VIDEO: రెజ్లింగ్ ​స్టార్ జాన్ సీనాను ఇమిటేట్ చేసిన అంపైర్.. ఔట్ ఇవ్వకుండా..!

  • Author singhj Published - 08:25 PM, Fri - 22 September 23
  • Author singhj Published - 08:25 PM, Fri - 22 September 23
VIDEO: రెజ్లింగ్ ​స్టార్ జాన్ సీనాను ఇమిటేట్ చేసిన అంపైర్.. ఔట్ ఇవ్వకుండా..!

వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్​టైన్​మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) ఈ పేరు వినని క్రీడాభిమానులు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. బాహుబలి లాంటి పర్సనాలిటీతో కనిపించే రెజర్లు రింగ్​లోకి దిగి ఒకరితో ఒకరు తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. డబ్ల్యూడబ్ల్యూఈ రెజర్లు పోరాడుతుంటే కొదమ సింహాలు తలపడుతున్నట్లే ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్​లకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లకు మామూలు పాపులారిటీ ఉండదు. ఈతరం బెస్ట్ రెజ్లింగ్ స్టార్లలో ఒకడిగా జాన్ సీనాను చెప్పొచ్చు.

ఈతరంలోనే కాదు ఆల్​టైమ్ గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజర్లలో సీనా పేరు కచ్చితంగా ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో అత్యధిక వరల్డ్ ఛాంపియన్​షిప్స్ గెలిచిన ఘనత అతడి పేరు మీదే ఉంది. 6.1 ఫీట్ల ఎత్తు ఉండే సీనా బరువు 114 కిలోలంటే నమ్మక తప్పదు. అంత ఎత్తు, బరువు ఉన్నా కూడా రింగ్​లో దిగాడంటే పాదరసంలా కదులుతూ, ప్రత్యర్థిపై బెబ్బులిలా విరుచుకుపడతాడు. ఓటమిని ఒప్పుకోకు అనే సూత్రాన్ని సీనా నమ్ముతాడు. జాన్ సీనా ప్రత్యర్థులపై గెలవడంలోనే కాదు ప్రేక్షకుల్ని ఎంటర్​టైన్ చేయడంలో ముందుంటాడు. స్టైలిష్ మేనరిజమ్స్​తో ఫ్యాన్స్​ను ఉత్సాహపరుస్తుంటాడు సీనా. అలాంటి ఓ మేనరిజమ్​నే ఒక క్రికెట్ అంపైర్ ఇమిటేట్ చేశాడు.

కరీబియన్ ప్రీమియర్​ లీగ్​లో భాగంగా ట్రిన్​బాగో నైట్ రైడర్స్​, గయానా అమెజాన్ వారియర్స్​కు మధ్య జరిగిన టీ20 మ్యాచ్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. గయానా టీమ్ కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతిని షాట్ ఆడాలని చూశాడు బ్యాటర్ డేయల్. కానీ బాల్ మిస్సయి అతడి ప్యాడ్స్​కు తగిలింది. దీంతో తాహిర్ ఎల్​బీడబ్యూకు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం తనకు ఏమీ కనిపించలేదంటూ జాన్ సీనాను ఇమిటేట్ చేస్తూ చేతిని తలకు అడ్డంగా ఊపాడు. అయితే తాహిర్ రివ్యూ కోరగా.. థర్డ్ అంపైర్ ఔట్​గా ప్రకటించాడు. అంపైర్ జాన్ సీనాను ఇమిటేట్ చేయడం నెట్టింట వైరల్​గా మారింది. ఈ అంపైర్ కచ్చితంగా సీనా ఫ్యాన్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: సంజూ శాంసన్​ను ఇక మర్చిపోవాల్సిందేనా?

Show comments