iDreamPost

సంజు శాంసన్‌ను మర్చిపోవాల్సిందేనా? క్లారిటీ ఇచ్చిన కోచ్‌ ద్రవిడ్‌!

  • Published Sep 22, 2023 | 7:14 PMUpdated Sep 22, 2023 | 7:14 PM
  • Published Sep 22, 2023 | 7:14 PMUpdated Sep 22, 2023 | 7:14 PM
సంజు శాంసన్‌ను మర్చిపోవాల్సిందేనా? క్లారిటీ ఇచ్చిన కోచ్‌ ద్రవిడ్‌!

సంజు శాంసన్‌.. హైలీ టాలెంటెడ్‌ క్రికెటర్‌. సేమ్‌ టైమ్‌ మోస్ట్‌ అన్‌లక్కీ కూడా. చాలా కాలంగా శాంసన్‌కు టీమిండియాలో సరైన అవకాశాలు దక్కడం లేదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. సంజు కంటే బాగా ఆడని ఆటగాళ్లను సైతం టీమ్‌లోకి తీసుకుంటున్నారని కానీ, సంజుకు మాత్రం అన్యాయం చేస్తున్నారంటూ అతని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా.. సెలెక్టర్లపై అలాగే బీసీసీఐ తీవ్ర స్థాయిలో విమర్శల గుప్పించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ కంటే కూడా సంజు శాంసన్‌ ఎంతో బెస్ట్‌ ప్లేయర్‌ అని, బ్యాటింగ్‌తోనే కాకుండా.. వికెట్‌ కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ కంటే కూడా బెస్ట్‌ అని పేర్కొన్నారు.

వారి వాదనల్లో నిజం లేకపోలేదు. ఇకసారి సంజు, సూర్య వన్డే కెరీర్‌లను విశ్లేషిస్తే.. వన్డేల్లో సంజు శాంసన్‌ బ్యాటింగ్‌ యావరేజ్‌ చూసుకుంటే సూర్యకుమార్‌ యాదవ్‌ కంటే బెటర్‌గా ఉంది. ఇప్పటి వరకు 27 వన్డేలు ఆడిన సూర్య.. 25 ఇన్నింగ్స్‌ల్లో 24.40 యావరేజ్‌తో కేవలం 537 పరుగులు మాత్రమే చేశాడు. బెస్ట్‌ స్కోర్‌ 64, కేవలం రెండే రెండు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అలాగే స్ట్రైక్‌ రేట్‌ సైతం వందలోపలే ఉంది. అదే సమయంలో సంజు శాంసన్‌ వన్డే కెరీర్‌ను చూసుకంటే.. సంజుకు కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. వాటిలో 12 ఇన్నింగ్స్‌ల్లో 55.71 యావరేజ్‌తో 390 పరుగులు చేశాడు. బెస్ట్‌ స్కోర్‌ 86, స్ట్రైక్‌రేట్‌ సైతం 104. ఇలా ఏ విషయంలో చూసుకున్నా.. సూర్య కంటే సంజునే బెస్ట్‌గా ఉన్నాడు.

కానీ, టీమిండియా మేనేజ్‌మెంట్‌ మాత్రం సంజును కాదని, సూర్యకుమార్‌ యాదవ్‌ను బ్యాక్‌ చేస్తుంది. టీ20 క్రికెట్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాటర్‌గా ఉన్న సూర్యను వన్డేల్లోను ఆడించి.. కీ ప్లేయర్‌గా మార్చాలని చూస్తుంది. కానీ, సూర్య మాత్రం వన్డేల్లో విఫలం అవుతూనే ఉన్నాడు. తాజాగా ఆసియా కప్‌లో ఒక మ్యాచ్‌ ఆడిన సూర్య​.. అందులోనే విఫలం అయ్యాడు. అయినా కూడా వరల్డ్‌ కప్‌కు ఎంపిక చేశారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. సూర్యను మరింత బ్యాక్‌ చేస్తామని, అంతను వన్డేల్లో రాణిస్తాడనే నమ్మకం తమకుందని తేల్చిచెప్పాడు. వరల్డ్‌ కప్‌కి ముందు, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ సూర్యకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో అవకాశం కల్పిస్తామని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. దీంతో.. ఇక టీమిండియాలో సంజు శాంసన్‌ రావడం కష్టమే అని మాట వినిపిస్తుంది. ద్రవిడ్‌ మాటలతో ఇక సంజును మర్చిపోవడమేనా? అంటూ ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవాలంటే.. వాళ్లని ఓడించాలి: గంభీర్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి