iDreamPost
android-app
ios-app

Yash Dayal: బౌలింగ్​కు పనికిరాడన్నారు.. కట్ చేస్తే టీమిండియాలోకి ఎంట్రీ! సక్సెస్ అంటే ఇదే!

  • Published Sep 09, 2024 | 4:50 PM Updated Updated Sep 09, 2024 | 4:50 PM

Yash Dayal Gets Selected For Bangladesh Series: బౌలింగ్​కు పనికిరాడన్నారు. ఇంత చెత్త ప్లేయర్​ను ఎలా ఆడిస్తున్నారని విమర్శించారు. కానీ అవమానాలను సక్సెస్ స్టెప్స్​గా మలచుకున్న ఆ బౌలర్.. కసిగా ఆడుతూ ఇప్పుడు ఏకంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Yash Dayal Gets Selected For Bangladesh Series: బౌలింగ్​కు పనికిరాడన్నారు. ఇంత చెత్త ప్లేయర్​ను ఎలా ఆడిస్తున్నారని విమర్శించారు. కానీ అవమానాలను సక్సెస్ స్టెప్స్​గా మలచుకున్న ఆ బౌలర్.. కసిగా ఆడుతూ ఇప్పుడు ఏకంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

  • Published Sep 09, 2024 | 4:50 PMUpdated Sep 09, 2024 | 4:50 PM
Yash Dayal: బౌలింగ్​కు పనికిరాడన్నారు.. కట్ చేస్తే టీమిండియాలోకి ఎంట్రీ! సక్సెస్ అంటే ఇదే!

క్రికెట్​లో ఒక్కొక్కరి స్టోరీ ఒక్కోలా ఉంటుంది. అత్యున్నత స్థాయికి చేరే క్రమంలో ఆటగాళ్లు ఎన్నో ఒడిదొడుకులు చూడాల్సి వస్తుంది. అలా సక్సెస్ అయిన వారిలాగే అతడూ అవన్నీ చూశాడు. ఎలాంటి క్రికెట్ బ్యాగ్రౌండ్ లేదు. ఎవరి అండదండలు లేవు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చాడు. కష్టం, టాలెంట్​ను నమ్ముకొని ఆడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్​కు ఎంపికయ్యాడు. కానీ ఒక్క ఓవర్. ఒకే ఒక్క ఓవర్​తో అతడి ఆశల సౌధం కూలింది. భారత జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్లేయర్.. రింకూ సింగ్ బాదుడు బలయ్యాడు. వరుసగా ఐదు బంతుల్లో 5 సిక్సులు కొట్టడంతో అతడిపై విమర్శల వాన కురిసింది. ఆ బాధ, ఒత్తిడిని భరించలేక ఏకంగా 8 కిలోలు బరువు తగ్గాడు. టోర్నీలోని కొన్ని మ్యాచులకు దూరమయ్యాడు. అతడి పనైపోయిందని అంతా అనుకున్నారు. ఇక మళ్లీ కనిపించడని భావించారు. కానీ పడిలేచిన కెరటంలా దూసుకొచ్చిన ఆ యంగ్ గన్ టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. అతడే డైనమిక్ పేస్ బౌలర్ యష్​ దయాల్.

సెప్టెంబర్ 19వ తేదీ నుంచి మొదలయ్యే బంగ్లాదేశ్ సిరీస్ కోసం ఆదివారం నాడు భారత జట్టును ప్రకటించారు సెలెక్టర్లు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 15 మంది సభ్యుల టీమ్​ను అనౌన్స్ చేశారు. ఇందులో పేసర్ యష్ దయాల్​కు చోటు దక్కింది. దీంతో గతేడాది క్రికెట్​కే పనికిరాడన్న క్రికెటర్.. ఏడాది గ్యాప్​లో భారత జట్టులోకి ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం వ్యవధిలో దయాల్ ఎంత సక్సెస్ అయ్యాడు? అతడి పెర్ఫార్మెన్స్ ఎంత బెటర్ అయింది? టీమిండియాలోకి వచ్చేందుకు అతడు పడిన కష్టం అనేది క్రికెట్ లవర్స్​కు బాగా తెలుసు. ఐపీఎల్-2023లో తన ఓవర్​లో రింకూ 5 సిక్సులు బాదడంతో మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాడు దయాల్. ఆ బాధ, ప్రెజర్ నుంచి కోలుకునేందుకు అతడికి చాలా టైమ్ పట్టింది. అయితే ఒక్కసారి అందులో నుంచి రికవర్ అయ్యాక అతడు పూర్తిగా మారిపోయాడు.

