సూర్యకుమార్ ను గుర్తుచేసిన RCB లేడీ బౌలర్.. రివేంజ్ అదిరిందంటున్న ఫ్యాన్స్!

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ముంబై-ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. సూర్యకుమార్ ను గుర్తుకు తెస్తూ.. 2 ఏళ్ల తర్వాత స్వీట్ రివేంజ్ ను తీర్చుకుంది ఆర్సీబీ లేడీ బౌలర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ముంబై-ఆర్సీబీ జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. సూర్యకుమార్ ను గుర్తుకు తెస్తూ.. 2 ఏళ్ల తర్వాత స్వీట్ రివేంజ్ ను తీర్చుకుంది ఆర్సీబీ లేడీ బౌలర్. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 చివరి దశకు వచ్చింది. టైటిల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తో అమీతుమీకి సిద్ధమైంది రాయల్ ఛాలెంజర్స్ ఉమెన్స్ టీమ్. శుక్రవారం ముంబైతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీని సాధించింది ఆర్సీబీ. స్వల్ప స్కోర్లే నమోదైన ఈ మ్యాచ్ లో చివరి బంతికి వరకూ ఆట కొనసాగిన తీరు ప్రేక్షకులకు అసలైన క్రికెట్ మజాను అందించింది. ఇక ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. 2020 ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీపై విజయం సాధించిన తర్వాత సూర్యకుమార్ చేసిన ఓవరాక్షన్ కు తాజాగా రివేంజ్ తీర్చుకుంది ఆర్సీబీ లేడీ బౌలర్. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

అది 2020 ఐపీఎల్.. ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు టీమిండియా స్టార్ ప్లేయర్, ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. అయితే ఓ వైపు బంతులు దగ్గరపడుతుంటే.. అతడు మాత్రం సింగిల్ వచ్చే అవకాశం ఉన్నా తీయకుండా అలాగే ఉండి, తర్వాత బాల్ కు మ్యాచ్ ను గెలిపించాడు. ఆ తర్వాత నేనున్నాను ఎందుకు టెన్షన్ పడతావ్ అనే విధంగా సహచర బ్యాటర్ కు సైగ చేశాడు. ఇది అప్పట్లో వైరల్ గా మారింది.

సేమ్ సీన్ 4 ఏళ్ల తర్వాత ముంబై టీమ్ పై రిపీట్ చేసి స్వీట్ రివేంజ్ తీర్చుకుంది ఆర్సీబీ లేడీ బౌలర్ ఆషా శోభన. అసలేం జరిగిందంటే? WPL 2024లో భాగంగా తాజాగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ముంబై-ఆర్సీబీ టీమ్స్ తలపడ్డాయి. నరాలు తెగే ఉత్కంఠగా ఈ మ్యాచ్ జరిగింది. చివరి బాల్ కు ముంబై 6 పరుగులు చేస్తే ఫైనల్లోకి వెళ్తుంది. కానీ ఆర్సీబీ బౌలర్ ఆషా శోభన అద్భుతమైన బౌలింగ్ తో చివరి బంతికి కేవలం ఒకే పరుగు ఇచ్చింది. దీంతో 5 రన్స్ తేడాతో ఆర్సీబీ విజయకేతనం ఎగురువేసింది. ఈ క్రమంలో సూర్య గతంలో చేసినట్లుగానే శోభన చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అచ్చం సూర్య చేతులతో ఎలాంటి సైగలు చేశాడు శోభన కూడా అలాగే చేసింది.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 4 ఏళ్ల కి రివేంజ్ తీర్చుకున్నారా? ఇదే కర్మ ఫలితం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 రన్స్ చేసింది. జట్టులో బ్యూటీ ఎల్లిస్ పెర్రీ 66 రన్స్ తో రాణించింది. అనంతరం 136 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై టీమ్ ఓవర్లు మెుత్తం ఆడి 6 వికెట్లు కోల్పోయి 130 రన్స్ కే పరిమితమైంది.

ఇదికూడా చదవండి: IPLలో ఆడకపోవడమే మంచిది.. సర్ఫరాజ్ తమ్ముడు షాకింగ్ కామెంట్స్!

Show comments