iDreamPost
android-app
ios-app

Vishnu Vinod: విధ్వంసానికి పరాకాష్ట.. 45 బంతుల్లోనే 139 పరుగులతో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఊచకోత!

  • Published Sep 14, 2024 | 7:47 AM Updated Updated Sep 14, 2024 | 7:47 AM

Vishnu Vinod Century, Kerala Cricket League 2024: కేరళ క్రికెట్ లీగ్ లో పరుగుల సునామీ సృష్టించాడు త్రిస్సూర్ టైటాన్స్ ప్లేయర్ విష్ణు వినోద్. అలెప్పీ రిపిల్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు.

Vishnu Vinod Century, Kerala Cricket League 2024: కేరళ క్రికెట్ లీగ్ లో పరుగుల సునామీ సృష్టించాడు త్రిస్సూర్ టైటాన్స్ ప్లేయర్ విష్ణు వినోద్. అలెప్పీ రిపిల్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు.

Vishnu Vinod: విధ్వంసానికి పరాకాష్ట.. 45 బంతుల్లోనే 139 పరుగులతో ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఊచకోత!

ప్రస్తుతం జరుగుతున్న కేరళ క్రికెట్ లో లీగ్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. ఈ లీగ్ లో భాగంగా తాజాగా త్రిస్సూర్ టైటాన్స్ వర్సెస్ అలెప్పీ రిపిల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టైటాన్స్ బ్యాటర్ విష్ణు వినోద్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రిపిల్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ.. సిక్సుల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకుని అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇక తన మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.

కేరళ క్రికెట్ లీగ్ లో పరుగుల సునామీ సృష్టించాడు త్రిస్సూర్ టైటాన్స్ ప్లేయర్ విష్ణు వినోద్. అలెప్పీ రిపిల్స్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లను కనికరం లేకుండా ఊచకోత కోశాడు. సిక్సర్లతో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. విష్ణు బ్యాటింగ్ చేస్తుంటే.. ఫీల్డర్లు, బౌలర్లు ప్రేక్షకపాత్ర వహించకతప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన అలెప్పీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అలెప్పీ కెప్టెన్ మహ్మద్ అజాహరుద్దీన్ 58 బంతుల్లో 90 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన త్రిస్సూర్ టైటాన్స్ విష్ణు వినోద్ తుఫాన్ బ్యాటింగ్ తో కేవలం 12.4 ఓవర్లలోనే టార్గెట్ ను ఊదిపడేసింది. వినోద్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్లకు బంతులు ఎక్కడ వేయాలో తెలీలేదు అంటే అతిశయోక్తి కాదు. తన ఊచకోతతో కేవలం 32 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను చేరుకున్నాడు. ఇక ఓవరాల్ గా 45 బంతులు ఎదుర్కొని 17 సిక్సర్లు, 5 ఫోర్లతో 139 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా.. విష్ణు వినోద్ ను ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ గాయం కారణంగా అతడికి అవకాశం రాలేదు. ఇక 2021 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీకి, 2022లో సన్ రైజర్స్ హైదరబాద్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించాడు వినోద్. మరి ఆకాశమేహద్దుగా చెలరేగిన విష్ణు వినోద్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.