Somesekhar
టీమిండియా మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ చేసిన పని అందరిని పగలబడి నవ్వేలా చేసింది. ఇక భజ్జీ చేసిన ఆ పని చూసిన భారత మాజీ ప్లేయర్లు యువరాజ్ సింగ్, పార్థివ్ పటేల్ లు నవ్వాపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
టీమిండియా మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ చేసిన పని అందరిని పగలబడి నవ్వేలా చేసింది. ఇక భజ్జీ చేసిన ఆ పని చూసిన భారత మాజీ ప్లేయర్లు యువరాజ్ సింగ్, పార్థివ్ పటేల్ లు నవ్వాపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Somesekhar
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని వివాదాలకు దారితీస్తే.. మరికొన్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇంకొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కాగా.. తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో టీమిండియా మాజీ స్పిన్నర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్ చేసిన పని అందరిని పగలబడి నవ్వేలా చేసింది. ఇక భజ్జీ చేసిన ఆ పని చూసిన భారత మాజీ ప్లేయర్లు యువరాజ్ సింగ్, పార్థివ్ పటేల్ లు నవ్వాపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. మరి అంతలా నవ్వేలా భజ్జీ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం.
హర్భజన్ సింగ్.. టీమిండియా క్రికెట్ చరిత్రలో వైవిధ్యమైన ఆటగాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన అతడు.. తన యాటిట్యూడ్ తో వివాదాల బారినపడ్డాడు. శ్రీశాంత్ తో గొడవతో భజ్జీ చిక్కుల్లో పడ్డాడు. ఈ వివాదం ముగిసిన తర్వాత తన మాటలతో ప్రత్యర్థులను కవ్వించే వాడు. ఒక్కోసారి మైదానంలోనే బాహాబాహీలకు దిగేవాడు భజ్జీ. కానీ తాజాగా జరిగిన ఓ మ్యాచ్ లో మాత్రం అందరిని పగలబడి నవ్వేలా చేశాడు. వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ 2024 పేరుతో మధుసూదన్ సాయి గ్లోబల్ హ్యుమానిటేరియన్ మిషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ మ్యాచ్ జరిగింది.
కర్ణాటక వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా మాజీ దిగ్గజాలతో పాటుగా పలు దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు కూడా పాల్గొన్నారు. వీరిందరూ రెండు టీమ్ లు విడిపోయి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. వన్ వరల్డ్ టీమ్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సారథ్యం వహించగా.. వన్ ఫ్యామిలీ జట్టుకు సిక్సర్ల కింగ్ యువరాజ్ కెప్టెన్ గా ఉన్నాడు. కాగా.. వన్ వరల్డ్ జట్టు ప్లేయర్ హర్భజన్ సింగ్ బ్యాటింగ్ వచ్చే క్రమంలో ఓ ఫన్నీ ఇన్సిండెంట్ జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే? హర్భజన్ సింగ్ బ్యాటింగ్ కు వచ్చే క్రమంలో అతడు తన గార్డ్ ను మర్చిపోయి వచ్చాడు. ఈ విషయాన్ని కీపర్ పార్థీవ్ పటేల్ కు చెప్పడంతో.. అతడు నవ్వి, తన గార్డును తీసి ఇచ్చాడు.
ఇక ఇదే టైమ్ లో అక్కడికి వచ్చిన యువరాజ్ ఈ విషయం తెలిసి.. నవ్వులు చిందించాడు. యువీ నవ్వును ఆపుకోలేకపోయాడు. పార్థీవ్ ఇచ్చిన గార్డును పెట్టుకుని బ్యాటింగ్ స్టార్ట్ చేశాడు భజ్జీ. అనంతరం తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీ తరలించి అభిమానులను అలరించాడు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఏంటి భజ్జీ చూసుకోవాలి కదా.. తగలరాని చోట తగిలితే పరిస్థితి ఏంటి?, మన పార్థీవ్ కాబట్టి గార్డ్ ఇచ్చాడు అదే వేరే ప్లేయర్ అయితే ఇబ్బంది పడేవాడివిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సచిన్ టీమ్ వన్ వరల్డ్ ఓ బంతి మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
— Aryan Kabad (@aryan11307) January 18, 2024