iDreamPost
android-app
ios-app

యశస్వి సూపర్‌ బ్యాటింగ్‌.. ఏకంగా రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌!

  • Published Nov 27, 2023 | 11:43 AM Updated Updated Nov 27, 2023 | 11:43 AM

టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చెందిన ఒక అరుదైన రికార్డును యంగ్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తాజాగా బ్రేక్‌ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడిన జైస్వాల్‌.. టీమిండియా తరఫున తొలి ప్లేయర్‌గా నిలిచే రికార్డు అందుకున్నాడు. అందేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు చెందిన ఒక అరుదైన రికార్డును యంగ్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తాజాగా బ్రేక్‌ చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయి ఆడిన జైస్వాల్‌.. టీమిండియా తరఫున తొలి ప్లేయర్‌గా నిలిచే రికార్డు అందుకున్నాడు. అందేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 27, 2023 | 11:43 AMUpdated Nov 27, 2023 | 11:43 AM
యశస్వి సూపర్‌ బ్యాటింగ్‌.. ఏకంగా రోహిత్‌ శర్మ రికార్డు బ్రేక్‌!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఓటమి బాధ నుంచి బయటపడుతున్న క్రికెట్‌ అభిమానులకు యంగ్‌ టీమిండియా మరింత హెల్ప్‌ చేస్తూ.. ఊరటనిస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియాపై విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ20లో అద్భుత విజయం సాధించిన సూర్య సేన.. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లోనూ తొలి మ్యాచ్‌కు మించిన విజయం సాధించింది. 44 పరుగులతో గెలిచి.. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో ముందంజలో ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లు హాఫ్‌ సెంచరీలతో అదరగొట్టారు. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, యశస్వి జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌.. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిలో ముఖ్య​ంగా జైస్వాల్‌ గురించి మాట్లాడుకోవాలి.

25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. కేవలం 24 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్‌ సీన్ అబాట్ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో జైస్వాల్ రెచ్చిపోయి ఆడాడు. ఆ ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 6, 6 బాదాడు. మొత్తంగా ఆ ఒక్క ఓవర్‌లోనే 24 పరుగులు పిండుకున్నాడు. అయితే పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో నాథన్ ఇల్లిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి యశస్వి జైస్వాల్ అవుటయ్యాడు. దీంతో 77 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, 6 ఓవర్ల పవర్‌ప్లేలో ఒక వికెట్‌ కోల్పోయి 77 రన్స్‌ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియాపై అత్యుత్తమ పవర్‌ ప్లే స్కోర్‌ను నమోదు చేసింది.

ఇక ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో జైస్వాల్‌ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డును బ్రేక్‌.. టీమిండియా తరఫున తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇంతకీ రికార్డు ఏంటంటే.. టీ20ల్లో పవర్‌ ప్లేలోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు జైస్వాల్‌. ఇతని కంటే ముందు.. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌.. టీ20 మ్యాచ్‌లో పవర్‌ ప్లే లోనే హాఫ్‌ సెంచరీ బాదారు. 2020లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో పపర్‌ప్లే ఓవర్లలోనే హాఫ్ సెంచరీ కొట్టిన హిట్ మ్యాన్.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా నిలిచాడు. అయితే రోహిత్ , రాహుల్ ఇద్దరూ కూడా పవర్ ప్లేలో 50 పరుగులే చేశారు. కానీ, జైస్వాల్‌ మాత్రం 53 రన్స్‌తో.. పవర్‌ ప్లేలో అత్యధిక రన్స్‌ చేసిన ఇండియన్‌ బ్యాటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. మరి రోహిత్‌ రికార్డును జైస్వాల్‌ బ్రేక్‌ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.