వన్డే వరల్డ్ కప్-2023ని టీమిండియా విక్టరీతో మొదలుపెట్టింది. మెగా టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడిన రోహిత్ సేన ఇందులో విజయం సాధించింది. చెన్నైలోకి చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను టీమిండియా బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. భారత పేసర్లతో పాటు స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కంగారూ బ్యాట్స్‌మెన్ ఒక్కో రన్ చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. ఎట్టకేలకు కమిన్స్ సేన 49.3 ఓవర్లలో 199 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కలసి 6 వికెట్లు తీశారు.
ఆసీస్ తర్వాత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఛేజింగ్ ఏమంత ఈజీ కాలేదు. స్కోరు బోర్డు మీదకు 2 పరుగులు చేరకుండానే ముగ్గురు బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌తో పాటు వన్ డౌన్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు. దీంతో గెలిపించాల్సిన భారం విరాట్ కోహ్లీ (85), కేఎల్ రాహుల్ (97 నాటౌట్) పై పడింది. కానీ వాళ్లు ఏమాత్రం తడబడలేదు. ఆసీస్ పేసర్లను సంయమనంగా ఎదుర్కొన్నారు. ఒక్కో రన్ జోడిస్తూ, చెత్త బంతుల్ని బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో విరాట్ ఔటైనా.. హార్దిక్ పాండ్యా (11 నాటౌట్)తో కలసి రాహుల్ టీమ్‌కు విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ, రాహుల్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. వీళ్లిద్దరిపై టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ కూడా ప్రశంసల జల్లులు కురిపించాడు. ‘కోహ్లీ-రాహుల్ తీవ్ర ఒత్తిడిలోనూ చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఫిట్నెస్ లెవల్స్ మెయింటెయిన్ చేయడం, వికెట్ల మధ్య పరుగులు తీయడం ఎలాగో కోహ్లీని చూసి యంగ్ క్రికెటర్లు నేర్చుకోవాలి. డాట్ బాల్స్‌ను తగ్గించడం, స్ట్రైక్ రొటేట్ చేస్తూ బౌలర్లపై ఒత్తిడి పెంచడం ఎలాగో విరాట్ బ్యాటింగ్‌ను చూస్తే అర్థమవుతుంది’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. విరాట్ ఎక్కువగా రిస్క్ తీసుకోడని.. కానీ అతడి డాట్ బాల్ పర్సంటేజీ తక్కువగా ఉంటుందన్నాడు గంభీర్. స్ట్రైక్ రొటేట్ చేయడమే కోహ్లీ సక్సెస్ సీక్రెట్ అని గౌతీ పేర్కొన్నాడు. మరి.. కోహ్లీపై గంభీర్ చేసిన వ్యాఖ్యల మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సచిన్ రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ.. అందుకే ఛేజ్ మాస్టర్ అనేది!
Gautam Gambhir said, “Virat Kohli plays low risk cricket. His dot ball percentage is very low, he keeps rotating the strike. Youngsters need to learn from him”. pic.twitter.com/xkBzLMbjiu
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 8, 2023