iDreamPost
android-app
ios-app

ధోని క్రేజ్ కు ఫిదా అయిన WWE సూపర్ స్టార్!

  • Author Soma Sekhar Published - 10:15 PM, Thu - 7 September 23
  • Author Soma Sekhar Published - 10:15 PM, Thu - 7 September 23
ధోని క్రేజ్ కు ఫిదా అయిన WWE సూపర్ స్టార్!

మహేంద్ర సింగ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఈ పేరొక కలికితురాయి. వరల్డ్ బెస్ట్ ఫినిషర్ గా, బెస్ట్ కెప్టెన్ గా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనత ఈ మహేంద్రుడి సొంతం. ఇక ధోనికి ఇండియాతో పాటుగా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండియాలో ధోని క్రేజ్ చూసి ఫిదా అయ్యాడు WWE సూపర్ స్టార్ సమీ జైన్. తన సహచరుడు WWE సూపర్ స్టార్ కెవిన్ ఒవెన్స్ కు ధోని గొప్పతనం గురించి చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

WWE సూపర్ స్టార్ స్పెక్టాకిల్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదికైన విషయం తెలిసిందే. గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ సూపర్ ఫైట్ లో 28 మంది అంతర్జాతీయ ఛాంపియన్స్ ఢీకొంటున్నారు. కాగా.. హైదరాబాద్ లో తొలిసారి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్ మెంట్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 8 ఈ సూపర్ ఫైట్ జరగనుంది. దీంతో WWE సూపర్ స్టార్స్ అందరు హైదరాబాద్ చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో WWE సూపర్ స్టార్లలో ఒకడైన సమీ జైన్.. తాను ఇండియాలో అడుగుపెట్టగానే ధోని పేరును విన్నానని, అతడు ఇక్కడ చాలా ఫేమస్ అని తన సహచర రెజ్లర్ కెవిన్ ఒవెన్స్ కు చెబుతున్న వీడియో వైరల్ గా మారింది. దీంతో ధోని క్రేజా మజాకా అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక రెజ్లింగ్ విషయానికి వస్తే.. ప్రపంచ ప్రసిద్ది గాంచిన 28 మంది రెజ్లర్లు ఈ పోటీలో పాల్గొనబోతున్నారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలువనున్నాడు ‘జాన్ సీనా’. 16 సార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు జాన్ సీనా. మరి ధోని క్రేజ్ గురించి WWE సూపర్ స్టార్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabet