iDreamPost
android-app
ios-app

WPL 2024.. 16 ఏళ్ల నిరీక్షణకు తెర! ఛాంపియన్ గా RCB.. ఇక కోహ్లీ వంతు!

  • Published Mar 18, 2024 | 7:55 AM Updated Updated Mar 18, 2024 | 7:55 AM

16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. తొలి కప్ ను ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇక స్మృతి వంతు అయిపోయింది.. ఇక విరాట్ కోహ్లీ వంతు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. తొలి కప్ ను ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. దీంతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగితేలుతున్నారు. ఇక స్మృతి వంతు అయిపోయింది.. ఇక విరాట్ కోహ్లీ వంతు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

WPL 2024.. 16 ఏళ్ల నిరీక్షణకు తెర! ఛాంపియన్ గా RCB.. ఇక కోహ్లీ వంతు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ మురిసిన వేళ.. 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 టైటిల్ ను సగర్వంగా ముద్దాడింది మహిళల ఆర్సీబీ టీమ్. లేడీ కోహ్లీ స్మృతి మంధాన నాయకత్వంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. బెంగళూరును ఛాంపియన్ గా నిలిపారు ప్లేయర్లు. ఐపీఎల్ లో ప్రతీ ఏటా నిరాశే ఎదురవుతున్నప్పటికీ.. అభిమానులు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో తమ జట్టుకు అండగా నిలుస్తు వస్తూనే ఉన్నారు. అయితే ఈసారి అభిమానుల ఆశలను అడియాశలు చేయకుండా 16 ఏళ్లుగా అందని ద్రాక్షను ముద్దాడింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ లో ఈ టీమ్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో సైతం ఇదే మద్ధతను చూపిస్తు వస్తున్నారు అభిమానులు. తాజాగా WPL 2024 టైటిల్ లో తొలిసారి కైవసం చేసుకుంది ఆర్సీబీ. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 16 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న టైటిల్ ను ఉమెన్స్ టీమ్ ఆర్సీబీకి అందించింది. ఆదివారం ఢిల్లీ వేదికగా జరిగిన WPL ఫైనల్ ల్లో ఆర్సీబీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దీంతో 8 వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించింది.

16 years of waiting is over

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి కేవలం 18.3 ఓవర్లలోనే 113 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. జట్టులో షెఫాలీ వర్మ 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 44 పరుగులు చేసి రాణించింది. మిగతావారు దారుణంగా విఫలమైయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ మెలనూ 3, శ్రేయాంక పాటిల్ 4, ఆషా శోభన 2 వికెట్లతో రాణించారు. అనంతరం 114 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 2 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. ఎల్లీస్ పెర్రీ(35*) సోఫీ డివైన్(32), స్మృతి మంధాన(31) రాణించారు. దీంతో తొలి కప్ ను ఆర్సీబీ తన ఖాతాలో వేసుకుంది.

ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఇది గొప్ప రిలీఫ్. 16 ఏళ్లుగా ఆర్సీబీ ఒక్కసారైనా టైటిల్ ను ముద్దాడదా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇదొక మధురమైన క్షణం. ఇక లేడీ కోహ్లీ కప్ సాధించింది.. ఇక విరాట్ కోహ్లీ వంతే మిగిలి ఉందని ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ తన తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడబోతోంది. ఈసారైనా ఫ్యాన్స్ కోరికను కోహ్లీ నెరవేరుస్తాడా? లేదా? అన్నది తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే! WPL ఆర్సీబీ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: కోహ్లీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత గడ్డపై అడుగుపెట్టిన రన్ మెషిన్!