Somesekhar
Yashasvi Jaiswal World Record, IND vs BAN: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ప్రపంచ రికార్డ్ సాధించాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.
Yashasvi Jaiswal World Record, IND vs BAN: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ప్రపంచ రికార్డ్ సాధించాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్ గా నిలిచాడు.
Somesekhar
బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. బంగ్లా బౌలర్ల దెబ్బకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు పెవిలియన్ చేరుతుంటే.. జైస్వాల్ మాత్రం చూడముచ్చటైన షాట్లతో అలరించాడు. బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. ఆడినంతసేపు ఫోర్లలతో అలరించాడు. ఇక ఈ మ్యాచ్ లో 118 బంతుల్లో 9 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిటి సువర్ణాక్షరాలతో లిఖించాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ బ్యాటర్ ఈ రికార్డు సాధించడం ఇదే తొలిసారి. ఆ రికార్డుకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
యశస్వీ జైస్వాల్.. టీమిండియాలోకి దూసుకొచ్చిన కొంత కాలంలోనే మూడు ఫార్మాట్స్ లో తన ప్లేస్ ను సుస్థిరం చేసుకున్నాడు. తన ఆటతీరుతో టీమిండియా ఫ్యూచర్ స్టార్ గా దిగ్గజాల నుంచి కితాబు అందుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుబ్ మన్ గిల్ లాంటి స్టార్ ప్లేయర్లు విఫలం అయిన చోట.. హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. దాంతో ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. తన మెుదటి 10 ఇన్నింగ్స్ ల్లో(సొంతగడ్డపై) అత్యధిక పరుగులు చేసిన తొలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. జైస్వాల్ స్వదేశంలో ఆడిన 10 ఇన్నింగ్స్ ల్లో 755 పరుగులు సాధించాడు.
కాగా.. ఈ రికార్డు ఇప్పటి వరకు వెస్టిండీస్ దిగ్గజం జార్జ్ హెడ్లీ పేరిట ఉండేది. 1935లో హెడ్లీ విండీస్ గడ్డపై 747 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు. అయితే స్వదేశంలో 750కి పైగా రన్స్ చేయడం మాత్రం 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ లో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక బంగ్లా బౌలర్లను ధీటుగా ఎదుర్కొని హాఫ్ సెంచరీ సాధించడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలవడానికి తన వంతు సాయం అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలిరోజు ఆటముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది టీమిండియా. క్రీజ్ లో సెంచరీ హీరో అశ్విన్(102*), జడేజా(86*) బ్యాటింగ్ చేస్తున్నారు. వీరిద్దరు ఏడో వికెట్ కు అభేద్యమైన 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరి ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్న యశస్వీ జైస్వాల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Yashasvi Jaiswal for you 🔥 pic.twitter.com/4htb4vmkfc
— RVCJ Media (@RVCJ_FB) September 19, 2024