రింకూ 5 సిక్సుల ఎపిసోడ్​ యష్​ దయాల్​ను పూర్తిగా మార్చేసింది. ఒకవేళ అది జరగకపోతే అతడు భారత జట్టులోకి ఇంత త్వరగా ఎంట్రీ ఇచ్చేవాడు కాదేమో! ఎందుకంటే రింకూ బాదుడుతో తనపై వచ్చిన విమర్శలు, ఒత్తిడి దయాల్​ను రాటుదేల్చాయి. తనలోని బెస్ట్ ఇచ్చేందుకు, గేమ్​ను మరింత బాగా అర్థం చేసుకునేందుకు, ఆటగాడిగానే గాక వ్యక్తిగతంగానూ తాను మరింత స్ట్రాంగ్ అయ్యేందుకు అది బాగా హెల్ప్ చేసింది. అంతకుముందు వరకు మామూలుగా బౌలింగ్​ చేసే దయాల్.. అక్కడి నుంచి వేరియేషన్స్ పెంచుకున్నాడు. స్లో బాల్స్, కట్టర్స్, యార్కర్స్, స్లో బౌన్సర్స్ వేయడం నేర్చుకున్నాడు. ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపర్చుకుంటూ డొమెస్టిక్ క్రికెట్​లో దుమ్మురేపాడు. రింకూ ఎపిసోడ్ కారణంగా గుజరాత్ టైటాన్స్​ అతడ్ని వదులుకోవడంతో ఐపీఎల్ ఆక్షన్​లోకి వచ్చాడు. ఎవరూ అతడ్ని కొనబోరని చాలా మంది అనుకున్నారు. కానీ ఫ్రాంచైజీలు అతడి కోసం చాలా ఆసక్తి చూపించాయి.

ఐపీఎల్-2024కు ముందు జరిగిన ఆక్షన్​లో తీవ్ర పోటీ మధ్య ఆర్సీబీ జట్టు రూ.5 కోట్లు చెల్లించి యష్ దయాల్​ను దక్కించుకుంది. డొమెస్టిక్ క్రికెట్​లో అతడు ఆడిన విధానానికి ఇంప్రెస్ అయి భారీ ధర పెట్టి టీమ్​లోకి తీసుకుంది. ఆ ప్రైజ్​కు అతడు పూర్తి న్యాయం చేశాడు. ఈ సీజన్​లో 14 మ్యాచుల్లో 15 వికెట్లు తీశాడు. కెప్టెన్ డుప్లెసిస్, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అండగా నిలవడంతో అతడు రెచ్చిపోయి బౌలింగ్ చేశాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు చేరడంలో బౌలింగ్​ విభాగంలో దయాల్ పోషించిన రోల్ కీలకంగా నిలిచింది.

ఐపీఎల్ తర్వాత తనను తాను మరింత సానబెట్టుకున్న దయాల్.. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో మరోమారు సత్తా చాటాడు. ఇండియా-ఏతో జరిగిన ఫస్ట్ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. రియాన్ పరాగ్, మయాంక్ అగర్వాల్, ధృవ్ జురెల్ లాంటి స్టార్ బ్యాటర్లను ఔట్ చేశాడు. అతడి ఫిట్​నెస్​, ఫామ్, రిథమ్​ను దృష్టిలో పెట్టుకొని బంగ్లా సిరీస్​కు ఎంపిక చేశారు సెలెక్టర్లు. దీంతో ఒకప్పుడు పనికిరాడన్న వారే అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అవమానాలకు కుంగిపోకుండా నిలబడి పోరాడితే ఎవ్వరైనా దయాల్​లా సక్సెస్ అవ్వొచ్చని మెచ్చుకుంటున్నారు. మరి.. దయాల్ సక్సెస్ స్టోరీ విన్నాక మీకేం అనిపించిందో కామెంట్ చేయండి.