iDreamPost

బంగ్లా మ్యాచ్ అనంతరం.. జడేజాకు కోహ్లీ క్షమాపణలు! కారణం?

  • Author singhj Published - 06:28 PM, Fri - 20 October 23

బంగ్లాదేశ్​తో మ్యాచ్​ను గెలిపించాడు విరాట్ కోహ్లీ. అద్భుతమైన సెంచరీతో తనను ఛేజింగ్ మాస్టర్ అని ఎందుకు అంటారో మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్​ తర్వాత రవీంద్ర జడేజాకు కోహ్లీ క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు జడ్డూకు కోహ్లీ ఎందుకు సారీ చెప్పినట్లు?

బంగ్లాదేశ్​తో మ్యాచ్​ను గెలిపించాడు విరాట్ కోహ్లీ. అద్భుతమైన సెంచరీతో తనను ఛేజింగ్ మాస్టర్ అని ఎందుకు అంటారో మరోమారు ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్​ తర్వాత రవీంద్ర జడేజాకు కోహ్లీ క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అసలు జడ్డూకు కోహ్లీ ఎందుకు సారీ చెప్పినట్లు?

  • Author singhj Published - 06:28 PM, Fri - 20 October 23
బంగ్లా మ్యాచ్ అనంతరం.. జడేజాకు కోహ్లీ క్షమాపణలు! కారణం?

వన్డే వరల్డ్ కప్-2023లో విరాట్ కోహ్లీ మరోమారు తన బ్యాట్ ప్రతాపం చూపించాడు. బంగ్లాదేశ్​తో గురువారం జరిగిన మ్యాచ్​లో కింగ్ సెంచరీతో అదరగొట్టాడు. టీమిండియా అన్ని విభాగాల్లోనూ రాణించి వరుసగా నాలుగో విక్టరీని అకౌంట్​లో వేసుకుంది. కోహ్లీ (103 నాటౌట్)కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. మ్యాచ్​లో ఒక టైమ్​లో అతను సెంచరీ పూర్తి చేస్తాడో లేదోననే డౌట్ వచ్చింది. అయితే కేఎల్ రాహుల్ సహకరించడం, స్ట్రైక్ పూర్తిగా ఇచ్చేయడంతో కోహ్లీ మరోసారి వంద పరుగుల మార్క్​ను చేరుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ తర్వాత రవీంద్ర జడేజాకు అతడు సారీ చెప్పాడు.

ఈ మ్యాచ్​ గెలుపులో తన కాంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉండాలని భావించానని విరాట్ అన్నాడు. అందుకు తగ్గట్లే దూకుడుగా ఆడానన్నాడు. వరల్డ్ కప్ టోర్నీల్లో హాఫ్ సెంచరీలు చేసినా.. వాటిని సెంచరీలుగా మార్చడంలో ఫెయిల్ అయ్యానన్నాడు కోహ్లీ. అయితే ఈసారి మాత్రం ఆఖరి వరకు క్రీజ్​లో ఉండి మ్యాచ్​ను ముగిద్దామని ఫిక్స్ అయ్యానని తెలిపాడు. మొదటి నాలుగు బంతుల్లోనే రెండు ఫ్రీహిట్స్ వచ్చాయిని.. దీంతో ఒక సిక్స్, ఫోర్ బాదేశానన్నాడు కోహ్లీ. పిచ్ కూడా బ్యాటింగ్​కు బాగా సహకరించిందన్నాడు. టైమింగ్​కు తగ్గట్లు బాల్​ను ఖాళీ ప్లేసెస్​లోకి పంపానని.. రన్స్ తీస్తూనే అవసరమైనప్పుడు బౌండరీలు కొట్టానన్నాడు కోహ్లీ.

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్​లో అద్భుతమైన వాతావరణం ఉంది. ప్రతి ఒక్కరూ ఇతర ప్లేయర్లకు సపోర్ట్​గా ఉంటారు. ప్రపంచ కప్ సుదీర్ఘ టోర్నమెంట్. ఇలాంటి ఇన్నింగ్స్​లు మరిన్ని ఆడుతూ సహచరుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించాలి. స్వదేశంలో భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్ మధ్య మంచి ఇన్నింగ్స్ ఆడటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ఈ సందర్భంగా ఒకరికి సారీ చెప్పాలి. అతడే జడేజా. తన నుంచి నేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును లాగేసుకున్నా’ అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్​లో బౌలింగ్​లో రాణించిన జడ్డూ 2 వికెట్లు తీశాడు. అలాగే మ్యాచ్ కీలక దశలో బంగ్లా సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం ఇచ్చిన క్యాచ్​ను గాలిలో డైవ్ చేస్తూ అద్భుతంగా ఒడిసిపట్టాడు జడ్డూ. అందుకే అతడికి రావాల్సిన అవార్డును తాను లాగేసుకున్నానని చెబుతూ క్షమాపణలు కోరాడు కోహ్లీ. మరి.. జడ్డూకు విరాట్ సారీ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్​ను ఓడించేందుకు ఆ ఒక్క వీక్​నెస్ చాలు! ద్రవిడ్ తప్పుకు మూల్యం తప్పదా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి