iDreamPost

ఇదికదా బ్యాటింగ్ అంటే.. బవుమా వన్ మ్యాన్ షో! హ్యాట్సాఫ్..

  • Author Soma Sekhar Updated - 09:21 PM, Thu - 7 September 23
  • Author Soma Sekhar Updated - 09:21 PM, Thu - 7 September 23
ఇదికదా బ్యాటింగ్ అంటే.. బవుమా వన్ మ్యాన్ షో! హ్యాట్సాఫ్..

ఆసీస్ పేస్ బౌలింగ్ ధాటికి సౌతాఫ్రికా బ్యాటర్లందరూ ఒక్కొక్కరుగా పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. కానీ ఒకే ఒక్కడు ఆసీస్ పేస్ దళాన్ని ఎదుర్కొంటూ నిలబడ్డాడు. అదికూడా ఆట చివరిదాక. అతడి ఆటలో భారీ సిక్సర్లు లేవు.. కానీ బాధ్యతాయుతమైన బ్యాటింగ్ ఉంది. అతడి ఆటలో బౌలర్లను చితకొట్టాలన్న కసిలేదు.. జట్టును పటిష్టస్థితిలో నిలపాలన్న ఆలోచన మాత్రమే ఉంది. అందుకే ఓపెనర్ గా వచ్చి చివరి వరకు నిలిచి.. అజేయ శతకంతో చెలరేగాడు సౌతాఫ్రికా సారథి టెంబ బవుమా. ఇదికదా బ్యాటింగ్ అంటే.. ఇదికదా కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే అన్నట్లుగా అత్యద్భుతంగా తన బ్యాటింగ్ ను ఈరోజు కొనసాగించాడు. 142 బంతులు ఎదుర్కొన్న బవుమా 14 ఫోర్లు, ఓ సిక్స్ తో 114 పరుగులతో అజేయంగా నిలిచాడు.

టెంబ బవుమా.. వరల్డ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాగే నిలకైడన ఆటగాడిగా తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నాడు. తాజాగా ఆసీస్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా.. జరుగుతున్న తొలి వన్డేలో దుమ్మురేపాడు ఈ సౌతాఫ్రికా సారథి. ఒక వైపు సహచర బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. మెుక్కవోని దైర్యంతో బ్యాటింగ్ చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ ను అందించాడు. టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ను ఎన్నుకుంది.

వరల్డ్ క్రికెట్ లోనే పటిష్టమైన పేస్ దళం ఉన్న టీమ్ గా ఆసీస్ కు పేరు ఉండనే ఉంది. ఆ పేరుకు తగ్గట్లుగానే ప్రోటీస్ టీమ్ ను ఓ ఆటాడుకున్నారు ఆస్ట్రేలియా బౌలర్లు. టాప్ బౌలర్ హేజిల్ వుడ్, స్టోయినిస్, సీన్ అబ్బాట్ లు నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. వీరి బౌలింగ్ ధాటికి ఒక్క బవుమా తప్పితే మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్(11), వాండర్ డస్సెన్(8), మార్క్రమ్(19), క్లాసెన్(14) మిల్లర్(0) లు తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరారు. బవుమా తర్వాత మార్కో జాన్సన్(34) ఒక్కడే కెప్టెన్ కు సహకారం అందించాడు. బవుమా ఒక్కడే జట్టు స్కోర్ లో సగం చేయడం విశేషం.

ఇక 49 ఓవర్లకు 222 పరుగులకు ఆలౌట్ అయ్యింది సౌతాఫ్రికా జట్టు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ 3 వికెట్లు తీయగా.. స్టోయినిస్ 2 వికెట్లు తీశాడు. అనంతరం 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(0)ను మార్కో జాన్సన్ బౌల్డ్ చేసి సౌతాఫ్రికాకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. వరల్డ్ కప్ ఆరంభానికి ముందు సౌతాఫ్రికా సారథి భీకర ఫామ్ లో ఉన్నాడు. అతడు ఆడిన 6 మ్యాచ్ ల్లో 3 సెంచరీలు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. మరి టెంబ బవుమా వన్ మ్యాచ్ షో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి