SNP
Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ యువ బౌలర్‌ను టార్గెట్ చేసి మరి కొట్టాడు. జైస్వాల్ దెబ్బకి ఆ కుర్ర బౌలర్ ఓకే ఓవర్‌లో..
Yashasvi Jaiswal: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో జైస్వాల్ విధ్వంసం సృష్టించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ యువ బౌలర్‌ను టార్గెట్ చేసి మరి కొట్టాడు. జైస్వాల్ దెబ్బకి ఆ కుర్ర బౌలర్ ఓకే ఓవర్‌లో..
SNP
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను కేవలం 218 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. బ్యాటింగ్ దిన ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్.. శివాలెత్తి బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా ఈ సిరీస్‌లో భీకర ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగి.. అసలు ఏం జరుగుతుందో కూడా వాళ్లకి అర్థం కాకుండా చేశాడు. తాము 218కే కుప్పకూలిన పిచ్ ఇతనేంటి ఇలా ఆడుతున్నాడు అని ఇంగ్లండ్ బౌలర్లను, కెప్టెన్ బెన్ స్టోక్స్ షాక్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్ యువ స్పిన్నర్ బషీర్‌ను జైస్వాల్ టార్గెట్ చేసిన మరీ కొట్టాడు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌లోకి అడుగుపెట్టి.. సరిగ్గా 20 ఏళ్ల కూడా లేని బచ్చా క్రికెటర్‌ను తన ఎటాకింగ్ గేమ్‌తో భయపెట్టాడు జైస్వాల్. అతను వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో ఏకంగా మూడు సిక్సులు బాది.. ఇది టెస్ట్ మ్యాచా? లేక టీ20 మ్యాచ్‌లో సూపర్ ఓవరా? అనిపించేలా బ్యాటింగ్ చేశాడు. బషీర్ వేసిన ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులకు పరుగులు చేయలేకపోయిన జైస్వాల్.. మూడో బంతికి ముందుకొచ్చి లాంగ్ ఆన్‌లో భారీ సిక్స్ బాదాడు. ఆ తర్వాతి బంతిని కవర్స్‌లోకి సిక్స్ కొట్టాడు. మళ్లీ ఐదో బంతిని లాంగ్ ఆఫ్‌లో సిక్స్ బాదాడు. ఆ ఓవర్‌లో మూడు సిక్సులతో ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు.
జైస్వాల్ వేగంతో చూసి మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ ఆశ్చర్యపోయాడు. రోహిత్ మొదటి నుంచే హిట్టింగ్ చేస్తున్నాడు. కెప్టెన్‌ను చూసి ఇన్స్‌పైర్ అయిన జైస్వాల్ అతన్ని మించి విధ్వంసం సృష్టించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ జాక్ క్రాలే ఒక్కడే 79 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలం అవ్వడం, టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లండ్ కుప్పకూలింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. జడేజా ఒక వికెట్ తీసుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో కుర్ర బౌలర్ బషీర్ బౌలింగ్‌లో జైస్వాల్ మూడు సిక్సులు బాదడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shoaib Bashir will never forget this 👀
6️⃣6️⃣6️⃣ by Yashasvi Jaiswal 👏Anderson 🤝 Bashir = Jaisball #INDvENG #YashasviJaiswal #INDvsENG #RohitSharmapic.twitter.com/lYDoxUW4ri
— Richard Kettleborough (@RichKettle07) March 7, 2024