Nidhan
Team India: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ త్వరలో కొత్త రోల్లో కనిపించనున్నాడు. ఆ టీమ్‌కు హెడ్ కోచ్‌గా యువీ రావడం ఖాయమైందని తెలుస్తోంది.
Team India: టీమిండియా లెజెండ్ యువరాజ్ సింగ్ త్వరలో కొత్త రోల్లో కనిపించనున్నాడు. ఆ టీమ్‌కు హెడ్ కోచ్‌గా యువీ రావడం ఖాయమైందని తెలుస్తోంది.
Nidhan
యువరాజ్ సింగ్.. క్రికెట్ లవర్స్‌కు పరిచయం అక్కర్లేని పేరిది. బ్యాటర్‌గా, బౌలర్‌గా ఒంటిచేత్తో ఎన్నో కీలక మ్యాచుల్లో టీమిండియాను గెలిపించిన హీరో అతడు. టీ20 వరల్డ్ కప్-2007తో పాటు వన్డే ప్రపంచ కప్-2011ను భారత్ సొంతం చేసుకోవడంలో అత్యంత ముఖ్య భూమిక పోషించాడు యువీ. క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ దేశానికి కప్ అందించిన యోధుడతను. క్రికెట్లో ఎన్నో ట్రోఫీలు గెలిచి కెరీర్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడతను. రిటైర్మెంట్ తర్వాత క్రికెటింగ్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న ఈ దిగ్గజం.. ఇప్పుడో జట్టుకు కోచ్‌గా రానున్నాడని తెలుస్తోంది. ఎన్ని టీమ్స్ ఊరించే ఆఫర్లు ఇచ్చినా కోచింగ్‌కు ఒప్పుకోని యువీ.. ఎట్టకేలకు ఇప్పుడు ఎస్ చెప్పాడని వినిపిస్తోంది.
ఐపీఎల్లో అత్యంత సక్సెస్ఫుల్ టీమ్స్‌లో ఒకటైన గుజరాత్ టైటాన్స్‌కు యువరాజ్ హెడ్ కోచ్‌గా రావడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. యువీతో ఆ ఫ్రాంచైజీ ఓనర్స్ చర్చలు జరుపుతున్నారని.. అది ఓ కొలిక్కి వస్తే అధికారిక ప్రకటన వెలువడుతుందని టాక్ నడుస్తోంది. గుజరాత్ జట్టుకు ప్రస్తుతం హెడ్ కోచ్‌గా ఉన్న ఆశిష్ నెహ్రా ఆ ఫ్రాంచైజీని వీడటం పక్కా అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. నెహ్రాతో పాటు జీటీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న విక్రమ్ సోలంకీ కూడా బయటకు వెళ్లడం గ్యారెంటీనట. ఇప్పటికే గుజరాత్ బ్యాటింగ్ కోచ్, మెంటార్ గ్యారీ కిర్‌స్టెన్ ఆ ఫ్రాంచైజీని వీడాడు. పాకిస్థాన్ నేషనల్ టీమ్‌కు కోచ్‌గా ఆఫర్ రావడంతో కిర్‌స్టెన్ వెళ్లిపోయాడు.
అటు కిర్‌స్టెన్ వెళ్లిపోవడం.. ఇప్పుడు నెహ్రా, విక్రమ్ సోలంకీ కూడా టీమ్‌ను వీడేందుకు సిద్ధమవడంతో గుజరాత్ కొత్త కోచ్‌ను అన్వేషిస్తోందట. ఆ రోల్ కోసం ఎలాగోలా కష్టపడి యువరాజ్‌ను ఒప్పించిందని వినికిడి. అయితే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదని.. కానీ యువీ ఎస్ చెప్పే ఛాన్స్ ఉందని సమాచారం. గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను తయారు చేసి, ఈ రేంజ్‌కు చేర్చింది యువీనే అనే విషయం తెలిసిందే. అటు గిల్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఇటు జీటీ బిగ్ ఆఫర్‌తో పాటు టీమ్‌పై అథారిటీ, ఫుల్ ఫ్రీడమ్, పవర్స్ ఇవ్వడంతో యువీ కాదనలేకపోతున్నాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఒకవేళ అతడు ఓకే అంటే మాత్రం ప్రొఫెషనల్ క్రికెట్లో యువీ కోచ్‌గా రావడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక, నెహ్రా కోచింగ్‌లో 2022లో గుజరాత్ ఛాంపియన్స్‌గా నిలిచింది. ఆ తర్వాతి సీజన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ ఈసారి మాత్రం లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. మరి.. యువీని కోచ్‌గా చూడాలని మీరు అనుకుంటే కామెంట్ చేయండి.
Ashish Nehra & Vikram Solanki likely to leave Gujarat Titans ahead of IPL 2025. [Sahil Malhotra from News18]
– Yuvraj Singh in consideration for the role in Gujarat Titans…!!!! pic.twitter.com/sK8NBkhRjo
— Johns. (@CricCrazyJohns) July 23, 2024