iDreamPost
android-app
ios-app

Yuvraj Singh: గుజరాత్ కాదు.. ఆ టీమ్ కు హెడ్ కోచ్ గా యువరాజ్ సింగ్?

  • Published Aug 25, 2024 | 12:39 PM Updated Updated Aug 25, 2024 | 12:39 PM

టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ గుజరాత్ కు హెడ్ కోచ్ గా వెళ్లనున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుజరాత్ కు కాదు.. ఆ టీమ్ కు హెడ్ కోచ్ గా యువీ వెళ్లబోతున్నాడట.

టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ గుజరాత్ కు హెడ్ కోచ్ గా వెళ్లనున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుజరాత్ కు కాదు.. ఆ టీమ్ కు హెడ్ కోచ్ గా యువీ వెళ్లబోతున్నాడట.

Yuvraj Singh: గుజరాత్ కాదు.. ఆ టీమ్ కు హెడ్ కోచ్ గా యువరాజ్ సింగ్?

IPL 2025 టైటిల్ ను ఎలాగైనా సాధించాలని ఫ్రాంచైజీలు అన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. అందులో భాగంగా ప్లేయర్లను, హెడ్ కోచ్ లను మార్చేపనిలో తలమునకలై ఉంది. ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ హెడ్ కోచ్ లపై వేటు వేయగా.. మరికొన్ని యాజమాన్యాలు ఇదే బాటలో పయనించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ క్రీడా వర్గాల్లో వైరల్ గా మారింది. టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ గుజరాత్ కు హెడ్ కోచ్ గా వెళ్లనున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుజరాత్ కు కాదు.. ఆ టీమ్ కు హెడ్ కోచ్ గా యువీ వెళ్లబోతున్నాడట.

యువరాజ్ సింగ్.. ఐపీఎల్ 2025 సీజన్ కు ఢిల్లీ క్యాపిట్స్ టీమ్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. గతంలో ఉన్న ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ ను హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఈ ప్లేస్ ను యువీతో భర్తీ చేయాలని ఢిల్లీ మేనేజ్ మెంట్ భవిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై ఇప్పటికే అతడితో యాజమాన్యం చర్చలు జరిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక ఈ వార్తలపై అటు యువరాజ్ నుంచి గానీ, ఇటు ఢిల్లీ ఫ్రాంచైజీ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.

yuvaraj singh

అయితే గతంలో యువరాజ్ గుజరాత్ టైటాన్స్ కు హెడ్ కోచ్ గా వెళ్లనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఢిల్లీ కూడా అతడిని హెడ్ కోచ్ గా నియమించుకోవాడానికి ఆసక్తిగా ఉందట. కాగా.. ఇప్పటి వరకు యువీకి కోచ్ గా పనిచేసిన అనుభవం లేనప్పటికీ.. పంజాబ్ యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో యువీది కీలక పాత్ర. సన్ రైజర్స్ చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ యువీ ట్రైనింగ్ లోనే రాటుదేలాడు. కాగా.. గుజరాత్ టైటాన్స్ ప్రస్తుతం ఉన్న హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రాను తప్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్ కూడా కుమార సంగక్కరను తీసేసి, రాహుల్ ద్రవిడ్ కు పగ్గాలు అందించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే బాటలో మరికొన్ని ఫ్రాంచైజీలు కూడా ఉన్నట్లు సమాచారం.