iDreamPost
android-app
ios-app

Yashasvi Jaiswal: రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టిన జైస్వాల్.. ఇందుకే పట్టుబట్టి వరల్డ్ కప్​కు సెలెక్ట్ చేయించాడు!

  • Published May 03, 2024 | 9:47 AM Updated Updated May 03, 2024 | 9:47 AM

ఓపెనర్లుగా శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నప్పటికీ రోహిత్ పట్టుబట్టి మరీ జైస్వాల్ ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అందరికి సందేహం ఉంది. అయితే జైస్వాల్ లో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీనే రోహిత్ ను కట్టిపడేసింది. అదేంటంటే?

ఓపెనర్లుగా శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నప్పటికీ రోహిత్ పట్టుబట్టి మరీ జైస్వాల్ ను ఎంపిక చేయడానికి కారణం ఏంటని అందరికి సందేహం ఉంది. అయితే జైస్వాల్ లో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీనే రోహిత్ ను కట్టిపడేసింది. అదేంటంటే?

Yashasvi Jaiswal: రోహిత్ నమ్మకాన్ని నిలబెట్టిన జైస్వాల్.. ఇందుకే పట్టుబట్టి వరల్డ్ కప్​కు సెలెక్ట్ చేయించాడు!

టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమ్ ను ఇటీవలే ప్రకటించింది బీసీసీఐ. ఇక ఆ టీమ్ సెలెక్షన్ పై కొందరు మాజీలు, క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ లతో పాటుగా సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని విమర్శిస్తున్నారు. అయితే వీరందరిని కాదని యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ను వరల్డ్ కప్ జట్టులోకి తీసుకున్నారు. ఓపెనర్లుగా స్ట్రాంగ్ ప్లేయర్లు ఉన్నప్పటికీ రోహిత్ పట్టుబట్టి మరీ జైస్వాల్ ను ఎంపిక చేశాడని కొందరు అంటున్నారు. కాగా.. రోహిత్ తాజాగా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు ఈ యంగ్ ప్లేయర్.

యశస్వీ జైస్వాల్.. ఈ ఐపీఎల్ సీజన్ లో అద్భుతంగా రాణిస్తూ రాజస్తాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర  పోషిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్ ల్లో 316 పరుగులు చేశాడు. అయితే ఒక విధంగా చూస్తే.. ఇవి తక్కువ పరుగులే కావొచ్చు. మరెందుకు అతడికి టీ20 వరల్డ్ కప్ లో చోటు కల్పించారు? అన్న సందేహం చాలా మందిలో ఉంది. దానికి రోహిత్ నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. జైస్వాల్ స్టార్టింగ్ లోనే భారీ షాట్లతో విరుచుకుపడి, బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. ఇది అతడి బ్యాటింగ్ లో స్పెషాలిటీ. పైగా ఫియర్ లెస్ అప్రొచ్ బ్యాటింగ్ తో స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టిస్తాడు. జైస్వాల్ లో ఉన్న ఈ క్వాలిటీనే రోహిత్ ను కట్టిపడేసింది. దాంతో అతడిని వరల్డ్ కప్ టీమ్ కు సెలెక్ట్ చేశాడు.

ఇక తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ టీమ్ ఒక్క పరుగుతో ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించాడు జైస్వాల్. కేవలం 30 బంతుల్లోనే ఫిఫ్టీని కంప్లీట్ చేసుకుని శభాష్ అనిపించుకున్నాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 40 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 67 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కాగా.. ప్రస్తుత ఫామ్ తో పాటుగా గత కొంత కాలంగా జైస్వాల్ చూపిస్తున్న నిలకడైన ఫామ్ ను కూడా రోహిత్ పరిగణంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శుబ్ మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్లను కాదని జైస్వాల్ ను తీసుకోవడం కరెక్టే అని కొందరు రోహిత్ కు మద్ధతు తెలుపుతున్నారు. ఇక జైస్వాల్ ఇప్పటి వరకు 17 టీ20లు ఆడి.. 502 పరుగులు చేశాడు. అందులో ఓ శతకం కూడా ఉంది. మరి రోహిత్ నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగుతున్న యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.