SNP
వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైనా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతోనే జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది యంగ్ టీమిండియా. కప్పు పోయిన తర్వాత.. ఈ విజయాలు ఎవరికి కావాలి అనుకుంటున్నారా? అది కూడా నిజమే అనుకోండి.. కానీ.. ఈ విజయాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవేంటో? ఆస్ట్రేలియా నుంచి ఎలా నేర్చుకోవాలో? ఇప్పుడు తెలుసుకుందాం..
వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైనా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతోనే జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది యంగ్ టీమిండియా. కప్పు పోయిన తర్వాత.. ఈ విజయాలు ఎవరికి కావాలి అనుకుంటున్నారా? అది కూడా నిజమే అనుకోండి.. కానీ.. ఈ విజయాల్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అవేంటో? ఆస్ట్రేలియా నుంచి ఎలా నేర్చుకోవాలో? ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ 2023లో ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. టోర్నీ మొత్తం ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్ వరకు వచ్చిన భారత్.. ఫైనల్లో ఓడిపోయింది. కానీ, ఆస్ట్రేలియా మాత్రం లీగ్‌లో మనపై అలాగే సౌతాఫ్రికా చేతుల్లో ఓడినా.. ఫైనల్లో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆరంభంలో తప్పులు చేసినా.. అసలు సిసలైన ఆఖరి మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా.. విజయం సాధించింది. కానీ, ఇప్పుడు ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో మళ్లీ టీమిండియానే పైచేయి సాధిస్తోంది. ఐదు టీ20ల సిరీస్‌లో రెండు వరుస విజయాలతో భారత జట్టు మంచి జోరు మీదుంది. అయితే.. విజయాలు వస్తున్నా.. ఇప్పటికీ యంగ్ టీమిండియా ఆస్ట్రేలియా నుంచి ఒక విషయం మాత్రం కచ్చితంగా నేర్చుకోవాలి. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో యంగ్ టీమిండియా తలపడుతోంది. వచ్చే ఏడాది జూన్ జులైలో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో.. యంగ్ టీమ్‌ను రెడీ చేసే ఆలోచనలో ఉంది ఇండియన్ మెనేజ్‌మెంట్. అయితే.. ఒక్క విషయంలో మాత్రం ఈ యంగ్ టీమిండియా ఇంకాస్త మెరుగుపడాలి. ఆ విషయాన్ని ప్రత్యర్థి టీమ్ ఆస్ట్రేలియాను చూసి నేర్చుకున్న తప్పులేదు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా మనకు ప్రత్యర్థి టీమే అయినా.. ఛాంపియన్ టీమ్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. వాళ్లు ప్రతి విషయంలో ఎంతో స్ట్రాంగ్‌గా ఉండటంతోనే కప్పులు గెలుస్తున్నారు. మనం కూడా అన్ని విషయాల్లో సూపర్ స్ట్రాంగ్ అయితేనే.. చివరి మెట్టులో కప్పులు చేజారిపోకుండా ఉంటాయి.
ఇప్పుటికే బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతంగా ఉన్న టీమిండియా ఫీల్డింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ చిన్న అవకాశం కూడా వదలకుండా అందిపుచ్చుకున్న జట్టే ఛాంపియన్‌గా నిలుస్తుంది. ఫీల్డింగ్‌లో మరీ ముఖ్యంగా ఒక్క అంశంపై టీమిండియా ఆటగాళ్లు ఫోకస్ పెట్టాలి. అదే.. బ్యాక్ రన్నింగ్ క్యాచ్‌లు. వరల్డ్ కప్ 2023 ఫైనల్లో కెప్టెన్ రోహిత్ శర్మ క్యాచ్‌ను ఆసీస్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ అందుకున్న క్యాచ్. అలాగే ఆదివారం ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో మార్కస్ స్టోయినీస్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ క్యాచ్.. ఇలాంటి బ్యాక్ రన్నింగ్ క్యాచ్‌లు అందుకోవడంలో టీమిండియా ఆటగాళ్లు కాస్త ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నారు. ఆదివారం మ్యాచ్‌లో ఆసీస్ బ్యాటర్ షార్ట్ కొట్టిన షాట్‌ను రుతురాజ్ గైక్వాడ్ బ్యాక్ రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో విఫలం అయ్యాడు. ఈ బ్యాక్ రన్నింగ్ క్యాచ్‌లపై టీమిండియా ఫోకస్ పెట్టి.. దాన్ని బలంగా మార్చుకుంటే.. ఈ యంగ్ ఇండియన్ టీమ్‌కు తిరుగుండదనే చెప్పాలి.
పైగా టీ20 లాంటి ఫాస్ట్ ఫుడ్ లాంటి ఫార్మాట్‌లో బ్యాటర్లు అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే క్రమంలో మంచి బాల్స్‌ను కూడా షాట్లు ఆడే క్రమంలో బాల్‌పై మిస్ టైమ్ అవుతుంటారు. అలాంటి సమయంలో బాల్ సర్కిల్‌కి బయట, బౌండరీ లైన్ కి దగ్గరల్లో గాల్లోకి లేస్తుంటుందని… కొన్ని సందర్భాల్లో 30 యార్డ్ సర్కిల్‌లో ఉన్న ఫీల్డర్.. బౌండరీ లైన్ వైపు పరిగెడుతూ.. తన వెనుక నుంచి కిందికి వస్తున్న బాల్‌ను క్యాచ్‌గా అందుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి హాఫ్ ఛాన్సులను అందుకున్న జట్టే.. విజయం సాధిస్తుంది. క్యాచ్‌లు మ్యాచ్‌లు గెలిపిస్తాయి అంటారు కదా.. బ్యాక్ రన్నింగ్ క్యాచ్‌లు అయితే.. టీమ్‌లో జోష్‌ను నింపి, కాన్ఫిడెన్స్‌ను భారీగా పెంచుతాయి. అలాంటి అద్భుతమైన క్యాచ్‌లు అందుకుంటే.. ఒక్కోసారి మ్యాచ్ స్వరూపమే మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా ఆటగాళ్లను చూసి.. యంగ్ ఇండియన్ క్రికెటర్లు బ్యాక్ రన్నింగ్ క్యాచ్‌లపై ఫోకస్ చేయాలని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ruturaj Gaikwad drops Steve Smith on 7 while running back to take the catch. #indvsaust20 #INDvsAUS pic.twitter.com/2Iydf1k9yE
— Mufa (@MufaKohlii) November 26, 2023
WHAT A CATCH TRAVIS HEAD! 😮👏
Rohit Sharma falls short of his 50, both India openers gone in the first 10 overs! pic.twitter.com/I3AlUp0Lmy
— Sky Sports Cricket (@SkyCricket) November 19, 2023