iDreamPost
android-app
ios-app

నా అన్వేషణ యూట్యూబర్‌పై నెటిజన్స్ ఫైర్! ఆధారాలతో దొరికాడు!

  • Published Nov 24, 2023 | 5:04 PM Updated Updated Nov 25, 2023 | 2:56 PM

యూట్యూబర్‌ అన్వేష్‌.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఏపీ జనాలను గొర్రెలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అయితే.. ఉచితాలు అంటూ సంక్షేమ పథకాలు గురించి తెలియకుండా నోరు పారేసుకున్నాడు. అయితే.. ఇదే వ్యక్తి గతంలో తాను చేసిన పనిని మర్చిపోయి.. ఇప్పుడు స్వయం ప్రకటిత మేధావిలా ఉపన్యాసాలు ఇస్తున్నాడు.

యూట్యూబర్‌ అన్వేష్‌.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఏపీ జనాలను గొర్రెలంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. అయితే.. ఉచితాలు అంటూ సంక్షేమ పథకాలు గురించి తెలియకుండా నోరు పారేసుకున్నాడు. అయితే.. ఇదే వ్యక్తి గతంలో తాను చేసిన పనిని మర్చిపోయి.. ఇప్పుడు స్వయం ప్రకటిత మేధావిలా ఉపన్యాసాలు ఇస్తున్నాడు.

  • Published Nov 24, 2023 | 5:04 PMUpdated Nov 25, 2023 | 2:56 PM
నా అన్వేషణ యూట్యూబర్‌పై నెటిజన్స్ ఫైర్! ఆధారాలతో దొరికాడు!

ట్రావెలింగ్‌ యూట్యూబర్‌ అన్వేష్‌ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. నా అన్వేషణ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ లో వీడియాలు పోస్ట్‌ చేస్తూ ఉంటాడు. తాజాగా ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఆఫ్రికాలోని ఓ దేశమైన జింబాబ్వే-ఆంధ్రప్రదేశ్‌ ను కంపేర్‌ చేస్తూ.. జనాలను గొర్రెలు అంటూ నోరు పారేసుకున్నాడు. అంతకంటే ముందు ఒకసారి చైనాతో ఇండియాని పోలుస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు ఏపీ గురించి మాట్లాడుతూ.. అర్థం లేని వ్యాఖ్యలు చేశాడు. అయితే.. అన్వేష్‌ తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటికంటే ముందు.. అతను తన గతాన్ని గుర్తు చేసుకోవాలి.

ఏడాది క్రితం.. అంటార్కిటికా యాత్ర కోసం ఈ అన్వేష్‌ జనం నుంచి, తన సబ్‌స్క్రైబర్ల నుంచి డబ్బుల అడిగాడు. ఒకటి కాదు రెండు ఏకంగా రూ.8 లక్షల రుపాయలను అన్వేష్‌.. వారి నుంచి తీసుకున్నాడు. తన యాత్ర కోసం, యూట్యూబ్‌ లో వీడియో పెట్టి సంపాదించడం కోసం.. ఎవరో ముక్కు ముఖం తెలియని వారి నుంచి డబ్బులు తీసుకోవచ్చు.. కానీ, పేదలను ప్రభుత్వం ఆదుకోకూడాదా? చాలా మంది ఎన్నో కష్టాలు పడుతూ.. రెక్కలు ముక్కలు చేసుకుంటూ.. కూలి పనులకు వెళ్తూ వారి పిల్లలను చదివించుకుంటున్న తల్లిదండ్రులు ఎందరో ఉన్నారు. పిల్లలకు చదువు ప్రభుత్వం చెప్పిస్తున్నా.. వారికి కనీసం పౌష్టికాహారం అందించేందుకు ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. అలాగే వితంతువులు, వృద్ధులకు కూడా పెన్షన్ల రూపంలో ఎంతో కొంత నగదు అందిస్తోంది.. ఇవన్ని అన్వేష్‌ దృష్టిలో ఉచితాలు కావచ్చు.

అయితే ఉచితాలకు, సంక్షేమానికి చాలా తేడా ఉంది. తన హాఫ్‌ నాలెడ్జ్‌తో జింబాబ్వే ఆర్థిక సంక్షోభాన్ని ఆంధ్రప్రదేశ్‌ సంక్షేమంతో పోల్చడంతోనే అన్వేష్‌ కు ఏ మాత్రం విషయపరిజ్ఞానం లేదని అర్థమవుతోంది. ఉచితాలు ఇస్తే ప్రజలు సోమరులు అవుతారు, రాష్ట్రం దివాళా తీస్తుందని ఓ నాలుగురు మాట్లాడుకునే గాలి మాటలనే తన వాక్‌చాతుర్యంతో.. జింబాబ్వే పరిస్థితి ఏపీకి వస్తుందని అర్థంలేని పోలిక పెట్టాడు. అన్వేష్‌ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మన దేశమే ఒక సంక్షేమ రాజ్యం. సంపాదనను అందరికి పంచాల్సిన బాధ్యత వెల్ఫేర్‌ స్టేట్‌ పై ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంక్షేమం కీలక పాత్ర పోషిస్తుంది. ఒక్క మన దేశంలోనే కాదు.. అమెరికా, చైనా, బ్రిటన్‌, ఇటలీ, స్వీడన్‌ ఇలా చాలా అభివృద్ధి చెందిన దేశాలు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తాయి. అయితే అవి అక్కడి పరిస్థితులకు తగ్గట్లు నగదు బదిలీ రూపంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయినా.. జింబాబ్వే ఆర్థిక సంక్షోభం వేరే. ఆర్థిక మాంద్యంతో దెబ్బతిన్న దేశం. కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది.

అయినా నోట్లు విచ్చలవిడిగా పంపిణీ చేయడం వేరే.. సంక్షేమం అమలు చేయడం వేరు. సంక్షేమంతో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇవన్నీ తెలియకుండా.. జనాలను గొర్రెలంటూ అన్వేష్‌ అతివాగుడితో.. విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయినా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం.. మొత్తం ఎంత బడ్జెట్‌ ప్రవేశపెట్టింది? అందులో సంక్షేమానికి కేటాయించింది ఎంత? అనే విషయాన్ని అన్వేష్‌ తెలుసుకుంటే బాగుంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమం అనేది పేద ప్రజలు జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు ఉపయోగపడుతుంది కానీ, వాళ్లను సోమరులను చేయడానికి కాదు. ఇప్పుడు అభివృద్ధి చెందాం అని చెప్పుకుంటున్న చాలా దేశాలు కూడా వెల్ఫేర్‌ స్కీమ్స్‌ ను అమలు చేసి.. పేదరికాన్ని తగ్గించుకుని ఈ స్థాయికి వచ్చాయని అన్వేష్‌ తెలుసుకోవాలి. మరి జింబాబ్వేతో ఏపీకి కంపేర్‌ చేస్తూ అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.