న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచ్‌కు ముందు భారత మేనేజ్మెంట్ను కోహ్లీ భయం పట్టుకుంది. మళ్లీ విరాట్ వీక్నెస్ మీద కొట్టేందుకు కివీస్ ప్రయత్నిస్తోంది.
న్యూజిలాండ్‌తో నాకౌట్ మ్యాచ్‌కు ముందు భారత మేనేజ్మెంట్ను కోహ్లీ భయం పట్టుకుంది. మళ్లీ విరాట్ వీక్నెస్ మీద కొట్టేందుకు కివీస్ ప్రయత్నిస్తోంది.
వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా బ్రేకుల్లేని బుల్డోజర్లా వరుస విక్టరీలు కొడుతూ దూసుకెళ్తోంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తుగా ఓడించి పాయింట్స్ టేబుల్లో టాప్‌లో నిలిచింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత్ ముందు డచ్ టీమ్ నిలబడలేకపోయింది. ఏ దశలోనూ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అయితే నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ యూనిట్ ఆడిన తీరు సూపర్బ్ అనే చెప్పాలి. ఓపెనర్లు రోహిత్ శర్మ-శుబ్‌మన్ గిల్ ధనాధన్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో భారత్ 11 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్-కేఎల్ రాహుల్ భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. ఈ మిడిలార్డర్ బ్యాటర్లు ఇద్దరూ కలసి నాలుగో వికెట్‌కు ఏకంగా 208 రన్స్ జోడించడం విశేషం.
భారత ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ (51) బ్యాటింగ్‌ను కూడా మెచ్చుకోవాలి. గట్టి పునాది వేసిన ఓపెనర్లు ఇద్దరూ స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగినా.. అయ్యర్‌తో కలసి ఇన్నింగ్స్‌ను విరాట్ నిలబెట్టాడు. చిన్నస్వామి స్టేడియంలో బ్యాట్ మీదకు బాల్ సరిగ్గా రాకపోవడంతో షాట్లు కొట్టడం కష్టమైపోయింది. ఈ టైమ్‌లో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ రన్‌రేట్ పడిపోకుండా చూశాడు కింగ్. కోహ్లీ ఇచ్చిన మద్దతుతో ఆ తర్వాత అయ్యర్, రాహుల్‌లు రెచ్చిపోయి ఆడారు. అయితే ఈ మ్యాచ్‌లో సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లీ కాస్త లెఫ్టార్మ్ స్పిన్నర్ వాండర్ మెర్వ్ బౌలింగ్‌లో ఔటై నిరాశపర్చాడు. స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్స్‌లో బ్యాక్ ఫుట్‌లో కట్ షాట్లు ఆడటం విరాట్ స్టైల్ కాదు. కానీ ఈ మ్యాచ్‌లో ఆ షాట్‌కు ప్రయత్నించి వికెట్‌ను పారేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయమే భారత మేనేజ్మెంట్ను భయపెడుతోంది.
లెఫ్టార్స్ స్పిన్నర్లను ఫేస్ చేయడంలో కోహ్లీ చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్నాడు. 2022 నుంచి లెఫ్టార్మ్ స్పిన్నర్ల బౌలింగ్‌లో 11 ఇన్నింగ్స్‌ల్లో 121 రన్స్ మాత్రమే చేశాడు విరాట్. ఎడమ చేతి వాటం స్పిన్నర్ల బౌలింగ్‌లో కోహ్లీ ఏకంగా 9 సార్లు ఔటవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అతడి బ్యాటింగ్ యావరేజ్ 13.44గా ఉంది. నెదర్లాండ్స్ టీమ్ కూడా ఇదే బలహీనతపై కొట్టింది. ఈ మ్యాచ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్‌కే చిక్కాడు విరాట్. దీంతో సెమీస్ మ్యాచ్‌లో ఇదే వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని న్యూజిలాండ్ ప్రయత్నిస్తోంది. ఆ జట్టు ప్రధాన స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ విరాట్‌ను తన వలలో చిక్కుకునేలా చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నాడు. కాబట్టి నాకౌట్ మ్యాచ్‌లో ఈ బలహీనతను కింగ్ అధిగమించాల్సి ఉంటుంది. శాంట్నర్‌తో పాటు లెఫ్టార్మ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను కోహ్లీ ఎదుర్కొనే తీరును బట్టి భారత విజయావకాశాలు ప్రభావితం అవుతాయని చెప్పొచ్చు. మరి.. కోహ్లీ వీక్నెస్పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: సెమీస్‌లో ఇండియా దాటాల్సిన 5 సవాళ్లు! మూడోది చాలా డేంజర్!