Nathan Lyon Targets Yashasvi Jaiswal In BGT 2024: రోహిత్, కోహ్లీ కాదు.. ఆ భారత కుర్ర బ్యాటర్​ను చూస్తే భయమేస్తోంది: లియాన్

రోహిత్, కోహ్లీ కాదు.. ఆ భారత కుర్ర బ్యాటర్​ను చూస్తే భయమేస్తోంది: లియాన్

Nathan Lyon On BGT 2024 Series: టాప్ బ్యాటర్లను కూడా వణికిస్తుంటాడు ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్. అలాంటోడు ఓ భారత కుర్ర క్రికెటర్​ అంటే మాత్రం భయమని అంటున్నాడు.

Nathan Lyon On BGT 2024 Series: టాప్ బ్యాటర్లను కూడా వణికిస్తుంటాడు ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్నర్ నాథన్ లియాన్. అలాంటోడు ఓ భారత కుర్ర క్రికెటర్​ అంటే మాత్రం భయమని అంటున్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్​లో టాప్ స్టార్స్​గా వెలుగొందుతున్నారు. టీమిండియాకు మూలస్తంభాలుగా ఉన్న ఈ మోడర్న్ లెజెండ్స్​ గ్రౌండ్​లోకి అడుగుపెడితే అవతలి జట్లు భయంతో వణికిపోతాయి. రోకో జోడీ క్రీజులో సెటిల్ అయితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే. ఫార్మాట్ ఏదైనా వీళ్ల ఆటతీరు దాదాపుగా ఒకేలా ఉంటుంది. భారీగా పరుగుల వరద పారించే వీళ్లకు అన్ని టీమ్స్ జడుసుకుంటాయి. అందులో ఆస్ట్రేలియా కూడా ఒకటి. భారత్​తో మ్యాచ్ అంటే వీళ్లిద్దర్ని ఎంత త్వరగా వెనక్కి పంపుదామా అనే ఆ జట్టు ఆలోచిస్తూ ఉంటుంది. వీళ్లను ఔట్ చేస్తే మ్యాచ్ చేతిలోకి వచ్చినట్లేనని తెలుసు. అందుకే రోకో జోడీ చుట్టే వ్యూహాలు పన్నుతుంది. అయితే కంగారూ స్పిన్నర్ నాథన్ లియాన్ మాత్రం ఓ కుర్ర బ్యాటర్ అంటే తమకు వణుకు అంటున్నాడు.

రోహిత్-కోహ్లీ కాదు.. ఆ టీమిండియా యంగ్ బ్యాటర్​తోనే తమకు అసలు ఛాలెంజ్ అంటున్నాడు లియాన్. వందల కొద్దీ వికెట్లు తీస్తూ టాప్ బ్యాటర్లను కూడా పోయించిన లియాన్​కే చెమటలు పట్టిస్తున్న ఆ ఆటగాడు మరెవరో కాదు.. యశస్వి జైస్వాల్. ఫార్మాట్ ఏదైనా బంతిని చితగ్గొట్టడమే పనిగా బ్యాటింగ్ చేస్తాడు జైస్వాల్. అందుకే అతడి గురించి స్పెషల్​గా మెన్షన్ చేశాడు లియాన్. తాను ఇప్పటివరకు జైస్వాల్​ను ఎదుర్కోలేదని, అతడికి బౌలింగ్ చేయలేదన్నాడీ ఆసీస్ స్పిన్నర్. అయితే తమ టీమ్ బౌలర్లకు ఈ యంగ్ బ్యాటర్​తో అసలైన సవాల్ ఎదురుకానుందన్నాడు. ఈ ఏడాది మొదట్లో ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో జైస్వాల్ ఆడిన తీరు సూపర్బ్ అని మెచ్చుకున్నాడు లియాన్.

యశస్వి జైస్వాల్​కు నేను ఇప్పటివరకు బౌలింగ్ చేయలేదు. కానీ అతడేంటో నాకు తెలుసు. అతడు చాలా టాలెంటెడ్ బ్యాటర్. జైస్వాల్​కు బౌలింగ్ చేయడం మా జట్టు బౌలర్లకు బిగ్ ఛాలెంజ్ కానుంది. ఇంగ్లండ్​తో టెస్ట్ సిరీస్​లో అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నేను ఆ మ్యాచ్​లను చూశా. అతడి బ్యాటింగ్ బ్రిలియంట్​గా సాగింది’ అని లియాన్ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ సంవత్సరం చివర్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. గత రెండు పర్యటనల్లోనూ టీమిండియా కంగారూలను చిత్తు చేసింది. ఈసారి కూడా వాళ్ల గడ్డపై వాళ్లను ఓడించాలని భావిస్తోంది. అటు ఆసీస్ మాత్రం భారత్​ను ఆపి తీరాలని ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే జైస్వాల్ గురించి, భారత జట్టుతో సిరీస్ గురించి లియాన్ పైవిధంగా రియాక్ట్ అయ్యాడు.

Show comments