోయింది.
అయితే.. తనకు టీమిండియా కెప్టెన్‌గా చేయాలనే కోరిక బలంగా ఉన్నా.. సచిల్ టెండూల్కర్, అప్పటి టీమిండియా కోచ్ గ్రెగ్ చాపెల్ మధ్య జరిగిన గొడవలో.. తాను తన టీమ్‌మేట్ సచిన్‌కి సపోర్టుగా నిలిచింనందుకే తనకు కెప్టెన్సీ దక్కలేదని యువీ పేర్కొన్నాడు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘చాపెల్-సచిన్ మధ్య జరిగిన గొడవలో నేను సచిన్‌కు మద్దతు తెలిపాను. అది బీసీసీఐలోని కొంతమంది పెద్దలకు నచ్చలేదు. దాంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్ చేయాలని వాళ్లు భావించారు. ఈ విషయాన్ని బోర్డులోని నా సన్నిహితులు చెప్పారు. ఏ మాత్రం ప్రణాళికల్లోని ధోనీని 2007 టీ20 ప్రపంచకప్ కోసం కెప్టెన్ చేశారు. నాకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం అది. కానీ ఈ విషయంలో నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు. ఇప్పటికీ అదే గొడవ జరిగితే నేను నా తోటి ఆటగాడికే మద్దతుగా ఉంటాను.’అని యువరాజ్ చెప్పుకొచ్చాడు. మరి తనకు కెప్టెన్సీ రాకపోవడానికి యువీ చెప్పిన కారణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
First Gambhir, Now Yuvraj
Both found crying after being removed from Vice Captaincy 😂 pic.twitter.com/ppvOm5hDiC
— Abhi⚒️ (@abhi_backup07) December 11, 2023