Nidhan
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన ఆ టీమ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే స్మృతి సేన విజయాల వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన ఆ టీమ్.. విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అయితే స్మృతి సేన విజయాల వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.
Nidhan
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొత్తానికి అనుకున్నది సాధించింది. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టిన స్మృతి సేన విమెన్స్ ప్రీమియర్ లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లు శ్రేయాంకా పాటిల్ (4/12), సోఫియా మొలిన్యూక్స్ (3/20), శోభనా ఆశా (2/14) దెబ్బకు ఢిల్లీ బ్యాటింగ్ యూనిట్ కకావికలమైంది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన బెంగళూరు మరో 3 బంతులు ఉండగానే ఛేజ్ చేసి విక్టరీ కొట్టింది. కెప్టెన్ స్మృతి (31)తో పాటు సోఫీ డివైన్ (32), ఎలిస్ పెర్రీ (35 నాటౌట్) రాణించారు. అయితే ఆర్సీబీ వరుస విజయాలు సాధించడం, కప్ కొట్టడం వెనుక విరాట్ కోహ్లీ ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదు.
ఆర్సీబీ పురుషుల టీమ్ మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ విమెన్స్ టీమ్‌ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు. గతేడాది స్మృతి సేన దారుణంగా పెర్ఫార్మ్ చేసింది. పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. దీంతో వాళ్లు చాలా బాధపడ్డారు. ఇక, గెలవలేమని నిరాశలో కూరుకుపోయారు. అయితే ఆ టైమ్‌లో తనతో కోహ్లీ మాట్లాడాడని స్మృతి మంధాన బయటపెట్టింది. అతడు తమ టీమ్ క్యాంప్‌కు వచ్చాడని తెలిపింది. విరాట్ తప్పకుండా గెలుస్తామంటూ ఒకే మాట చెప్పి తమలో ధీమాను పెంచాడని గుర్తుచేసుకుంది. ‘నాకు ఇంకా గుర్తుంది. గత డబ్ల్యూపీఎల్ సీజన్లో మా టీమ్ వరుస ఓటములతో డీలా పడిపోయింది. ఆ సమయంలో విరాట్ భయ్యా మా క్యాంప్‌కు వచ్చాడు. మాతో కొద్దిసేపు డిస్కస్ చేశాడు. గెలుస్తామనే ధీమాను ఇచ్చాడు. అది నాకు పర్సనల్‌గా చాలా హెల్ప్ అయింది. అలాగే మొత్తం టీమ్‌లో కూడా అతడు జోష్‌ను నింపాడు’ అని స్మృతి రివీల్ చేసింది.
ఆర్సీబీ విమెన్స్ టీమ్‌తో కోహ్లీ జర్నీ అక్కడితో ఆగిపోలేదు. ఈ సారి కూడా అతడు వాళ్లను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ అయిపోయిన వెంటనే వాళ్లకు కాల్ చేశాడు విరాట్. ఆ టైమ్‌లో విమెన్స్ టీమ్ మొత్తం గెలిచిన సంతోషంలో ఉంది. ప్లేయర్లు అందరూ డాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. కోహ్లీ ఫోన్లో స్టెప్స్ వేస్తూ వాళ్లకు కంగ్రాట్స్ చెబుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని బట్టే స్మృతి సేన విజయాల వెనుక కింగ్ రోల్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మీరు సాధించగలరు, అనుకుంటే గెలవడం పెద్ద విషయం కాదు అంటూ వాళ్లను వెన్ను తట్టి కోహ్లీ ప్రోత్సహించడాడని చెప్పొచ్చు. స్మృతి మాటలు, టైటిల్ నెగ్గిన తర్వాత విరాట్ వాళ్లతో ఫోన్లో మాట్లాడటమే దీనికి ప్రూఫ్. మరి.. ఆర్సీబీ విమెన్స్ టీమ్‌ను కోహ్లీ వెనుక ఉండి నడపడంపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RCB ఫ్యాన్స్.. 16 ఏళ్ల కల తీర్చిన దేవత ఎల్లీస్ పెర్రీ కథ!
CELEBRATION BY KING KOHLI WITH RCB TEAM IN WPL.
– Cutest video of the day. 😍pic.twitter.com/UYxTZzTFAV
— Johns. (@CricCrazyJohns) March 18, 2024
Smriti Mandhana said “I remember in last WPL season Virat bhaiya came into camp & had that pep talk with us which helped me personally a lot and also the whole team”. [Press] pic.twitter.com/S324xOIgl2
— Johns. (@CricCrazyJohns) March 18, 2024