iDreamPost
android-app
ios-app

వీడియో: బూతులు తిడుతూ.. కోహ్లీకి జైస్వాల్‌ ఫిర్యాదు! గొడవేంటంటే?

  • Published Jul 14, 2023 | 11:54 AM Updated Updated Jul 14, 2023 | 11:54 AM
  • Published Jul 14, 2023 | 11:54 AMUpdated Jul 14, 2023 | 11:54 AM
వీడియో: బూతులు తిడుతూ.. కోహ్లీకి జైస్వాల్‌ ఫిర్యాదు! గొడవేంటంటే?

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపుతున్నాడు యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టుతో సాంప్రదాయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్‌.. సెంచరీతో కదంతొక్కాడు. డెబ్యూ టెస్ట్‌లోనే సెంచరీ చేసిన 17వ భారత క్రికెటర్‌గా, విదేశాల్లో డెబ్యూ చేసి ఫస్ట్‌ మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా, కరేబియన్‌ గడ్డపై టెస్ట్‌ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి, తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్‌గా అనేక రికార్డులను నెలకొల్పాడు.

ప్రస్తుతం 143 పరుగులతో నాటౌట్‌గా ఉన్న యశస్వి.. మూడో రోజు కూడా ఇదే ఊపును కొనసాగిస్తే.. డబుల్‌ సెంచరీ కూడా సాధించే అవకాశం ఉంది. జైస్వాల్‌కు తోడుగా సీనియర్‌ సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లీ ఉండనే ఉన్నాడు. దీంతో మూడో రోజు కూడా భారత్‌ ఆధిపత్యం చెలాయించే ఛాన్స్‌ ఉంది. మూడో రోజు బ్యాటింగ్‌ కొనసాగించి, విండీస్‌ ముందు భారీ స్కోర్‌ ఉంచి, ఇన్నింగ్స్‌ తేడాతో ఓడించాలని టీమిండియా భావిస్తోంది. మరి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీ చేస్తాడా? కోహ్లీ లాంగ్‌ ఇన్నింగ్స్‌ ఆడతాడా అనేది మూడో రోజు తేలనుంది.

అయితే.. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. డెబ్యూ మ్యాచ్‌ ఆడుతున్న జైస్వాల్‌లో పరుగుల దాహం ఎంతుందో.. ఫైర్‌ కూడా అంతే ఉన్నట్లు కనిపిస్తోంది. అగ్రెషన్‌లో కోహ్లీకి తమ్ముడిలా ఉన్నాడు. తొలి టెస్ట్‌ రెండో రోజు ఆట సందర్భంగా జైస్వాల్‌ బూతులతో రెచ్చిపోయాడు. 133 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో వెస్టిండీస్‌ బౌలర్‌ కీమర్‌ రోచ్‌పై జైస్వాల్‌ నోరు పారేసుకున్నాడు. పైగా కోహ్లీకి అతనిపై ఫిర్యాదు కూడా చేశాడు. ఇంతకీ ఏమైందంటే.. రన్‌ కోసం వెళ్తున్న జైస్వాల్‌కు కీమర్‌ రోచ్‌ కావాలని అడ్డు తగులుతున్నాడు. దీంతో జైస్వాల్‌కు కోపం వచ్చి.. హిందీలో బూతులు తిడుతూ.. ‘వీడు కావాలనే ముందొచ్చి నిలబడుతున్నాడు’ అంటూ కోహ్లీతో చెప్పాడు. దానికి కోహ్లీ కూడా స్పందిస్తూ.. ‘ఎవడూ.. వీడా?’ అని అడుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సెహ్వాగ్‌ను దాటేసిన కోహ్లీ! డేంజర్‌లో లక్ష్మణ్‌ రికార్డు