వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) ఈ పేరు వినని క్రీడాభిమానులు ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. బాహుబలి లాంటి పర్సనాలిటీతో కనిపించే రెజర్లు రింగ్‌లోకి దిగి ఒకరితో ఒకరు తలపడుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. డబ్ల్యూడబ్ల్యూఈ రెజర్లు పోరాడుతుంటే కొదమ సింహాలు తలపడుతున్నట్లే ఉంటుంది. అందుకే ఈ మ్యాచ్‌లకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్లకు మామూలు పాపులారిటీ ఉండదు. ఈతరం బెస్ట్ రెజ్లింగ్ స్టార్లలో ఒకడిగా జాన్ సీనాను చెప్పొచ్చు.
ఈతరంలోనే కాదు ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజర్లలో సీనా పేరు కచ్చితంగా ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో అత్యధిక వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలిచిన ఘనత అతడి పేరు మీదే ఉంది. 6.1 ఫీట్ల ఎత్తు ఉండే సీనా బరువు 114 కిలోలంటే నమ్మక తప్పదు. అంత ఎత్తు, బరువు ఉన్నా కూడా రింగ్‌లో దిగాడంటే పాదరసంలా కదులుతూ, ప్రత్యర్థిపై బెబ్బులిలా విరుచుకుపడతాడు. ఓటమిని ఒప్పుకోకు అనే సూత్రాన్ని సీనా నమ్ముతాడు. జాన్ సీనా ప్రత్యర్థులపై గెలవడంలోనే కాదు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో ముందుంటాడు. స్టైలిష్ మేనరిజమ్స్‌తో ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తుంటాడు సీనా. అలాంటి ఓ మేనరిజమ్‌నే ఒక క్రికెట్ అంపైర్ ఇమిటేట్ చేశాడు.
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, గయానా అమెజాన్ వారియర్స్‌కు మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గయానా టీమ్ కెప్టెన్ ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతిని షాట్ ఆడాలని చూశాడు బ్యాటర్ డేయల్. కానీ బాల్ మిస్సయి అతడి ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో తాహిర్ ఎల్బీడబ్యూకు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ మాత్రం తనకు ఏమీ కనిపించలేదంటూ జాన్ సీనాను ఇమిటేట్ చేస్తూ చేతిని తలకు అడ్డంగా ఊపాడు. అయితే తాహిర్ రివ్యూ కోరగా.. థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అంపైర్ జాన్ సీనాను ఇమిటేట్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ అంపైర్ కచ్చితంగా సీనా ఫ్యాన్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: సంజూ శాంసన్‌ను ఇక మర్చిపోవాల్సిందేనా?
Imran Tahir appeals for the LBW.
Umpire does John Cena’s ‘You can’t see me’ gesture as he couldn’t see what happened.pic.twitter.com/7mk3UTIJzn
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 22, 2023