iDreamPost

IPLలో ఆడకపోవడమే మంచిది.. సర్ఫరాజ్ తమ్ముడు షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ లో తన పేరు లేకపోవడమే మంచిదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్. అతడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో చాలా మందికి అర్ధం కావడంలేదు. ఆ వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ లో తన పేరు లేకపోవడమే మంచిదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్. అతడు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశాడో చాలా మందికి అర్ధం కావడంలేదు. ఆ వివరాల్లోకి వెళితే..

IPLలో ఆడకపోవడమే మంచిది.. సర్ఫరాజ్ తమ్ముడు షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ లో ఆడాలని ప్రతీ ఒక్క వర్ధమాన క్రికెటర్లు కలలు కంటూ ఉంటారు. అలాంటి అవకాశం కోసం ఎదురూచూస్తారు. ఎందుకంటే? ఈ మెగాటోర్నీలో ఆడితే.. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు. పైగా అద్భుతంగా రాణిస్తే జాతీయ జట్టులో చోటు. ఓ క్రికెటర్ కు అంతకన్నా ఏం కావాలి? అందుకే ఈ క్యాష్ రిచ్ లీగ్ లో ఆడాలని ఉవ్విళ్లూరుతుంటారు యువ క్రికెటర్లు. కానీ ఓ ఇండియన్ యంగ్ క్రికెటర్ మాత్రం ఐపీఎల్ లో నా పేరు లేకపోవడం, ఆడకపోవడం మంచిదే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతకీ ఈ హాట్ కామెంట్స్ చేసింది ఎవరో కాదు.. రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో కదంతొక్కిన సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్. మరి ఈ ముషీర్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక అంతర్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ముషీర్ ఖాన్.. సర్ఫరాజ్ తమ్ముడిగా క్రికెట్ ప్రేమికులకు సుపరిచితుడే. అయితే ఆటతీరులో అన్నకు తగ్గ తమ్ముడిగా దూసుకెళ్తున్నాడు కూడా. తాజాగా ముగిసిన రంజీ ట్రోఫీలో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు ముషీర్. విధర్భతో జరిగిన ఫైనల్లో అద్భుతమైన సెంచరీతో ముంబైకి 42వ రంజీ ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. టెస్టు క్రికెట్ లో పాటుగా టీ20లకు సరిపోయే బ్యాటింగ్ ముషీర్ సొంతం. కానీ ఈ 19 ఏళ్ల బ్యాటర్ ను ఐపీఎల్ మినీ వేలంలో ఎవ్వరూ కొనుగోలు చేయలేదు. దీంతో నిరాశ చెందాడు. అయితే ఆ సమయంలో తన తండ్రి చెప్పిన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు ముషీర్.

It is better not to play in IPL

ఐపీఎల్ లో ప్లేస్ పై ముషీర్ ఖాన్ మాట్లాడుతూ..”ఐపీఎల్ లో నా పేరు లేకపోవడం సంతోషకరమైన విషయమే. ఇప్పుడు ఈ మెగాటోర్నీలో ఆడకపోవడం మంచిదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే? టెస్ట్ క్రికెట్ పై దృష్టిపెట్టి, జాతీయ జట్టులో చోటు సంపాదించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని మా నాన్న నాతో చెప్పారు. అలా వెళ్లే క్రమంలో ఐపీఎల్ లో చోటు అదే దక్కుతుందన్నారు. అదీకాక టీ20 ఫార్మాట్ ను పూర్తిగా అర్ధం చేసుకోవాలి. అన్ని రకాల పొట్టి లీగ్ ల కోసం సిద్ధం కావాలని” అని పీటీఐతో చెప్పుకొచ్చాడు ముషీర్ ఖాన్. ప్రస్తుతం ముషీర్ చేసిన ఈ వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.

ఈ సందర్బంగా తన అన్న సర్ఫరాజ్ ఖాన్ గురించి మాట్లాడాడు. అన్న ఆటతీరు నా ఆటతీరు ఒకేలా ఉంటుందని తెలిపాడు ముషీర్. అన్నకి ఆట పట్ల ఉన్న అంకిత భావం, ప్రేమ నాకెంతో నచ్చుతాయి. అన్నయ్య బ్యాటింగ్ స్టైల్ చూడముచ్చటగా ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ అని ఒత్తిడి చెందకని, కామన్ మ్యాచ్ ల్లాగే ఇక్కడా ఆడు అని మ్యాచ్ కు ముందు నాలో ధైర్యం నింపాడని ముషీర్ పేర్కొన్నాడు. కాగా.. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో విధర్భ బౌలర్లను దంచికొడుతూ సెకండ్ ఇన్నింగ్స్ లో 136 పరుగులు చేశాడు. దీంతో తన టీమ్ కు భారీ ఆధిక్యాన్ని సంపాదించడమే కాకుండా.. విజయం సాధించేందుకు బాటలు వేశాడు. మరి ఐపీఎల్ లో తన పేరు లేకపోవడమే మంచిది అన్న ముషీర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: ఆసీస్​పై హిస్టారికల్ విక్టరీ.. షాంపెయిన్​తో సచిన్, ద్రవిడ్, గంగూలీ సందడి​!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి